Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer Health Issue: సుడిగాలి సుధీర్ కి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉండేదా..చాలా పెద్ద...

Sudigali Sudheer Health Issue: సుడిగాలి సుధీర్ కి ఇలాంటి ఆరోగ్య సమస్య ఉండేదా..చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడుగా..

Sudigali Sudheer Health Issue: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer). ఈయనకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. షో బాగున్నా, బాగాలేకపోయిన , కేవలం ఇతని కోసం చూస్తుంటారు ఆడియన్స్. అంతటి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ ఇమేజ్ తోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో కమెడియన్ గానే ఎంట్రీ ఇచ్చాడు కానీ , ఆ తర్వాత హీరో గా మారి రెండు మూడు సినిమాల్లో నటించాడు. అందులో ‘గాలోడు’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘హైలెస్సో’ అనే చిత్రం లో హీరోగా నటిస్తాడు. కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మార్కెట్ లో మంచి పాజిటివ్ బజ్ ఉంది.

కేవలం సినిమాలు మాత్రమే కాదు , హోస్ట్ గా కూడా ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘ఆట’ అనే డ్యాన్స్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్, ‘ఆహా’ యాప్ లో ప్రసారమయ్యే ‘సర్కార్ 6’ గేమ్ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు సుడిగాలి సుధీర్ . అయితే ఈయనకు ఇంత తేలికగా ఈ స్థానం దక్కలేదు. ఎన్నో కష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. అవకాశాలు కూడా అంత తేలికగా రాలేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, తనలోని అద్భుతమైన టాలెంట్ తో నేడు ఎంతోమంది ఆదర్శంగా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే సుధీర్ కి ఒకానొక సమయం లో తీవ్రమైన నడుము నొప్పి ఉండేది.

ఒకసారి కమెడియన్ అలీ తో కలిసి అమెరికా లో ఈవెంట్ కి వెళ్ళినప్పుడు , నడుము నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాడట సుధీర్. అలీ తో సరదాగా అనే షో లో పాల్గొన్నప్పుడు సుధీర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘ఈ నడుము నొప్పి నన్ను చాలా తీవ్రంగా బాధించింది. నడుము దగ్గర వెన్నెముక వద్ద నేరంపై నాకు ఒక ట్యూమర్ వచ్చింది. ఆ ట్యూమర్ కారణంగా కనీసం కూర్చోవడానికి కూడా అయ్యేది కాదు, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినప్పటికీ షూటింగ్స్ చేసేవాడని. షూటింగ్ అయిపోయిన వెంటనే పెయిన్ కిల్లర్ స్ప్రే వాడేవాడిని . ఒకరోజు హాస్పిటల్ కి వెళ్తే, సర్జరీ చెయ్యాలని అన్నారు . అయితే సర్జరీ చేసే సమయం ఆ నేరానికి ఏమైనా గాయమైతే నడుము నుండి అరికాలి వరకు శరీర భాగాలు పని చేయవని చెప్పారు. దేవుడి దయ, మా అమ్మగారి పూజల కారణంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ పూర్తి అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular