Kalki 2 : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది…ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి…పాన్ ఇండియాలో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకి చాలా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. నిజానికి నాగ్ అశ్విన్ ఈ సినిమాని మహా భారతానికి బేస్ చేసి ఒక ఫిక్షనల్ స్టోరీ గా చాలా బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా కల్కి ఎంట్రీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూసినప్పటికి, కల్కి మొదటి పార్ట్ లో ప్రభాస్ కర్ణుడి అంశంతో పుట్టినట్టుగా చూపించాడు తప్ప కల్కి ఎంట్రీ గురించి మనకు ఎక్కడ చూపించలేదు. ఇక కల్కి కి జన్మనిచ్చే లేడీగా దీపిక పదుకొనే నటించింది. ఆమె పాత్రకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయడంతో ఆమెను ఈ సినిమా నుంచి తీసేసారు.ఇక ఆమె ప్లేస్ లో ఇప్పుడు ఎవరిని ఆ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు అంటూ కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి సనన్ ను ఈ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దసర రోజు అఫీషియల్ గా ఆమె పేరుని అనౌన్స్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు…
దీపిక పదుకొనే చాలా సెలెక్టెడ్ గా తన పాత్రను పోషించింది… మరి కృతి సనన్ సైతం దీపికను మైమరిపింపజేసేలా ‘కల్కి 2’ లో నటించగలుగుతుందా అనీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ‘ఆది పురుషు’ సినిమాలో సీత పాత్రలో అదరగొట్టిన ఆమె ఈ క్యారెక్టర్ ను అలవోకగా చేస్తోంది అంటూ మరికొంతమంది ఆమెకి సపోర్టుగా మాట్లాడుతుండడం విశేషం…
ఇప్పటివరకు ఆమె చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. కాబట్టి దీపిక ప్లేస్ ని రీప్లేస్ చేయాలంటే తనే బెస్ట్ ఆప్షన్ గా సినిమా యూనిట్ మొత్తం భావించారు. అందువల్లే ఫైనల్ గా ఆమెని ఒప్పించినట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా షూటింగ్ 2026 చివర్లో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…