Homeక్రీడలుక్రికెట్‌VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్... ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి అనే ప్రణాళిక మాత్రమే ఉంటుంది. ఆటగాళ్లు సరిగా ఆడకపోతే చిరాకు రాదు.. వాళ్లను ఎలా గాడిలో పెట్టాలి అని ఆలోచన మాత్రమే మదిలో ఉంటుంది. వీటన్నింటికీ పేరు పెడితే.. అది వివిఎస్ లక్ష్మణ్ అవుతుంది. టెస్ట్ క్రికెట్లో అతడు లెజెండ్. వన్డేలో నిరూపించుకున్నాడు. […]

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి అనే ప్రణాళిక మాత్రమే ఉంటుంది. ఆటగాళ్లు సరిగా ఆడకపోతే చిరాకు రాదు.. వాళ్లను ఎలా గాడిలో పెట్టాలి అని ఆలోచన మాత్రమే మదిలో ఉంటుంది. వీటన్నింటికీ పేరు పెడితే.. అది వివిఎస్ లక్ష్మణ్ అవుతుంది.

టెస్ట్ క్రికెట్లో అతడు లెజెండ్. వన్డేలో నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డమీద స్థిరంగా జాతీయ జెండాను ఎగరేశాడు. ఓడిపోయే మ్యాచ్ మొత్తాన్ని గెలిపించాడు. ఆస్ట్రేలియా గర్వాన్ని నేలకు దించాడు. అంతేకాదు స్థిర చిత్తానికి బలమైన నిదర్శనంగా నిలబడ్డాడు. తెలుగోడిగా.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చూపించి.. తిరుగులేని స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.

ఆటగాడిగా అదరగొట్టిన లక్ష్మణ్.. ఇప్పుడు జాతీయ జట్టుకు శిక్షకుడిగా కూడా సత్తా చూపిస్తున్నాడు. గంభీర్ విఫలమవుతున్న వేళ.. వరుస ఓటములు ఇబ్బంది పెడుతున్న వేళ లక్ష్మణ్ భవిష్యత్తు ఆశాదీపం లాగా కనిపిస్తున్నాడు. ఇతడి శిక్షణలో టీమిండియా ఆరు సిరీస్ లు గెలిచింది. ఇతడి శిక్షణలో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 99%. దీనిని బట్టి ఈ తెలుగోడి శిక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2022లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో టీమిండియా వైట్ వాష్ చేసింది. నాడు రెండు మ్యాచ్లను టీమిండియా ఏకపక్షంగా గెలిచింది.

2022లో జింబాబ్వే జట్టుతో జరిగిన సిరీస్ లో టీమిండియా మూడు మ్యాచ్లు గెలిచింది. ఈ సిరీస్ కూడా టీమిండియా వైట్ వాష్ చేసింది.

2022లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో టీమిండియా ఓటమిపాలైంది.

2024 లో జింబాబ్వే జట్టుతో జరిగిన సిరీస్ ను టీమిండియా 4-1 సొంతం చేసుకుంది.

2024 లో సౌత్ ఆఫ్రికా జరిగిన సిరీస్ లో టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది.

2026 లో జింబాబ్వే జట్టుతో జరుగుతున్న సిరీస్ లోనూ టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకుంది.

లక్ష్మణ్ శిక్షణలో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ అమాంతం పెరిగింది. అందువల్లే అతడిని గంభీర్ స్థానంలో శిక్షకుడిగా నియమించాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ మాదిరిగా లక్ష్మణ్ లో కోపం లేదని.. అతడు సమర్థవంతమైన శిక్షకుడని అభిమానులు కొనియాడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper