spot_img
Homeఆధ్యాత్మికంToday 15 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారుల ఇంట్లో ఈరోజు ధన రాశి...

Today 15 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారుల ఇంట్లో ఈరోజు ధన రాశి పెరిగినట్లే..

Today 15 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారుల ఇంట్లో ధన రాశి పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారు ఆదాయం సమకూర్చడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారులకు ధన రాశి పోసినట్లే ఆదాయం వస్తుంది. కొన్ని సమస్యల పట్ల ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. రైతుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఈరోజు మెరుగుపడతాయి. గతంలో చేపట్టిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో కొందరు పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించడమే మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఉద్యోగులు తోటి వారి సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన ఆదాయం వసూలు అవుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు పెద్దల సపోర్టు ఉండటంతో లాభాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు కరణీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. ఇలాంటి సమయంలో కాస్త మౌనంగా ఉండటమే మంచిది. గతంలో చేసిన అప్పులను ఇప్పుడు తీరుస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు భవిష్యత్తు గురించి ప్రాణాలికలు వేస్తారు. గతంలో చేపట్టిన పనులను ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారితో ఎలాంటి వాదనలకు దిగకుండా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఓ కొలిక్కి వస్తుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయం ఏర్పడుతుంది. దీంతో సంతృప్తిగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు తోటి వారి సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల తో సరదాగా గడుపుతారు. వీరి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరగనున్నాయి. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular