Film Shoot Controversy: ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇండియా మొత్తాన్ని డామినేట్ చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించింది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుండటం తో బాలీవుడ్ హీరోలను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. తెలుగు హీరోలు సైతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా హీరోలు స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తున్నారు… ఈ క్రమంలోనే ఆ దర్శకులు సైతం హీరోలతో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. ప్రేక్షకులను రంజింప చేయడానికి ఎలాంటి కాన్సెప్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ధోరణిలో కూడా కొన్ని ఆలోచనలైతే చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా హీరో తో సినిమా చేస్తున్న ఒక స్టార్ డైరెక్టర్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ మీద అరుస్తూ బండ బూతులు తిట్టాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఆ సినిమా సెట్ లో ఉన్న చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు సైతం ఆ దర్శకుడు గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆ దర్శకుడు ఎవరు అనే విషయం పక్కన పెడితే తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆడ మనిషిని పట్టుకొని అలా బండబూతులు తిట్టడం తప్పు అంటూ చాలామంది చాలా రకాలుగా ఖండిస్తున్నారు.
సెట్లోనే కొందరు దర్శకుడి వైఖరి మీద అతను అనుసరిస్తున్న విధానం తప్పు అని చెప్పారట. అక్కడున్న పాన్ ఇండియా హీరో సైతం ఆ దర్శకుడి బిహేవియర్ తో చాలా వరకు విసిగిపోయినట్టుగా తెలుస్తుంది…దర్శకుడికి టెన్షన్స్ ఉంటే ఉండొచ్చు సినిమా అనుకున్నట్టుగా రాకపోతే ఎవరికైనా కోపం ఉంటుంది.
సరైన సమయంలో పనులు జరగకపోతే కింది వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అదంతా కామన్ కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళందరిని ఏకతాటి మీద టీమ్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లిన వాడే దర్శకుడు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఎవరు తప్పు చేసిన కూడా దానిని సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్లగలిగే క్వాలిటీ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఎందులో అయిన టాప్ పొజిషన్లో ఉంటారు…