Homeఆంధ్రప్రదేశ్‌Roja: రోజా ఎఫెక్ట్.. పాపం వరుదు కళ్యాణి బలి అయిపోయింది..

Roja: రోజా ఎఫెక్ట్.. పాపం వరుదు కళ్యాణి బలి అయిపోయింది..

Roja: వైసీపీలో మహిళా నేతగా.. మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు వరుదు కళ్యాణి. విద్యావంతురాలు.. రాజకీయాల మీద పట్టుంది. ఈ నేపథ్యంలో ఈమె విశాఖపట్నం మేయర్ పదవికి పోటీ చేశారు. వాస్తవానికి ఈమె ప్రచారాన్ని చాలా సవాల్ గా తీసుకొని చేశారు. పార్టీ అధినేత జగన్ రాకపోయినప్పటికీ.. కీలకమైన నాయకులు అండదండలు అందించకపోయినప్పటికీ కళ్యాణి క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. ఆమె చేసిన ప్రచారం చూస్తే చాలామంది విశాఖపట్నం టిడిపి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి కి గట్టి […]

Roja: వైసీపీలో మహిళా నేతగా.. మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు వరుదు కళ్యాణి. విద్యావంతురాలు.. రాజకీయాల మీద పట్టుంది. ఈ నేపథ్యంలో ఈమె విశాఖపట్నం మేయర్ పదవికి పోటీ చేశారు. వాస్తవానికి ఈమె ప్రచారాన్ని చాలా సవాల్ గా తీసుకొని చేశారు. పార్టీ అధినేత జగన్ రాకపోయినప్పటికీ.. కీలకమైన నాయకులు అండదండలు అందించకపోయినప్పటికీ కళ్యాణి క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు.

ఆమె చేసిన ప్రచారం చూస్తే చాలామంది విశాఖపట్నం టిడిపి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి కి గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. మహా అయితే శ్రావణి 20,000 లేదా 30,000 ఓట్ల తేడాతోని గెలిచే అవకాశం ఉందని భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. కళ్యాణి జన్మలో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. శ్రావణి కళ్యాణి మీద ఏకంగా 2,40,000 ఓట్లకు పైచిలుకు తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో కళ్యాణి పొలిటికల్ కెరియర్ మొత్తం మటాష్ అయిందని చర్చ నడుస్తోంది.

విశాఖపట్నంలో కళ్యాణి మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా ఒక ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఆస్థానం కేటాయించడం నిజంగా ఒక రకమైన చర్చకు దారితీసింది. అయితే, వైసీపీకి అభ్యర్థులు లేకపోవడంతో ఆమెను తెరమీదకు తీసుకొచ్చారని తెలుస్తోంది. కళ్యాణికి మాజీ మంత్రి రోజా విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆమె విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా గెలవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత కళ్యాణికి డౌన్ ట్రెండ్ మొదలైందని.. టిడిపి కార్యకర్తలు ఇదే అంశాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని తెలుస్తోంది.

కళ్యాణి ఓడిపోయిన నేపథ్యంలో దీనంతటికీ కారణం రోజా అని.. గతంలో రోజా ఎవరికీ విషెస్ చెప్పినా సరే వారంతా ఓడిపోయారని కూటమినేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రోజా ఎఫెక్ట్ వల్ల కళ్యాణి బలి అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి విశాఖపట్నంలో కూటమికి బలం విపరీతంగా పెరిగిపోయింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు కూడా ప్రజల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. అందువల్లే శ్రావణి కి ఓటర్లు జై కొట్టారు. కానీ కూటమి నేతలు రోజాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. దీంతో రోజా వర్గం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. మరోవైపు రోజా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నగరి నియోజకవర్గంలో టిడిపి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, రోజా ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థులలో ఆరుగురు మాత్రమే విజయాలు సాధించారు. నగరిలోనే రోజాకు దిక్కులేదు.. కళ్యాణికి ఏం సపోర్ట్ చేస్తుంది.. రోజా సపోర్ట్ తో మేయర్ అవుదామని కళ్యాణి ఎలా అనుకుందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper