Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie) షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన లో ఉన్నారు. అయితే అభిమానుల్లో ఈ సినిమా పై పెద్దగా ఆశలు లేనట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణం టీజర్ వేసిన దెబ్బ అనే అనుకోవాలి. ఈ సినిమా ప్రారంభం సమయంలో అంచనాలు పాన్ ఇండియన్ సినిమాలకు ఏ రేంజ్ లో ఉండేవో, ఆ రేంజ్ లోనే ఉండేవి. కానీ టీజర్ విడుదల తర్వాత అందులోని నాసిరకపు గ్రాఫిక్స్ ని చూసి ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. అప్పట్లో ‘ఆదిపురుష్’ టీజర్ కి ఎలాంటి ట్రోల్స్ వచ్చాయో, విశ్వంభర కి కూడా అదే రేంజ్ ట్రోల్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన మొదటి పాటకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రం గానే వచ్చింది.
Also Read: ‘హిట్ 3’ గురించి రామ్ చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..హీరో నాని కౌంటర్ వైరల్!
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష కృష్ణన్(Trisha Krishnan) నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టాలిన్ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ఆమె కలిసి చేస్తున్న రెండవ చిత్రమిది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు. అంతే ఆమె క్యారక్టర్ పేరు ‘అవని’ అని కూడా రివీల్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని చూసిన తర్వాత ఇదేంటి ఎదో కమర్షియల్ యాడ్ లో కనిపించినట్టుగా ఉంది, సీరియల్ హీరోయిన్ రేంజ్ లో ఉంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీరు తీస్తున్నది నిజంగా సినిమానేనా?, లేకపోతే సీరియల్ తీస్తున్నారా?, అసలు ఆ క్వాలిటీ ఏంటి అంటూ మూవీ టీం ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇలా ‘విశ్వంభర’ నుండి ఏ కంటెంట్ విడుదలైన ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈమె అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘నా సామి రంగ’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే ఈ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె చిరంజీవి సోదరి క్యారక్టర్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం లో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. MM కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. #RRR తో ఆస్కార్ అవార్డుని అందుకున్న వెంటనే ఒప్పుకున్న చిత్రమిది. చిరంజీవి తో దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత కీరవాణి చేస్తున్న చిత్రం కూడా ఇదే. మొదటి పాట ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వలేదు, మిగిలిన పాటలు ఎలా ఇచ్చాడో చూడాలి.