Homeఆంధ్రప్రదేశ్‌Dussehra: దసరా నాడు జమ్మి ఎందుకు ప్రత్యేకం.. ఆయుధ పూజ చేసేది అందుకే..

Dussehra: దసరా నాడు జమ్మి ఎందుకు ప్రత్యేకం.. ఆయుధ పూజ చేసేది అందుకే..

Dussehra: విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగలో అమ్మవారి పూజ.. రావణ దహనం.. జమ్మి ఆకుల పంపిణీ.. ఆయుధ పూజ వంటి ఆచారాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే జమ్మి చెట్టును పూజించడం వెనక ఒక పురాణ కథ.. ఆయుధపూజ వెనుక ఒక గొప్ప జీవన సందేశం ఉన్నాయి. జమ్మి చెట్టును ఎందుకు పూజించాలంటే.. జమ్మి చెట్టును సంస్కృతంలో షమీ వృక్షం అని పిలుస్తుంటారు. హిందువుల సంప్రదాయంలో ఈ చెట్టు శుభానికి, విజయానికి, […]

Dussehra: విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగలో అమ్మవారి పూజ.. రావణ దహనం.. జమ్మి ఆకుల పంపిణీ.. ఆయుధ పూజ వంటి ఆచారాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే జమ్మి చెట్టును పూజించడం వెనక ఒక పురాణ కథ.. ఆయుధపూజ వెనుక ఒక గొప్ప జీవన సందేశం ఉన్నాయి.

జమ్మి చెట్టును ఎందుకు పూజించాలంటే..

జమ్మి చెట్టును సంస్కృతంలో షమీ వృక్షం అని పిలుస్తుంటారు. హిందువుల సంప్రదాయంలో ఈ చెట్టు శుభానికి, విజయానికి, శత్రువులపై గెలుపుకు చిన్నగా భావిస్తుంటారు. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆవిడాలను విరాటరాజు కొలువులోని స్మశానం సమీపంలో ఉన్న ఒక శమీ వృక్షం మీద దాచిపెడతారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అర్జునుడు ఆ చెట్టుపై దాచిన ఆయాలను తిరిగి తీసుకుంటాడు. ఈ కథ తో శమీ వృక్షానికి ఆయుధాలు, ధైర్యం, విజయంతో సంబంధం ఏర్పడింది. అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి.. దాని ఆకులను పరస్పరం ఇచ్చిపోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది..

అనేక అధ్యాత్మిక భావాలు

జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకోవడం వెనక అనేక అధ్యాత్మిక భావాలు ఉన్నాయి. దీనివల్ల ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు కలగాలి అని కోరుకుంటారు. స్నేహ సంబంధాలు.. ఆత్మీయతను పెంపొందించుకోవాలని భావిస్తారు. చేపట్టే పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకులను బంగారానికి ప్రతీకగా భావిస్తారు. వాటిని పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. స్నేహితులతో కూడా పంచుకుంటారు.

ఆయుధపూజ వెనుక

ఆయుధ పూజ అంట కేవలం కత్తులు, కత్తి పీటలు, యుద్ధ ఆయుధాలను పూజించడం మాత్రమే కాదు. మన జీవనోపాధికి ఉపయోగపడే సాధనాలను గౌరవించడం కూడా. పురాతన కాలంలో రాజు.. సైనికులు యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలను పూజించేవారు. వాటిని శుభ్రం చేసి.. పూలతో అలంకరించి.. విజయాన్ని ప్రసాదించాలని దైవాన్ని ప్రార్థించే వారు. పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఆయుధాలను తిరిగి స్వీకరించిన కథ కూడా విజయదశమినాడు ఆయుధ పూజకు ప్రాచుర్యం కలిగినందుకు చెప్పుకునే కారణాల్లో ఒకటి.

గొప్ప సందేశం ఒకటే

స్థూలంగా చెప్పాలంటే విజయదశమి మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒకటే. విజయం కేవలం అదృష్టం వల్లే రాలేదు. ధైర్యం.. కృషి.. క్రమశిక్షణ.. మనకు సహకరించే వ్యక్తులు.. మనం ఉపయోగించే సాధనల పట్ల బాధ్యత కూడా విజయానికి అవసరం. జమ్మి ఆకులు బంగారంగా భావించి పంచుకోవడంలో ఆత్మీయత ఉంది. ఆయుధ పూజలో మన పనిని గౌరవించే సంస్కారం ఉంది. అందుబల్లే విజయదశమినాడు జమ్మి పూజ మనకు విజయాన్ని గుర్తు చేస్తే.. ఆయుధపూజ మన విజయానికి తోడ్పడే శ్రమను.. సాధనాలను గుర్తు చేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper