Homeఆధ్యాత్మికంToday 27 March 2026 Horoscope: శ్రీరామ నవమి వేళ.. ఈ రాశుల వారికి అన్నింట్లోనూ...

Today 27 March 2026 Horoscope: శ్రీరామ నవమి వేళ.. ఈ రాశుల వారికి అన్నింట్లోనూ విజయమే.

Today 27 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శ్రీరామనవమి వేళ సానుకూల ఫలితాలు ఉండడంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో బిజీగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు కలుగవచ్చు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం సహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాల మేరకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ రాశి వారు ఈ రోజు తమ మాట తీరుతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు. బంధువుల నుంచి శుభవార్తలో అందుతాయి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిగా అవడంతో సంతృప్తిగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల పెడదా ఉంటుంది. ఆర్థికపరంగా చేసే కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో కొత్తవారితో జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉండగలుగుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో చేపట్టిన కొన్ని పనుల వల్ల ఇప్పుడు శుభ ఫలితాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేర్చుకుంటారు ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సానుకూల పవనాలు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం సాగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular