Odi World Cup 2023: వరల్డ్ కప్ టోర్నీ మొదటి నుంచి కూడా ఇండియా ఒకే శ్వాసగా, ఒకే ధ్యాసగా విజయమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. టోర్నీ లో తొమ్మిది విజయాలను అందుకున్న ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి అందరికంటే ముందే సెమీఫైనల్ కు చేరుకుంది.ఇక న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజీలాండ్ టీమ్ ను చిత్తు చేసి ఘనం విజయం సాధించింది…అలాగే వరల్డ్ కప్ బరిలో నిలిచింది…
అయితే ఇండియన్ టీం గత తొమ్మిది మ్యాచ్ లతో పోల్చుకుంటే సెమీఫైనల్ మ్యాచ్ లో కొంచెం తడబడింది.బ్యాటింగ్ అద్బుతం గా చేసినప్పటికీ, బౌలింగ్ లో మాత్రం షమీ ఒక్కడిని మినహయిస్తే మిగిలిన వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు.న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ అయిన విలియం సన్, డారియల్ మిచెల్ లాంటి ప్లేయర్లు క్రీజ్ లో పాతుకుపోయి ఆడుతున్న వాళ్ళని ఔట్ చేయడానికి మన బౌలర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒకానొక టైంలో వాళ్ళిద్దరూ కలిసి న్యూజిలాండ్ మ్యాచ్ ని గెలిపిస్తారేమో అన్నంత రేంజ్ లో వాళ్ళు విరుచుకుపడి ఆడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక మన బౌలర్లు కొద్దిసేపు బిక్క మొఖం వేసుకొని చూడడం కూడా మనం గమనించాం… అయితే ఇండియా పూర్తి పోటేన్షియాలిటీ మాత్రం ఇది కాదు. ఇంతకుముందు టోర్నీ లో ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంని 200 లోపు కట్టడి చేశాం, అలాగే సౌతాఫ్రికా లాంటి మరో పెద్ద టీం ని 83 పరుగులకు ఆల్ అవుట్ చేశాం…
అలాంటి పెద్ద పెద్ద టీములని చిత్తు చేసిన ఇండియన్ టీం సెమీఫైనల్లో మాత్రం ముఖ్యంగా బౌలింగ్ లో కొంతవరకు తడబడింది. దీనికి అంతటికి కారణం మన పేస్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ తన పూర్తి పర్ఫామెన్స్ ని ఇవ్వలేకపోయాడు. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 78 పరుగులు ఇచ్చాడు ఇక దాంతో సిరాజ్ భారీ ఎక్స్పెన్సివ్ బౌలర్ గా మారాడు అంటే సిరాజ్ దాదాపు ఓవర్ కి 9 పరుగులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ చేయడం లో కూడా ఫెయిల్ అయ్యారు. ఒక పరుగు వచ్చే దగ్గర రెండు పరుగులు ఇచ్చారు.ఇక కీలకమైన సమయంలో క్యాచ్ లు వదిలేయడాలు ఇవన్నీ కూడా ఇండియన్ టీం సెమీఫైనల్ మ్యాచ్ లో కనిపించిన చేసిన మిస్టేక్స్…వీళ్ళని ఎంత తొందరగా ఇండియా రికవరీ చేసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే ఫైనల్లో మాత్రం ఇలానే ఆడితే ఇండియన్ టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవకాశం అయితే ఉంది.
అందుకే ఒక మ్యాచ్ ఆడేటప్పుడు దానిని పూర్తిగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే ఆ మ్యాచ్ కు అనుకూలంగా అంచనాలు వేసుకొని ఆడితే మంచిది. న్యూజిలాండ్ మీద ఇండియన్ టీమ్ పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఇంతకుముందు మ్యాచ్ లతో పోల్చుకుంటే మాత్రం కొద్ది వరకు తగ్గింది.ఇక ఇలాంటి పరిణామాలు మళ్లీ ఇంకోసారి ఎప్పుడూ ఎదురు కాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే మనం వరల్డ్ కప్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం. ఒక్కసారి కనక ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని సవరించుకోవడానికి ఇంకొక అవకాశం లేకుండా పోతుంది. అందు కోసమని ఇప్పుడు ఆడేది తుది సమరం కావడం తో మ్యాచ్ కి ముందే మన మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటే మంచిది…