Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 27.7.2026 : ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు..

Today horoscope in telugu 27.7.2026 : ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటి […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటి పరిష్కారం కోసం కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎప్పుడు లాభాలు పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ప్రియమైన వారికోసం వస్తువు కొనుగోలు చేస్తారు. కొన్ని విభేదాలనుంచి బయటపడవచ్చు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ ప్రణాళిక వేసుకోవడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారుల కొత్తగా పెట్టుబడును పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసల వందుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పూర్వీకులు ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేకూరి అవకాశం ఉంది. అనవసరపు వివాదాల్లోకి తలదూచకుండా ఉండాలి. వ్యాపారులు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలే పొందుతారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. గతంలో మొదలుపెట్టిన కార్యకలాపాలను ఈరోజు పూర్తి చేస్తారు. ముఖ్యమైన సమస్యలను ఈరోజు పరిష్కరించుకుంటారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తను అందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంశాలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రహాల అనుకూలత ఉండటంతో అదృష్టం వరిస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారు. ఇవి వీరికి కలిసి వస్తాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రణాళికంగా ముందుకు వెళ్లడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు మెరుగైన లాభాల కోసం కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. లక్ష్యం కు అనుగుణంగా పనిచేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper