Box Office King of 2025 ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తూ భారీ విజయాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక ఇప్పటికే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తున్న మన హీరోలు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఇయర్ ఇప్పటికే మంచి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన మన స్టార్ హీరోలు ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా అలాంటి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ ఇయర్లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం రీసెంట్ గా ఓజీ సినిమాతో 350 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక నవంబర్ నెలలో బాలయ్య బాబు ‘అఖండ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక బాలయ్య సైతం 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించాడు. ఇక 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ ని వెనక్కి నెట్టి ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన హీరోల్లో తన మొదటి స్థానంలో నిలుస్తాడు.
లేకపోతే మాత్రం ఆయన వెనుకబడి పోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ ఇయర్ ఈ స్టార్ హీరోల మధ్య భారీ పోటీ ఉంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయన మ్యాజిక్ ఏమీ పని చేయలేదు. ఆ సినిమాతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు మధ్య భారీ పోటీ నడుస్తోంది. వీళ్లిద్దరిలో ఇయర్ ఇండస్ట్రీని షేక్ చేయబోయే హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది…