Homeఅంతర్జాతీయంWorld Star Holding: దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్లు.. ఈ కంపెనీకి డబ్బులు చెట్లకు కాస్తున్నాయా..

World Star Holding: దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్లు.. ఈ కంపెనీకి డబ్బులు చెట్లకు కాస్తున్నాయా..

World Star Holding:సాధారణంగా దీపావళి సందర్భంగా కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమతులు అందిస్తుంటాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రతి పండుగకు ఉద్యోగులకు ఏదో ఒక రూపంలో బహుమతులు అందజేస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వార్తల్లో కూడా నిలిచింది. మహిళా ఉద్యోగులకు అయితే ఏకక ఐఫోన్లు అందించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. యూఏఈ లోని వరల్డ్ […]

World Star Holding:సాధారణంగా దీపావళి సందర్భంగా కంపెనీలు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమతులు అందిస్తుంటాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రతి పండుగకు ఉద్యోగులకు ఏదో ఒక రూపంలో బహుమతులు అందజేస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వార్తల్లో కూడా నిలిచింది. మహిళా ఉద్యోగులకు అయితే ఏకక ఐఫోన్లు అందించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.

యూఏఈ లోని వరల్డ్ స్టార్ హోల్డింగ్ సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులను అందించింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ (కేరళకు చెందినవారు) ఉద్యోగులకు ఈ బహుమతిని అందించారు. దీనికోసం ముందుగా కాన్ఫరెన్స్ రూమ్ లోని కుర్చీలపై ఐఫోన్ బాక్స్ లను సిద్ధంగా ఉంచారు. అనంతరం మహిళా ఉద్యోగులందరినీ సమావేశ మందిరానికి రావాలని పిలిచారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగులకు తమకుర్చీలపై ఐఫోన్ బాక్సులు కనిపించాయి. దీంతో వారు ఒకసారి ఆశ్చర్యపోయారు. తమకు ఈ స్థాయిలో ఖరీదైన బహుమతి వస్తుందని వారు ఊహించలేదు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ విభాగంలో పని చేసే మహిళా ఉద్యోగులు కూడా ఐఫోన్లు అందించారు. తమను కూడా గుర్తించి ఈ బహుమతులు అందించడంతో హౌస్ కీపింగ్ సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఉద్యోగుల హోదా.. విభాగంతో సంబంధం లేకుండా బహుమతులు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత సెప్టెంబర్ లోను ఇదే సంస్థ పలువురు ఉద్యోగులకు ఐఫోన్లను బహుమతులుగా అందించింది. తాజా వీడియోతో ఈ సంస్థ మరోసారి, అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రధాన మీడియాలోని వార్తల్లో నిలిచింది.

“కంపెనీకి ఉద్యోగులే మూల స్తంభం. వారు ఎంత కష్టపడి పనిచేస్తే కంపెనీకి ఆ స్థాయిలో లాభాలు వస్తాయి. వారి కష్టాన్ని కంపెనీ కచ్చితంగా గుర్తించాలి. వారికి పండుగల సమయంలో.. ఇతర అవసరాలు వచ్చినప్పుడు కచ్చితంగా వాటిని తీర్చాలి. అప్పుడే ఉద్యోగులకు కంపెనీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఐఫోన్లు ఇవ్వడం గొప్ప విషయం కావచ్చు. కానీ వారి ఆనందాన్ని చూడడం అంతకంటే గొప్పదని” నౌషాద్ చెబుతున్నారు. తమకు ఐఫోన్లను దీపావళి కానుకలుగా ఇచ్చిన యాజమాన్యానికి ఉద్యోగులు భావోద్వేగతంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తమకోసం కంపెనీతీసుకున్న నిర్ణయాన్ని వారు ఆనందంగా స్వాగతిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Haseena Nishad (@haseena_nishad)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper