Shashank Singh : అయ్యర్ జట్టులో ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోస్ ఇంగ్లిస్ మాత్రమే పర్వాలేదనిపించారు. కెప్టెన్ అయ్యర్ , స్టోయినీస్, దారుణంగా విఫలమయ్యారు. వీరు గనక నిలబడి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. పంజాబ్ జట్టుకు కచ్చితంగా విజయం దక్కేది. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేది. కానీ కీలకమైన మ్యాచ్ లో .. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో పంజాబ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో ఒక్కసారిగా బెంగళూరు పట్టు సాధించింది. ఈ మైదానంపై 200 స్కోర్ నమోదు కాకపోవడంతో కచ్చితంగా పంజాబ్ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. కీలక దశలో పంజాబ్ ప్లేయర్లు చేతులెత్తేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హేజిల్ వుడ్, కృణాల్ పాండ్యా వంటి వారు పట్టు బిగించడం.. రోమారియో షెఫర్డ్ వంటి బౌలర్ కీలకమైన అయ్యర్ వికెట్ తీయడంతో పంజాబ్ జట్టు గెలుపు ముందు బోల్తా పడింది. పంజాబ్ బ్యాటర్లు బెంగళూరు బౌలర్ల ముందు తలవంచితే.. ఒక్క ఆటగాడు మాత్రం సింహం లాగా జూలు విధిల్చాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా.. బెరుకు అనేది లేకుండా దుమ్ము రేపాడు. పరుగుల వరద పారించి ఆకట్టుకున్నాడు.
Also Read : అయ్యర్ భయ్యా.. ఇక్కడ దాకా తీసుకొచ్చి..ఇలా చేశావేంటి?
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరులో ఒక్క ఆటగాడు కూడా ఆఫ్ సెంచరీ చేయలేదు. ఇక సెకండ్ చేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, అయ్యర్ వంటి వారు కూడా అర్ద సెంచరీ నమోదు చేయలేకపోయారు. కానీ శశాంక్ సింగ్ మాత్రం అదరగొట్టాడు. చివరి వరకు నిలబడ్డాడు. ఇంకో రెండు బంతులు గనుక ఉండి ఉంటే.. కచ్చితంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవాడు. అప్పటికే అతడు 30 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో ఏకంగా 61 పరుగులు చేశాడు.. అతడి ఇన్నింగ్స్ లో ఫోర్లకంటే సిక్సర్లే అధికంగా ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్టోయినీస్, ఓమర్ జాయ్, జైమీసన్ లో ఎవరో ఒకరు సహకరించినా పంజాబ్ గెలిచేది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో శశాంక్ సింగ్ 35 పరుగులు రాబట్టాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 19 ఓవర్లో 13 పరుగులు, హేజిల్ వుడ్ వేసిన చివరి ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు. అయితే హేజిల్ వుడ్ వేసిన తొలి రెండు బంతులను శశాంక్ సింగ్ వదిలివేయకుంటే.. కచ్చితంగా మ్యాచ్ ఫలితం పంజాబ్ జట్టుకు అనుకూలంగా ఉండేది. ఆ రెండు బంతులను అతడు వదిలేయడం.. చివరి నాలుగు బంతుల్లో 22 పరుగులు రాబట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఒకవేళ అతడు గనుక తొలి రెండు బంతుల్లో ఏదో ఒకదానిని సిక్సర్ కొట్టి ఉంటే.. కచ్చితంగా మ్యాచ్ ఫలితం పంజాబ్ జట్టుకు అనుకూలంగా ఉండేది. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో పంజాబ్ జట్టు ముంబై తో తలపడినప్పుడు.. గెలిచే దశలో ఉన్నప్పుడు శశాంక్ సింగ్ నిర్లక్ష్యం వల్ల రన్ ఔట్ అయ్యాడు. ఆ సమయంలో పంజాబ్ కెప్టెన్ అయ్యర్ శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. కానీ ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ అయ్యర్ ఒక పరుగు చేసి అవుట్ అయితే.. శశాంక్ సింగ్ మాత్రం వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించాడు.