Homeక్రీడలుBabar Azam : ఒరేయ్ ఆజామూ.. అది షార్ట్ పిచ్ బాల్.. ఉప్పల్ బాలు లా...

Babar Azam : ఒరేయ్ ఆజామూ.. అది షార్ట్ పిచ్ బాల్.. ఉప్పల్ బాలు లా ఆడితే ఎలా..

Babar Azam : సాధారణంగా క్రికెటర్లు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి సాహసం చేయరు. ఒకవేళ తప్పదు అనుకుంటే ఆ బంతులను జాగ్రత్తగా ఆడుతుంటారు. చాలా నిదానంగా బంతికి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. మన పంత్ లాంటి బ్యాటర్లు అయితే కిందా మీదా పడి బంతిని స్టాండ్స్ అవతలికి పంపిస్తారు. ఈ విషయం తెలిసి కూడా పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ షార్ట్ పిచ్ బంతిని అనవసరంగా వెంటాడాడు. చివరికి చేతులెత్తేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్టుతో […]

Babar Azam : సాధారణంగా క్రికెటర్లు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి సాహసం చేయరు. ఒకవేళ తప్పదు అనుకుంటే ఆ బంతులను జాగ్రత్తగా ఆడుతుంటారు. చాలా నిదానంగా బంతికి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. మన పంత్ లాంటి బ్యాటర్లు అయితే కిందా మీదా పడి బంతిని స్టాండ్స్ అవతలికి పంపిస్తారు.

ఈ విషయం తెలిసి కూడా పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ షార్ట్ పిచ్ బంతిని అనవసరంగా వెంటాడాడు. చివరికి చేతులెత్తేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయింది. 103 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ అన్ని విభాగాలలో ప్రతిభ చూపి.. అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది.

రెండవ మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ వేదికగా మొదలైంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 290 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 208 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులకే కుప్ప కూలింది. రెండవ ఇన్నింగ్స్ లో ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట ఇంకా కొనసాగుతోంది. ఐదవరోజు పాకిస్తాన్ ప్లేయర్లు ఆడిన తీరు ఆధారంగానే.. ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. కొంతకాలంగా అతడు సరిగ్గా ఆడటం లేదు. పాకిస్తాన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అతడు ఎదుర్కోలేకపోయాడు. పైగా ఆ బంతిని ఆడే క్రమంలో అతడి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచింది. స్లిప్ లో ఉన్న జోర్డాన్ కాక్స్ ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో బాబర్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

” పాకిస్థాన్ సారథి గారు.. అది షార్ట్ పిచ్ బంతి.. దానిని సాధ్యమైనంతవరకు నిదానంగా ఆడాలి. ఆడే సామర్థ్యం లేకపోతే వదిలేయాలి. అది ఏమైనా రబ్బర్ బంతి అనుకున్నావా.. ఉప్పల్ బాలు లాగా ఆడితే.. ఇదిగో ఇలానే అవుట్ అవుతావు అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper