Homeఆధ్యాత్మికంLeo Zodiac Sign : 12 రాశుల్లో ఈ రాశి వారు ఎక్కడున్నా రాజే.. అందరూ...

Leo Zodiac Sign : 12 రాశుల్లో ఈ రాశి వారు ఎక్కడున్నా రాజే.. అందరూ వీరి మాట వింటారు..

Leo Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశుల ఆధారంగా వ్యక్తుల జీవిత స్థితిగతులు తెలుసుకుంటారు. ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, ముఖ్యమైన పూజలు చేసేటప్పుటు ఈ రాశి అవసరం ఏర్పడుతుంది. మన జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఇవి ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. వీటిలో సింహ రాశికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అదేంటో చూద్దాం..త రాశి చక్రంలో సింహ రాశిని ఐదోదానిగా పరిగణిస్తారు. ఈ రాశి అగ్ని […]

Leo Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశుల ఆధారంగా వ్యక్తుల జీవిత స్థితిగతులు తెలుసుకుంటారు. ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, ముఖ్యమైన పూజలు చేసేటప్పుటు ఈ రాశి అవసరం ఏర్పడుతుంది. మన జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఇవి ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. వీటిలో సింహ రాశికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అదేంటో చూద్దాం..త

రాశి చక్రంలో సింహ రాశిని ఐదోదానిగా పరిగణిస్తారు. ఈ రాశి అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది. దీనికి సూర్యుడు అధిపతి. సూర్యుడు గ్రహాలకు రాజుగా భావించబడటం వల్ల సింహ రాశికి రాజస లక్షణాలు ఉంటాయి. అధికారం, ప్రతిష్ఠ, ఆత్మగౌరవం, ధైర్యం, నాయకత్వం వంటి అంశాలు ఈ రాశితో ముడిపడి ఉంటాయి. సింహ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఒక పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు పట్టుదలతో ఉంటారు. అంతేకాకుండా వీరు ఎక్కడున్నా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి నలుగురిలో వీరు ప్రత్యేకంగా కనిపిస్తూ ఇతరులపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఎక్కడున్నా రాజే.. అని అంటారు. ఎందుకంటే వీరు చెప్పిన మాట ఇతరులు తప్పకుండా పాటిస్తారు.

అయితే వీరిలో కొన్నిసార్లు మొండితనం ఇతరులను ఇబ్బంది పెడుతుంది. తమ మాటే నెగ్గాలనే పట్టుదలతో ఉండడం వల్ల ఇతరుల చేత విమర్శలకు గురవుతూ ఉంటారు. అయితే విమర్శలను స్వీకరించకపోవడంతో వీరు మరింత మానసికంగా ఆందోళనతో ఉంటారు. అంతేకాకుండా ఇతరులతో ఎప్పుడూ గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. జ్యోతిష్య పరంగా సింహ రాశివారికి ఇతరులతో అభిప్రాయ భేదాలు రావడం, అధికార స్థానాల్లో ఉన్నవారితో సమస్యలు ఎదురవడం వంటివి ఉంటాయి. కుటుంబంలో మాటకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మనస్పర్థలు ఎదురుకావచ్చని చెబుతారు.

సింహ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. ఆదిత్య హృదయం లేదా సూర్య స్తోత్రాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యుడితో పాటు శివారాధనకు కూడా సింహ రాశివారు ప్రాధాన్యత ఇవ్వవచ్చని జ్యోతిష్య సంప్రదాయాల్లో చెబుతారు. సోమవారం శివుడికి అభిషేకం చేయడం, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం, ప్రదోష సమయంలో శివాలయాన్ని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఏదైనా ప్రత్యేక పరిహారం చేయాలంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత నిపుణులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది.

సింహ రాశివారికి హనుమంతుడి ఆరాధన కూడా మానసిక ధైర్యాన్ని పెంచే ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయాన్ని దర్శించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా భయం, ఆందోళన తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే సింహ రాశివారు తమ సహజమైన నాయకత్వ లక్షణాలను సానుకూలంగా ఉపయోగించుకోవడం ముఖ్యమని జ్యోతిష్య విశ్వాసం. దానధర్మాలు చేయడం, పేదలకు ఆహారం అందించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి మంచి పనులు చేయడం కూడా ఆధ్యాత్మికంగా శుభప్రదంగా భావిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper