Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 5.8.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకోని...

Today horoscope in telugu 5.8.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): చాలా కాలంగా ఎదురుచూస్తున్న వీరికి ఈరోజు శుభవార్త అందుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): చాలా కాలంగా ఎదురుచూస్తున్న వీరికి ఈరోజు శుభవార్త అందుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తల వినే అవకాశముంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. అనవసరంగా వివాదాల్లోకి తల దూర్చవద్దు. కోపం తెచ్చుకోకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. వ్యాపారులు తమ అభివృద్ధి కోసం కొత్త పరిచయాలను చేసుకుంటారు. ప్రియమైన వారికోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆకర్షణీయమైన లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధికంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. వీటిని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. వీరితో సంతోషంగా గడుపుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించడం అవసరం. పిల్లల భవిష్యత్తుపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పెద్దల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. అవసరం ఉన్నంత మీరకే ఖర్చులు చేయాలి. అప్పుల నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. తోటి వారి సహకారంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. అయితే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. స్నేహితుల సాకారంతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో ఆగిపోయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా విదేశాలకు వెళ్లే అవసరం ఏర్పడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper