Naga Durga: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సక్సెస్ ని గ్రౌండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. అందుకే దానికోసం విపరీతంగా కష్టపడుతుంటారు.ఈ క్రమంలోనే కొందరికి సక్సెస్ లు వస్తే మరి కొంతమంది ఫెయిల్యూర్స్ ను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇదిలా ఉంటే యూట్యూబ్లో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న కొంతమంది ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఫోక్ సాంగ్స్ కి డాన్స్ లను వేస్తూ ప్రేక్షకులందరిని అలరించిన నాగదుర్గ సైతం ఇప్పుడు ‘ఇడుపు కాయితం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగదుర్గ తన డ్యాన్స్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె నుంచి ఒక సాంగ్ వచ్చిందంటే చాలు మిలియన్ వ్యూస్ ఈజీగా వచ్చేస్తుంటాయి.
తద్వారా ఆమె పాపులారిటిని చూసిన సినిమా మేకర్స్ సైతం ఆమెను తమ సినిమాలో భాగం చేస్తే వాళ్ళ సినిమాకి మంచి గుర్తింపు లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే నాగదుర్గను ఇడుపు కాయితం సినిమాలో భాగం చేశారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నాగ దుర్గ తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా ప్రభాస్ సినిమాలు అంటే తనకి విపరీతమైన ఇష్టమని చెప్పింది.
అలాగే ప్రభాస్ కి తను డై హార్ట్ ఫ్యాన్ నని, తన సినిమాలను థియేటర్లో చూసినప్పుడు అందరిలా కూర్చొని చప్పట్లు కొట్టడం కాకుండా పేపర్లను విసిరేస్తూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తానని కూడా చెప్పింది. అలాగే తన ఇంట్లో గోడకి మొత్తం ప్రభాస్ పోస్టర్లే ఉంటాయని, ప్రభాస్ వాడిన టీ షర్ట్లు అతను వాడిన వాచీ లాంటివి కొని తన కజిన్స్ కి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటానని నాగ దుర్గ చెప్పడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ అంటే తనకు విపరీతమైన పిచ్చి అని కూడా ఆమె చెబుతుండడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సైతం నాగ దుర్గ విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. తమ అభిమాన హీరోను నాగ దుర్గ కూడా అభిమానిస్తూ ఉండడం వాళ్లకు విపరీతంగా నచ్చింది. దాంతో నాగదుర్గ పాటలకే కాదు తను చేయబోయే సినిమాలకు కూడా మా పూర్తి సపోర్ట్ ఉంటుందని ప్రభాస్ అభిమానులు అండగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…