spot_img
Homeఆధ్యాత్మికంToday 7 September 2025 Horoscope: ఈరోజు ఈ రాశి వ్యాపారులు శుభవార్తలు ఉంటారు.. ఇందులో...

Today 7 September 2025 Horoscope: ఈరోజు ఈ రాశి వ్యాపారులు శుభవార్తలు ఉంటారు.. ఇందులో మీ రాశి ఉందా?

Today 7 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాశిలపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపారాలు కొత్త ఒప్పందాలను తీసుకుంటారు. అయితే ఇలాంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు చట్టపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. ఏదైనా కాంపిటీషన్లో పాల్గొంటే విజయం వీరిదే ఉంటుంది. కొన్ని కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు శత్రువుల నుంచి బెడద ఉంటుంది. వారితో ఎలాంటి రహస్యాలను పంచుకోకూడదు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. తల్లిదండ్రుల మద్దతుతో వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. దీంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వీరి నైపుణ్యంతో తొందరగా పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణ ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో అధికారులు ప్రశంసాలు కురిపిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అయితే కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా విజేతగా నిలుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంట్లో శుభకార్యం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు భూమికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవడంతో ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త వివాదాల్లో తలదూర్చకుండా ఉండాలి. తల్లిదండ్రుల సహాయంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. వీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించింది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు ఈ రోజు కాస్త శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నవారికి డబ్బు ఇవ్వవచ్చు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని రహస్యాలు చెప్పకూడదు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడును పెడతారు. ఇలాంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవాలని మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొంటే గురువుల మద్దతు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణం కోసం షాపింగ్ చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు ఉండడంతో వ్యాపారులు ఊహించని దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన జీవితం ఉంటుంది. నాణ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి శుభవార్తలు ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
Oktelugu Epaper