Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక సామాన్య వ్యక్తి కూడా స్టార్ హీరోగా మారొచ్చు అనే గొప్ప ఎగ్జంపిల్ ను సెట్ చేసింది ఒకే ఒక్క వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)… ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు విశ్వంభర (Vishwambhara) సినిమాతో మరోసారి ప్రేక్షకు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుసగా 6 సంవత్సరాలు 6 ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకున్న ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం…
Also Read: నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నిజానికి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. అప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా థియేటర్లోకి అయితే రాలేదు.
కారణం ఏంటి అంటే చిరంజీవి ఈ సినిమాలోని గ్రాఫిక్స్ పట్ల కొంతవరకు అసంతృప్తితో ఉన్నట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఈ గ్రాఫిక్స్ ని మరికొంత హై లెవెల్లో చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని తెచ్చి పెట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
చిరంజీవి ఈ మూవీ అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. ఒకవేళ కొంతవరకు సినిమా డల్ అయినట్టుగా అనిపించినా కూడా దానికి ఏదో ఒకటి చేసి దాని హై లెవెల్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో విశ్వంభర సినిమా పరిస్థితి కూడా అలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చిరంజీవి చొరవతో ఈ సినిమాలో గ్రాఫిక్స్ కొంతవరకు మెరుగుపడ్డట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది చిరంజీవికి ఎలాంటి ఇమేజ్ ను తీసుకురాబోతుంది అనేది…