Homeఆధ్యాత్మికంToday 13 June 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం..

Today 13 June 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం..

Today 13 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితుల సహాయంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో […]

Today 13 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితుల సహాయంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి పనులన్నీ ఈరోజు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అనుకున్న కోరికలను ఈరోజు నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సీనియర్ల మద్దతు ఉండడంతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దుబార ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విహారయాత్రలకు దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా నడుస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని గ్రహాల అనుకూలతతో మనోధైర్యం పెరుగుతుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాలు అందుతాయి. కొత్త బాధ్యతలు అందే అవకాశం ఉంది. వ్యాపారులు అనుకోకుండా ఆదాయం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆదాయం ఘననీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తికావడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తమ తెలివిని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. మానసిక ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. స్నేహితుల నుంచి సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త బాధ్యతలను చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper