Shreyas Iyer : గిల్ క్రిస్ట్, యువ రాజ్ సింగ్ వంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు నాయకత్వం వహించినప్పటికీ.. పంజాబ్ జట్టు ఎన్నడూ కూడా విజేతగా నిల్వలేకపోయింది. కానీ ఈసారి నాయకుడు మారాడు. కొత్తగా అయ్యర్ వచ్చాడు. జట్టును మార్చాడు. ఒక్కసారిగా ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. అసాధ్యం అనుకున్న లక్ష్యాలను సాధ్యం అనుకునేలా చేశాడు. ఫలితంగా బలమైన జట్లను ఓడించి ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. ఒకానొక దశలో టైటిల్ ఫేవరెట్ గా బెంగళూరు జట్టును దాటేలా చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత.. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత.. బెంగళూరు జట్టును 190 పరుగుల వద్ద ముగించిన తర్వాత.. పంజాబ్ జట్టు కచ్చితంగా గెలుస్తుందని.. అందులో ఏమాత్రం అనుమానం లేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి..
Also Read : RCB ఓనర్ ఎవరు ? విజయ్ మాల్యా కి ఇంకా వాటా ఉందా ?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగానే పంజాబ్ ప్లేయర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఒక దశలో బెంగళూరు బౌలర్లను డిఫెన్స్ లో పడేశారు. ఫ్లాట్ పిచ్ పై పరుగుల వరద ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇక్కడే బెంగళూరు జట్టు కెప్టెన్ ఏ మాత్రం తన బౌలర్ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేదు. మార్చి మార్చి బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. అయితే పంజాబ్లో మిగతా ప్లేయర్లు ఔట్ అయినప్పటికీ.. అయ్యర్ మీద అందరికీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అతడు ముంబై జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపాన్ని ఒకసారిగా మార్చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో మాత్రం దారుణంగా తేలిపోయాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అత్యంత నిరాశజనకంగా అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ స్వరూపం ఒకసారి గా మారిపోయింది. అనూహ్యంగా బెంగళూరు చేతిలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి అయ్యర్ కనుక నిలబడి ఉంటే కచ్చితంగా పంజాబ్ గెలుపును దక్కించుకునేది. 18 సంవత్సరాల తర్వాత ట్రోఫీని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించేది. కానీ ఆ అవకాశాన్ని అందుకోలేక పంజాబ్ జట్టు కన్నడ జట్టు ఎదుట తలవంచాల్సి వచ్చింది. పరిణామం ప్రీతిజింతా జట్టు అభిమానులను తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది.
వాస్తవానికి ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలవడానికి అవకాశం ఉంది. పైగా భారీ ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. బీభత్సంగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం వారికి ఉంది. కానీ అత్యంత దారుణమైన స్థితిలో వారు అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ కన్నడ జట్టు చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో 18 సంవత్సరాల నిరీక్షణ పంజాబ్ జట్టుకు అలాగే ఉండిపోయింది. బెంగళూరుకు 18 సంవత్సరాల కల తీరిపోయింది. మొత్తంగా 2025లో బెంగళూరు రూపంలో సరికొత్త ఐపిఎల్ ఛాంపియన్ ఆవిర్భవించింది. విరాట్ చేయలేనిది, డివిలియర్స్ వల్ల కానిది, గేల్ సాధించలేనిది రజత్ పాటిదార్ నాయకత్వంలో బెంగళూరు కన్నడ జట్టు ట్రోఫీ గెలిచింది.