Rakul Preet Singh: ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక షాప్ కి వెళ్లి కండోమ్ కొన్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రకుల్ సడన్ గా వెళ్లి షాప్ లో కండోమ్ కావలి అని అడగగానే, ఒక్కసారిగా ఆ షాప్ కీపర్ షాక్ కి గురయ్యాడు. రకుల్ ప్రీత్ కి పెళ్లి జరిగి మూడేళ్లు కావొస్తుంది. ఇలాంటి సమయం లో ఆమెకు కండోమ్ అవసరం ఏముంది?, కొంపదీసి తన భర్త జాకీ భగ్నానీ తో రకుల్ వేరుగా ఉంటుందా? , త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారా?, రకుల్ వేరే ఎవరితోనైనా డేటింగ్ చేస్తుందా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అభిమానులు మాత్రం సినిమా షూటింగ్ లో భాగంగా రకుల్ అలా చేసి ఉండొచ్చని అంటున్నారు.
ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయానికి వస్తే ఈమె మన టాలీవుడ్ కి దూరమై చాలా రోజులే అయ్యింది. తాను టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధం గానే ఉన్నానని, కానీ అవకాశాలు రావడం లేదంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక హిందీ లో రీసెంట్ గా ఆమె చేసిన ‘రామాయణ’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఇందులో సూర్పనక్క క్యారెక్టర్ లో ఆమె జీవించింది. సోషల్ మీడియా లో చాలా రోజుల తర్వాత రకుల్ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ పాత్ర. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మళ్లీ ఈమె టాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో?, ఒకప్పటి లాగా తన హవా చూపిస్తుందో లేదో అని ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Rakull is literally went to chemist to buy a Con- dom for her self 😵💫😧
Shopkeeper is also full confused… https://t.co/sW4G059qXs
— VIKRAM (@Ak_vikram12) November 24, 2026