Odi World Cup 2023: వరల్డ్ కప్ 2023 లో ఎప్పుడు ఉత్కంఠను కల్గించే మ్యాచ్ లే కాదు అప్పుడప్పుడు మనల్ని ఆనందానికి గురి చేసే మూమెంట్స్ కూడా జరుగుతుంటాయి….ఇక నిన్న ఇండియ న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ అద్భుతమైన విక్టరీని సాధించింది.ఇక దాంతో ఇండియా ఫైనల్ లో అడుగు పెట్టగా న్యూజిలాండ్ టీమ్ మాత్రం ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం కి భారీ ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.ఇక ఇండియా తో పాటు గా ఈనెల 19 వ తేదీన ఫైనల్ ఆడబోయే టీం ఏది అనే దాని మీదనే ఇపుడు చర్చ నడుస్తుంది.
ఇక ఇవాళ్ల రెండో సెమీ ఫైనల్ ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య భారీ ఫైట్ అయితే జరుగబోతోంది.ఇందులో ఏ టీం అయితే విజయం సాధిస్తుందో ఆ టీం ఫైనల్ బెర్త్ కు అర్హత సాధిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి మాత్రం ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే ఎంపైర్ కుమార్ ధర్మసేన ఎవరితో అయితే సెల్ఫీ దిగి ఫోటో పెట్టుకుంటాడు ఆ టీమ్ లు రన్నరప్ లుగా మిగులుతున్నాయంటూ పెద్ద ఎత్తున అతని మీద ట్రోలింగ్ నడుస్తుంది. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో ఫోటో దిగి సోషల్ మీడియా లో పెట్టాడు అప్పుడు ఆ టీం రన్నరప్ గా నిలిచింది. ఇక 2022 t20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఒక సెల్ఫీ దిగి పెట్టాడు. అప్పుడు పాకిస్తాన్ టిప్ రన్నరప్ గా నిలిచింది. ఇక 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ కి ముందు రోహిత్ శర్మతో ఒక ఫోటో దిగి పెట్టాడు. అప్పుడు ఇండియన్ టీం కూడా రన్నరప్ గా మిగిలింది.
ఇక ఇప్పుడు ఆయన సెల్ఫీ దిగడానికి వస్తుంటే ప్రతి కెప్టెన్ కూడా పరుగులు పెడుతున్నట్టుగా ఒక మీమ్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. దాంతో కుమార్ ధర్మసేన మీద భారీ ఎత్తున ట్రోలింగ్ అయితే నడుస్తుంది. ఇక ఆ మీమ్స్ కి క్రికెట్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఆయన ఎంపైరింగ్ సరిగా చేయలేరు అంటు కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఆయన ఏ కెప్టెన్ తో అయితే ఫోటో దిగుతాడో ఆ కెప్టెన్ మసైపోవడం మాత్రం పక్కా అంటూ ట్రోలింగ్ నడుస్తుంది.ఇక ఇలా వరల్డ్ కప్ లో మ్యాచ్ కి సంబంధించిన టెన్షనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ ట్రోలింగ్స్ కూడా చేస్తూ జనాలని నవ్వించడంలో క్రికెట్ అభిమానులు ఎప్పుడు ముందుంటారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More