Homeక్రీడలుక్రికెట్‌Team India power: పాకిస్తానే కాదు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కూడా సలాం కొట్టాయి.. టీమిండియా అంటే...

Team India power: పాకిస్తానే కాదు.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కూడా సలాం కొట్టాయి.. టీమిండియా అంటే అట్లుంటది మరి..

Team India power: క్రికెట్ మొత్తాన్ని ఆస్ట్రేలియా శాసిస్తూ ఉంటుంది. ఫార్మాట్ ఏదైనా సరే దుమ్ము రేపుతూ ఉంటుంది. అందువల్లే క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు విపరీతమైన రికార్డులు ఉంటాయి. ప్రతి జట్టు మీద మాత్రమే కాకుండా.. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో అద్భుతమైన విజయాలు ఆస్ట్రేలియా పేరు మీద ఉంటాయి. ఆస్ట్రేలియా సాధించిన వరుస విజయాల రికార్డును ఇంతవరకు ఏ జట్టు కూడా అధిగమించలేకపోయింది. చరిత్రలో తొలిసారిగా టీమిండియా ఆస్ట్రేలియాకు గండి కొట్టింది. అక్కడితోనే ఆగిపోలేదు.. వరుస విజయాలు […]

Team India power: క్రికెట్ మొత్తాన్ని ఆస్ట్రేలియా శాసిస్తూ ఉంటుంది. ఫార్మాట్ ఏదైనా సరే దుమ్ము రేపుతూ ఉంటుంది. అందువల్లే క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు విపరీతమైన రికార్డులు ఉంటాయి. ప్రతి జట్టు మీద మాత్రమే కాకుండా.. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో అద్భుతమైన విజయాలు ఆస్ట్రేలియా పేరు మీద ఉంటాయి.

ఆస్ట్రేలియా సాధించిన వరుస విజయాల రికార్డును ఇంతవరకు ఏ జట్టు కూడా అధిగమించలేకపోయింది. చరిత్రలో తొలిసారిగా టీమిండియా ఆస్ట్రేలియాకు గండి కొట్టింది. అక్కడితోనే ఆగిపోలేదు.. వరుస విజయాలు సాధించి.. సరికొత్త జట్టుగా భారత్ ఆవిర్భవించింది.

టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా ఆవిర్భవించింది. 2024 సీజన్ నుంచి 2026 వరకు వరుసగా 11 విజయాలు సాధించింది. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.

వరుస విజయాల జాబితాలో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండేది. 2022 నుంచి 2024 వరకు ఆస్ట్రేలియా వరుసగా 8 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. 2024 సీజన్లో దక్షిణాఫ్రికా జట్టు 8 విజయాలు సొంతం చేసుకుంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా తర్వాత ఇండియా కూడా ఉంది. 2012 నుంచి 2014 వరకు టీమిండియా వరుసగా 7 విజయాలు నమోదు చేసింది.

టి20 క్రికెట్లో టీమిండియా ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డులను సృష్టిస్తోంది. వరుస విజయాలు సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలుస్తోంది. ఆటగాళ్లలో పోటీ తత్వం.. పోరాడే విధానం.. సమష్టి గా ఆడే తీరు టీం ఇండియాను ఈ స్థాయిలో నిలబెడుతున్నాయి. గతంలో కొంతమంది ప్లేయర్ల మీద మాత్రమే టీమిండియా ఆధారపడేది. కానీ, ఇప్పుడు అందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఒకరు విఫలమైనా సరే మరొకరు నిలబడుతున్నారు. ఉదాహరణకు ఆదివారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ను తీసుకుంటే.. ప్రమాదకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఈదశలో ఇషాన్ కిషన్ బలంగా నిలబడ్డాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా పాకిస్తాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని విధించింది. ఆ లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ విఫలమైంది.

అటు బ్యాటు ద్వారా ఇషాన్ కిషన్ అదరగొడితే.. ఇటు బంతి ద్వారా బౌలర్లు దుమ్ము లేపారు. పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం కోలుకోలేని స్థితిని కల్పించారు. దీంతో టీం ఇండియా భారీ అంతరంతో విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper