Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాను మరొక హీరో చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉండటం సర్వసాధారణం… ఇప్పటివరకు చాలామంది హీరోలు అలా సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన వారే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో చేయాల్సిన ఒక సినిమాని మోహన్ బాబు చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. మోహన్ బాబు ప్లాప్ లతో సతమతమవుతున్న క్రమంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘చిత్రం’ సినిమాకి రీమేక్ గా ‘అల్లుడుగారు’ అనే సినిమాని చేశాడు. మలయాళం లో మోహన్ లాల్ చాలా బాగా నటించి మెప్పించాడు. తెలుగులో మోహన్ బాబు చాలా అద్భుతమైన నటనను కనబరిచాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్లింది.
మోహన్ బాబు అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్నప్పటికి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక్కడి నుంచి వరుసగా విజయాలను సాధిస్తూ తన స్టామినాను పెంచుకున్నాడు. ఏది ఏమైనా కూడా అప్పట్లో మోహన్ బాబు భారీ విజయాలను సాధిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన ఈరోజుకి భారీ గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.
మొదట ఈ మలయాళం రీమేక్ ను బాలయ్య బాబు చేద్దామనుకున్నాడట. కానీ బాలయ్య ఒకటికి రెండుసార్లు ఆలోచనలో పడ్డాడు. ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే ధోరణిలో ఆలోచిస్తున్న క్రమంలో మోహన్ బాబు ఈ సినిమా రైట్స్ తీసుకొని రాఘవేంద్రరావుతో మాట్లాడి అతనితో డైరెక్షన్ చేయించుకున్నాడు.
ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబు కి మోహన్ బాబుకి మధ్య కొద్దిరోజుల పాటు మాటలు లేవనే వార్తలైతే ఎక్కువగా వినిపించాయి. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంటే మోహన్ బాబు మాత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు…