India vs Australia 1st ODI: బంతివేయడమే ఆలస్యం ముఖానికి వస్తోంది. కనీసం బ్యాట్ అడ్డుపెట్టి ఆడదామంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. అలాగని బౌలర్లకు కూడా బంతిమీద పట్టు దొరకడం లేదు. బంతిని వేయడం మాత్రమే వారి చేతుల్లో ఉంటున్నది. సరైన దిశలో వేద్దామనుకుంటే అది ఎక్కడో పడుతోంది. ఊహించని విధంగా స్వింగ్ అవుతోంది. కొన్ని సందర్భాలలో బంతిని షార్ట్ పిచ్ లో వేస్తే.. అది బ్యాట్ మీదకి వెళ్తోంది.. ఇదీ స్థూలంగా ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న పెర్త్ స్టేడియంలో పిచ్ పరిస్థితి.
అసలే బౌన్సీ పిచ్ అనుకుంటుంటే.. అక్కడ ప్రస్తుతం విస్తారంగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం కురిసిన తర్వాత బంతివేగం తగ్గిపోయింది. నిర్ణీత దశలో బంతిని వేస్తుంటే అది గతి తప్పుతోంది. బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ బంతిమీద పట్టు లభించడం లేదు. వర్షం కురవకముందు బంతిక మనం ఒక విధంగా ఉంటే.. వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత బంతి గమనం మరో విధంగా ఉంది. దీంతో ఆటగాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆశ్చర్యంగా చూస్తుంటే.. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇదేం పిచ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
పెర్త్ లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. భారత జట్టు స్కోరు రెండు వికెట్లకు 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం తొలిసారి అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను 49 ఓవర్లకు తగ్గించారు. ఆ తర్వాత 11.5 ఓవర్లలో టీమిండియా స్కోరు మూడు వికెట్లకు 37 పరుగులుగా ఉన్నప్పుడు వర్షం మళ్ళీ మొదలైంది. ఈసారి వర్షం ఎక్కువగా కురవడంతో మ్యాచ్ ను అంపైర్లు నిరధికంగా వాయిదా వేశారు. వర్షం తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే గంటసేపు వరకు మ్యాచ్ నిలిచిపోయింది. ఇప్పటికీ ఇంకా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. అవుట్ ఫీల్డ్ మీద టార్పాలిన్ లు కప్పారు. దీంతో మరిన్ని ఓవర్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది..
గత ఏడాది చివర్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ మైదానం వేదికగానే మొదలైంది. ఈ మైదానంలో టీమిండియా విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. అయితే ఈ మైదానంలో ప్రస్తుతం వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా ప్రారంభంలో బౌలింగ్ చేయగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ప్రారంభం నుంచి భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.. బంతి గమనం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో బ్యాటింగ్ చేయడంలో అవస్థలు ఎదుర్కొన్నారు.