Homeఆధ్యాత్మికంToday 12 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే.. వద్దన్నా...

Today 12 April 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు పంట పండినట్లే.. వద్దన్నా ఇంట్లోకి డబ్బు..

Today 12 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. స్నేహితులతో కలిసి […]

Today 12 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు తోటి వారి సహాయంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పూర్వీకులు ఆశికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. దీంతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త భాగంలో చేర్చుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే జాగ్రత్తగా వహించాలి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ముఖ్యమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోవచ్చు. ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే కుటుంబ సభ్యుల మద్దతు ఉండడం వల్ల లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల అండదంటలు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త బాగా స్వాములను చేర్చుకుంటారు. అయితే వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి కొందరి సహకారం ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి పూర్వీకుల ఆస్తికు సంబంధించి శుభవార్తను వింటారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ప్రణాళిక ప్రకారంగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బంది ఉండదు. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి డబ్బు ఇవ్వద్దు. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు లాభాలు రావడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తే వాటిని పూర్తి చేయడానికి శ్రమించాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో అనుకున్న కొన్ని పనులను ఈరోజు పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండలు ఉన్నాయి. కొందరు వ్యాపారంలో అధికంగా లాభాలు పొందుతారు. అయితే వీరికి అదనపు ఖర్చులు ఉండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అయితే పనులు పూర్తి చేయడంలో శ్రద్ధ వహించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శ్రమిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈరోజు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper