Chandrababu: అవినీతి కేసుల్లో చంద్రబాబుకు తాత్కాలికి బెయిల్ లభించింది. ఈనెల 28న ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అందుకు ఆయన సిద్ధంగా లేరని సంకేతాలు వస్తున్నాయి. ఆయన తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ దీనిపై టిడిపి నేతలు మాట్లాడడం లేదు. కానీ లీగల్ గా కంపెనీ తాము చేస్తున్నారు. అటు చంద్రబాబు సైతం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. తన పని మొదలుపెట్టారు. మరికొన్ని రోజులు పాటు బెయిల్ లభించేలా ప్లాన్ చేసుకున్నారు.అనారోగ్య పరిస్థితులను కోర్టుకు నివేదించి మరి కొన్ని రోజులపాటు బెయిల్ కోరడానికి సిద్ధపడ్డారు.
తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు రిపోర్ట్ సమర్పించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబు మధ్యంతర బెయిల్ దాఖలు చేసుకున్నారు. కోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఆ షరతులకు లోబడే పనిచేస్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్తారా? లేదా? అన్న అనుమానాలు ఉంటూ వచ్చాయి. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో లేదో చెప్పలేం కానీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదించిన రిపోర్టు అనుసరించి మరి కొద్ది రోజులు పాటు బెయిల్ పొడిగించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధారణంగా కంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఐదు వారాల పాటు వైద్య పరీక్షలు అవసరం. దీనికి తోడు గుండె సంబంధిత వ్యాధులతో చంద్రబాబు బాధపడుతున్నాడని ఆయన తరపు న్యాయవాదులు ఒక ప్రత్యేక నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆయన టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. అయితే ఈ కారణాలు బెయిల్ పొడిగింపునకు సరిపోతాయని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. బెయిల్ పొడిగింపునకు అవసరమైన పాయింట్లతోనే చంద్రబాబు కోరడంతో తప్పకుండా న్యాయమూర్తి మొగ్గు చూపుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ కార్యకలాపాలకు అనువుగా బెయిల్ లభించే అవకాశం లేదు.
మధ్యంతర బెయిల్ కి సంబంధించి పొడిగింపు తప్పకుండా లభిస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. బలమైన కారణాలు చూపడంతో పొడిగింపు అనేది అనివార్యమని.. కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఎవరు భావించలేదు. ఒకవేళ అరెస్ట్ అయిన రిమాండ్ కొనసాగుతుందని ఊహించలేదు. కానీ దాదాపు 52 రోజులు పాటు చంద్రబాబు జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గుణపాఠం గా తీసుకున్న చంద్రబాబు.. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయనున్నారు. ఏదో కలిసి వచ్చి చంద్రబాబును అరెస్టు చేయగలిగారే తప్ప.. ఇప్పుడు బెయిల్ విషయంలో బలమైన కారణాలతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమేపీ రాజకీయ కార్యకలాపాలు సాగించేలా బెయిల్ లభిస్తుందని.. అసలు కేసే క్వాష్ అవుతుందని టిడిపి శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. అయితే తాజాగా చంద్రబాబు ఆరోగ్య నివేదికలు పొందుపరచడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.