Varalakshmi Vratam Story : శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందులో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తారు. మహిళలు ప్రత్యేకంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఈ వ్రతం చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండడమే కాకుండా దీర్ఘాయుష్షును కలుగుతారని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది. అయితే వరలక్ష్మి వ్రతంను ఎందుకు నిర్వహించాలి? ఈ వ్రతం వెనుక ఉన్న పురాణ కథ ఏంటి?
వరలక్ష్మి వ్రతం వెనక అనేక పురాణాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా ప్రాముఖ్యంలో చారుమతి కథను చెప్పుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించే మహిళలు ఈ కథను వినాలని కొందరు అంటూ ఉంటారు. పూర్వకాలంలో విదర్భ రాజ్యం ఉండేది. ఈ రాజ్యంలో కుండిన పురం లో చారుమతి అనే వివాహిత మహిళ ఉండేవారు. ఈమె తన కుటుంబం శ్రేయస్సు కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఒకరోజు ఆమె కలలో శ్రీ మహాలక్ష్మి కనిపించి శ్రావణ పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధించాలని చెప్పింది. దీంతో చారుమతి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు.
అయితే ఈ వ్రతంలో తాను మాత్రమే కాకుండా చుట్టుపక్కల మహిళలను పాల్గొని ఇలా చేశారు. దీంతో ఈ వ్రతంలో పాల్గొన్న చారుమతి మాత్రమే కాకుండా ఆ మహిళలు అష్టైశ్వర్యాలతో.. కుటుంబంతో సంతోషంగా గడిపారు. అప్పటినుంచి వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తూ వస్తున్నారు. లక్ష్మీ జననం, వివాహం రెండు ఈ శ్రావణమాసంలోనే జరిగాయి. అందుకే ఈ మాసంలో మహాలక్ష్మిని వరలక్ష్మిగా భావించి వ్రతం నిర్వహిస్తారు.
సృష్టికి మూల కారణమైన ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం రోజున గజలక్ష్మి, సంతాన లక్ష్మి, ధనలక్ష్మి రూపంలో కనిపించి భక్తులకు వరాలు ఇస్తుందని భావిస్తారు. ఈ రోజున మహిళలు అత్యంత శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తోటి మహిళలతో కలిసి వాయినాలు ఇచ్చుకుంటారు. దీంతో వారి ఇళ్లల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అయితే వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజున వ్రతం నిర్వహించే ఇళ్లల్లో అబద్ధాలు చెప్పకుండా.. అశుభ పనులు చేయకుండా ఉండాలి. అనవసరంగా మహిళలను దూషించకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.