Varalakshmi Vratam Charumathi Story : శ్రావణమాసంలో అత్యంత పవిత్రమైన రోజు శుక్రవారం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో మరింత పవిత్రంగా భావిస్తారు. ఇదే రోజున వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తారు. అడిగిన వరాలను ఇచ్చే తల్లిగా వరలక్ష్మి ఈరోజు పూజించే ప్రతి ఇంట్లో కొలువై ఉంటుందని మహిళలు నమ్ముతారు. అందుకే మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతంను ఆచరిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం ను ఎవరు ప్రారంభించారు? ఈ వ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..
వరలక్ష్మీ వ్రతం రోజున పూజ అనంతరం వ్రత కథ వినాలని అంటారు. అంటే వరలక్ష్మి వ్రతం ఎలా ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల ప్రకారం మగధ సామ్రాజ్యంలో కుండీన పురం అనే గ్రామంలో చారుమతి అనే వివాహిత మహిళ ఉండేది. ఈమె తన కుటుంబాన్ని ఎంతో గౌరవంగా చూసుకునేది. భర్త, అత్త మామల బాగోగులను చూసుకుంటూ ఉండేది. నిత్యం లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ ఉండేది. ఈమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి అమ్మవారు ఒకరోజు చారుమతి కలలో కనిపించి తన వ్రతంను నిర్వహించాలని.. మహిళలకు వాయినం ఇవ్వాలని తెలుపుతుంది.
మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు తోటి మహిళలకు తెలుపుతుంది. దీంతో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తారు. అయితే చారుమతి తో తోటి మహిళలు కూడా ఈ వ్రతంలో పాల్గొంటారు. ఆ తర్వాత చారుమతి కుటుంబం అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ కుటుంబం మాత్రమే కాకుండా ఈ వ్రతంలో పాల్గొన్న మహిళల ఇంట్లో కూడా అన్ని శుభాలే ఉంటాయి. దీంతో అప్పటినుంచి వరలక్ష్మీ వ్రతం ను ఆచరిస్తూ వస్తున్నారు. అలా ఇప్పటికీ ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక వాతావరణం కలగడమే కాకుండా.. మహిళలంతా ఒక్కచోట చేరి అమ్మవారిని సేవించడం వల్ల ఎంతో సంతోషిస్తుందని నమ్ముతారు. అలాగే కుటుంబ సౌభాగ్యం కోసం మహిళలు చేసే ఈ వ్రతం వల్ల అన్ని శుభాలే ఉంటాయని విశ్వాసం.
అయితే వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన కసిద్ద పురాణ కథలో పార్వతి దేవి తన భర్త పరమేశ్వరుడిని శ్రీ సౌభాగ్యాలను ప్రసాదించే వ్రతం గురించి అడిగినట్లు చెబుతారు. దీంతో వరలక్ష్మీ వ్రతంను నిర్వహించాలని శివుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ వ్రతం నిర్వహించడం వల్ల ఆయా ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా చెడు వాతావరణం తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వ్రతంను కేవలం డబ్బు, ఐశ్వర్యం కోసం మాత్రమే కాకుండా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ చేస్తుంటారు. దీంతో ఆ కుటుంబాలు సంతోషంగా జీవించగలుగుతాయి.