Homeక్రీడలుక్రికెట్‌IND vs SL Test Series: 175 పరుగులు.. తొమ్మిది వికెట్లు.. మనోడిని తలుచుకుంటేనే పోసుకుంటున్న...

IND vs SL Test Series: 175 పరుగులు.. తొమ్మిది వికెట్లు.. మనోడిని తలుచుకుంటేనే పోసుకుంటున్న శ్రీలంక..

IND vs SL Test Series: శ్రీలంక జట్టుతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.. ఈ టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యం. అందువల్లే సమర్థవంతమైన ప్లేయర్లను మేనేజ్మెంట్ రంగంలోకి దింపింది. ఆల్ రౌండర్లను.. స్పెషలిస్ట్ బ్యాటర్లను.. బౌలర్లను జట్టులోకి తీసుకుంది. శ్రీలంక మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించిన మేనేజ్మెంట్ ఈసారి సీనియర్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంది.. ఇతడికి శ్రీలంక […]

IND vs SL Test Series: శ్రీలంక జట్టుతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.. ఈ టెస్ట్ సిరీస్ టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యం. అందువల్లే సమర్థవంతమైన ప్లేయర్లను మేనేజ్మెంట్ రంగంలోకి దింపింది. ఆల్ రౌండర్లను.. స్పెషలిస్ట్ బ్యాటర్లను.. బౌలర్లను జట్టులోకి తీసుకుంది.

శ్రీలంక మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించిన మేనేజ్మెంట్ ఈసారి సీనియర్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంది.. ఇతడికి శ్రీలంక మీద అద్భుతమైన రికార్డు ఉంది. బౌలింగ్ వేయగలడు. బ్యాటింగ్ చేయగలడు. ఫీల్డింగ్ అద్భుతంగా చేయగలడు. ఇన్ని సానుకూలతలు ఉన్నాయి కాబట్టి.. ఇతడికి మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.

రవీంద్ర జడేజా కు శ్రీలంక మీద గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా 2022లో మొహాలీ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ గెలవడానికి ప్రధాన కారణం జడేజా. ఒక స్టేజిలో 228 పరుగులకే టీమిండియా 5 వికెట్ల కోల్పోయింది. అప్పుడు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడు రవీంద్ర జడేజా. రిషబ్ పంత్ తో కలిసి విధ్వంసం నెలకొల్పాడు. ఇతడితో కలిసి 104 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. పంత్ ఔట్ అయిన తర్వాత జడేజా ఒక్కసారిగా తన ఆట తీరు మార్చాడు. టి20 ఫార్మాట్ లాగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక బౌలర్ల మీద ఎదుటి దాడికి దిగాడు. కేవలం 160 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చూస్తుండగానే 175* పరుగులు కొట్టాడు. అక్కడితోనే జడేజా ఆగిపోలేదు.

బంతి చేతితో పట్టుకొని శ్రీలంక పతనాన్ని మొత్తం శాసించాడు. తన స్పిన్ బౌలింగ్ ఎంత ప్రమాదకరమో శ్రీలంక బ్యాటర్లకు చూపించాడు. 28 పరుగులు చేసిన కెప్టెన్ కరుణ రత్నను వెనక్కి పంపించాడు. సురంగ.. లసిత్.. విశ్వ.. కుమార.. ఇలా పేరు మోసిన బ్యాటర్లను అవుట్ చేసి లంకకు షాక్ ఇచ్చాడు. కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. జడేజా ధాటికి 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలడంతో.. శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. ఈసారి కూడా శ్రీలంక ఆశల మీద జడేజా నీళ్లు చెల్లాడు. శ్రీలంక బ్యాటర్ ధనుంజయ అవుట్ చేసి.. తన వికెట్ల ప్రస్థానాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. ఏంజెల్ మాథ్యూస్.. ఎంబుల్ జేనియా ను అవుట్ చేసి.. రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 175 రన్స్.. 9 వికెట్లు సొంతం చేసుకొని తిరుగులేని రికార్డును సృష్టించాడు. ఇప్పుడు ఇతడు జట్టులోకి రావడంతో శ్రీలంక భయపడుతోంది. జీవం లేని మైదానాల మీద అదరగొట్టే జడేజా.. శ్రీలంక లాంటి మైదానాల మీద సత్తా చూపించడం ఖాయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper