spot_img
Homeక్రీడలుIndia Vs Australia Final 2023: ఫైనల్స్ లో ఆస్ట్రేలియా... 2003 నాటి రివెంజ్ తీర్చుకోడానికి...

India Vs Australia Final 2023: ఫైనల్స్ లో ఆస్ట్రేలియా… 2003 నాటి రివెంజ్ తీర్చుకోడానికి సమయం ఆసన్నమైంది…

India Vs Australia Final 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం ప్లేయర్లందరు వరుసగా ఫెయిల్ అవ్వడంతో సౌతాఫ్రికా టీమ్ 212 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అందులో మిల్లర్ ఒక్కడే సెంచరీ చేసి 101 పరుగులు చేశాడు. ఇక 213 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ టీం కి ప్లేయర్లలో వాళ్ల ఓపెనర్లు కొంతవరకు బాగానే ఆడినప్పటికీ మిడిలాడర్ మొత్తం ఫెయిల్ అయింది. ఇంక దాంతో చివరకు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరూ కలిసి మ్యాచ్ కి మంచి విజయాన్ని అందించారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్ కి చేరుకుంది.

ఇక ఇప్పటికే ఇండియన్ టీం ఫైనల్ కి చేరుకోగా ఇప్పుడు ఆస్ట్రేలియా టీం కూడా ఫైనల్ కి చేరుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య తుది సమరం నవంబర్ 19వ తేదీన జరగనుంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2003 లో జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీం ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ఇక ఇప్పుడు ఆ రివెంజ్ ని తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఇండియన్ టీం అత్యంత భయంకరమైన టీముగా పేరు తెచ్చుకుంది. ఇండియన్ టీం ప్లేయర్లను చూస్తున్న ప్రతి ఒక్క ప్రత్యర్థి ప్లేయర్ కూడా భయంతో వణికిపోతున్నాడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

ఇక ఇలాంటి టైంలో ఇండియా ని ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదు కానీ ఇండియన్ టీం ఆస్ట్రేలియా ని ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది.ఇక ఇప్పటికే ఇండియా ఆస్ట్రేలియా ని లీగ్ దశలో చిత్తు గా ఓడించింది. అయితే ఇండియా సెమీఫైనల్ లో 2019 నాటి రివేంజ్ ను న్యూజిలాండ్ మీద ఎలాగైతే తీర్చుకుందొ, ఇక ఇప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా కి బాకీ పడిపోయిన రివెంజ్ ని మళ్లీ గుర్తు చేసుకొని తీర్చుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక అందులో భాగంగానే మన ఆస్ట్రేలియన్ టీమ్ ఫైనల్ కి చేరుకున్నందుకు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూనే ఇండియన్ టీమ్ వాళ్ళకి భారీ పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ వ్యూహాలతో బరిలోకి దిగపోతున్నట్టుగా తెలుస్తుంది.

న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిందో ఇప్పుడు వాటిని సరిదిద్దుకొని ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా ఆడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈసారి కప్పు కొడితే ఇండియన్ టీమ్ మూడోవ సారి వరల్డ్ కప్పు కొట్టిన టీమ్ గా చరిత్రలో నిలుస్తుంది…అలాగే పెద్ద టీమ్ అని చెప్పుకునే ఆస్ట్రేలియా లాంటి టీమ్ కు ఓటమి పరాభవాన్ని చూపించినట్టు అవుతుంది.అలాగే మన పాత రివెంజ్ కూడా తీర్చుకున్నట్టు అవుతుంది. ఒక్క దెబ్బకి లెక్కలు మొత్తం సెటిలైపోతాయి అందుకే ఇండియన్ టీం కి ఆడబోయే ఫైనల్ మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper