spot_img
Homeఆధ్యాత్మికంToday 21 October 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధనలక్ష్మి యోగం.. అనుకున్న...

Today 21 October 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధనలక్ష్మి యోగం.. అనుకున్న పనులన్నీ పూర్తి..

Today 21 October 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో చేపట్టిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణ ఉండడంతో అధికారంలో నుంచి ప్రశంసలు ఉంటాయి. అయితే వ్యాపారాలు ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే జాగ్రత్తలు పాటించాలి. గతంలో డబ్బు ఇచ్చిన వారు ఇచ్చేందుకు ఆసక్తి చూపరు. పాత స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . మీ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంట్లో జరిగే కొన్ని పనుల వలన సంతృప్తి చెందుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సొంత వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పనులు పూర్తి చేయడానికి కొత్త ప్రణాళికలను వేస్తారు. ఎంతో అధికారంలో నుంచి ప్రశంసలు పొంది పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేయాలి. ఇతరుల వద్ద నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు పెద్దల సలహాతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గురువుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దుబార ఖర్చుల విషయంలో ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తుల రాశి వారు ఈరోజు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు అందుతాయి. కొందరికి జీతం పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరి దగ్గరనైనా రుణం తీసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విద్యార్థులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : తల్లిదండ్రుల మద్దతుతో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం కొత్త వ్యక్తులు కలుస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper