Nithiin Alias Rukmini: ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోని నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగిస్తున్న నితిన్ సైతం ఒక్క సినిమాతో సక్సెస్ ని సాధించడానికి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాడు. తన తోటి హీరోలందరు టైర్ వన్ హీరోలుగా మారుతుంటే ఆయన మాత్రం ఎప్పటికప్పుడు ఒక సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటికే వరుసగా 6 ఫ్లాప్ లను మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు అయినా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ‘అలియాస్ రుక్మిణి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని నాని ప్రెసెంట్ చేస్తుండగా నాని వాళ్ల అక్క దీప్తి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండడం విశేషం…దండోరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళి కాంత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నితిన్ సక్సెస్ ని సాధించి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన గింప్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే రుక్మిణి ఎవరు అనే డౌట్ అందరికీ రావచ్చు.
అది నితిన్ భార్య పేరు కావడం ఆయన తన భార్య పేరు మీదుగా కొన్ని పుస్తకాలైతే రాస్తాడట. అంటే ఆయన రాసిన పుస్తకాల్లోని క్యారెక్టర్స్ ప్రేక్షకుల ముందుకు వస్తాయా? ఆ కథలతోనే సినిమా కథ నడుస్తుందా? ఇదంతా ఫాంటసీ స్టోరీ లా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే నితిన్ ఈ సినిమాలో రైటర్ గా కనిపిస్తున్నాడు.
నిజానికి నాని ప్రజెంట్ చేస్తున్నాడు అంటే సినిమాలో కథ ఉంటేనే ఆయన ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంటాడు. లేకపోతే మాత్రం పక్కన పెట్టేస్తాడు. ఇంతకుముందు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలైనా ఆయన హీరోగా చేస్తున్న సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక ఈ సినిమాలో సైతం కంటెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే నాని ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు.
తన అక్క చేత ఈ సినిమాను నిర్మింపజేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా నితిన్ ఈ గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. కాబట్టి నితిన్ కి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి పెడుతుందటూ అతని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ సినిమా కంటెంట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…