IND VS NZ 3rd Test : ఊహించినట్టుగానే ముంబై టెస్ట్ మలుపులు తిరుగుతోంది. స్పిన్ వికెట్ గా రూపొందించిన మైదానం స్పిన్ బౌలర్లకు స్వర్గధామం లాగా మారింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్ ఆజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొడితే.. న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించారు. ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
స్వల్ప ఆధిక్యం
84/4 ఓవర్ నైట్ స్కోర్ తో శనివారం రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు.. పంత్, గిల్ బ్యాటింగ్ దూకుడుతో స్థిరంగా రాణించింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు ఏకంగా 96 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ 60 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు ఇష్ సో ది బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 14 పరుగులు చేసి ఫిలిప్స్ బౌలింగ్లో మిచెల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఇదే ఊపులో 90 పరుల వద్దకు చేరుకున్న గిల్.. సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు 90 పరుగుల వద్ద అజాజ్ పటేల్ బౌలింగ్ లో మిచెల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ 38* పరుగులు చేసినప్పటికీ.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి ఆశించినంత స్థాయిలో ప్రోత్సాహం లభించలేదు. దీంతో టీమిండియా 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో న్యూజిలాండ్ పై టీమిండియాకు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
న్యూజిలాండ్ పేక మేడలా
బంతి అంతకంతకూ గింగిరాలు తిరుగుతున్న నేపథ్యంలో.. భారత బౌలర్లు సత్తా చాటారు. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ పూర్వపు లయను అందుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లను బెంబలెత్తించారు. రెండు పరుగుల వద్ద కెప్టెన్ లాతం వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. విల్ యంగ్(51), కాన్వే(22), ఫిలిప్స్(26), మిచెల్(21) పర్వాలేదనిపించారు. ఇక మిగతా ఆటగాళ్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. స్పిన్ వికెట్ పై భారత బౌలర్లు పండగ చేసుకున్నారు. వాస్తవానికి న్యూజిలాండ్ జట్టు శనివారం సాయంత్రానికి ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో హెన్రీ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించడంతో.. న్యూజిలాండ్ 171/9 వద్ద నిలిచింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 143 పరుగుల లీడ్ లో నిలిచింది. ఆదివారం న్యూజిలాండ్ జట్టును ఆల్ అవుట్ చేసి.. ఆ జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించాలని టీమిండియా భావిస్తుంది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి వెళ్లాలంటే ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కచ్చితంగా గెలవాల్సి ఉంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: In new zealands second innings ravindra jadeja took 4 wickets and ravichandran ashwin created a sensation by taking 3 wickets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com