Kannappa Pre Release Event: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఈ చిత్రం కోసం తన వైపు నుండి బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. సినిమా ఎలా వచ్చిందో ప్రస్తుతానికి తెలియదు కానీ, ఫైనల్ కాపీ మాత్రం రెడీ అయిపోయింది. రన్ టైం దాదాపుగా మూడు గంటలు ఉందట. ఈమధ్య కాలంలో ఇంత నిడివి తో విడుదలైన సినిమాలు లేవు. కానీ స్టోరీ ఆసక్తికరంగా ఉండడంతో మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ బోర్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదట. ఇకపోతే ఈ చిత్రం ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు ఆ తేదీన ఈ సినిమా రావడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం కూడా లేకపోలేదు.
పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 12 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్న మేకర్స్ కి బయ్యర్స్ అందరూ జూన్ 26 న విడుదల చేయమని ఒత్తిడి చేస్తున్నారట. ఎందుకంటే జులై లో భారీ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయని, ఆ సమయం లో థియేటర్స్ దొరకడం చాలా కష్టం అవుతుందని చెప్పుకొచ్చారట. నిర్మాత AM రత్నం కూడా అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ నెల 26 న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఓవర్సీస్ బయ్యర్స్ చెప్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన పక్క రోజే ‘కన్నప్ప’ చిత్రం విడుదల కాబోతుంది. అలా జరిగితే రెండవ రోజు నుండి ‘హరి హర వీరమల్లు’ కి థియేటర్స్ బాగా తగ్గిపోతాయి. అందుకే కాస్త వాయిదా వేయాల్సిందిగా కోరారట మూవీ టీం.
ముందుగా ‘కన్నప్ప’ మేకర్స్ ఒప్పుకోలేదట. దీంతో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం ఎలాగో విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి, ఆ తేదీన ‘హరి హర వీరమల్లు’ ని విడుదల చేద్దామని అనుకున్నారట. కానీ అమెజాన్ ప్రైమ్ సంస్థ అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితి లో ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే విడుదల చెయ్యాలని పట్టుబట్టడం తో మరోసారి ‘కన్నప్ప’ మేకర్స్ ని రిక్వెస్ట్ చేశారట. ఈసారి కన్నప్ప టీం వారం రోజులు వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకుందట కానీ, పవన్ కళ్యాణ్ తమ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని షరతు పెట్టారట. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇక ట్రైలర్ కట్ రెడీ అవ్వడమే తరువాయి, సినిమాని జూన్ 26 న విడుదల చేయడానికి మూవీ టీం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.