Auqib Nabi:భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో యువ పాస్ట్ బౌలర్ అకీబ్ నబీ ( Auqib Nabi) అదరగొట్టాడు. వర్షం వల్ల 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్లు టీమ్ సి ఫర్ట్, విల్ యంగ్ ను వెనక్కి పంపించాడు. సీ ఫర్ట్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. యంగ్ ఆరుపారులకు అవుట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లను త్వరగా అవుట్ చేసిన నేపథ్యంలో నబీ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. వేగవంతంగా బంతులు వేస్తున్నాడు.. బంతి మీద ఆదే స్థాయిలో పట్టుకొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఇన్ స్వింగర్.. అవుట్ స్వింగర్, షార్ట్ పిచ్ బంతులను అద్భుతంగా వేస్తున్నాడు. దీంతో పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకుంటేనే గొప్ప అన్నట్టుగా న్యూజిలాండ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నారు.
నబి స్వస్థలం జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా. ఇతడు 1996 నవంబర్ 4 న జన్మించాడు. చిన్నప్పటినుంచి ఇతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తొలి రోజుల్లో వీధులలో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత స్థానిక క్రికెట్లో ప్రతిభ చూపించాడు. జమ్మూ కాశ్మీర్ జట్టులో చోటు సంపాదించాడు.
నబి తండ్రి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పని చేస్తున్నారు. ముందుగా తన కుమారుడు క్రికెట్ ఆడటం ఇతడికి అంతగా ఇంట్రెస్ట్ లేదు. నబి పట్టదల చూసి ప్రోత్సహించడం ప్రారంభించారు. సరైన క్రికెట్ శిక్షణ సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో.. అతడి ప్రతిభను గుర్తించి.. మెరుగుపడే విధంగా చేశారు.
దేశవాళి క్రికెట్లో నబి తన బౌలింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నా. ముఖ్యంగా 2024 -25 రంజి ట్రోఫీలో 44 వికెట్లు పడగొట్టి.. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండవ స్థానంలో నిలిచారు. 2025 దులీప్ ట్రోఫీలో 4 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2025 -26 రంజి సీజన్లో ఇతడు మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా 60 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఆవిర్భవించాడు. జమ్ము కాశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
దేశవాలి క్రికెట్ లో అద్భుతంగా ఆడిన నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యాలు ఇతని మీద దృష్టిపెట్టాయి. 2026 ఐపిఎల్ వేలంలో ఢిల్లీ జట్టు ఇతని 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం 36 లక్షల బేస్ ధరతో ఇతడు వేలంలోకి వచ్చాడు. అయితే ఇతడికి భారీగా ధర పలకడం అప్పట్లో సంచలనంగా మారింది.
అఖిబ్ బంతిని రెండువైపులా స్వింగ్ చేయగలడు. కుడి చేతివాటంతో మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. లైన్ అండ్ లెంగ్త్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన రోల్ మోడల్ అని నబీ చెబుతుంటాడు.
INCREDIBLE GRAB!
KL Rahul flies across to pull off a stunning grab as Auqib Nabi picks up his second!
Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV.
#SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 7, 2026
A special moment for Auqib Nabi as he picks up his maiden ODI wicket!
Watch #NZvIND 2nd ODI LIVE now on #SonySportsNetwork & #SonyLIV! https://t.co/LVrvOEr5a3
— Sony LIV (@SonyLIV) November 7, 2026