Congress : కాంగ్రెస్ బాధ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ఆపరేషన్ సింధూతో భారత ప్రతిష్ట పైపైకి వెళ్లినందుకు లోలోపల కాంగ్రెస్ బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన చేసి వదిలేశారు. కాంగ్రెస్ కింది స్థాయి నేతలు భారత ప్రభుత్వం చేసిన దానికి మద్దతు ప్రకటించకుండా అనుమానాలు వ్యక్తం చేశారు.
మనం ఇంత సంబరాలు చేసుకుంటుంటే.. కాంగ్రెస్ కు మాత్రం డైజెస్ట్ కావడం లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తే కాంగ్రెస్ కు ఎందుకు బాధనో అర్థం కావడం లేదు. ప్రపంచమంతా భారత్ ను కీర్తిస్తుంటే సంబరాలు చేసుకోకుండా కాంగ్రెస్ బాధపడతోంది. మోడీకి క్రెడిట్ రాకుండా కాంగ్రెస్ చేయాలని ప్రయత్నాల చేస్తోంది.
చేతనైతే మోడీని పొగడండి.. లేదంటే కామ్ గా ఉండండి.. ట్రంప్ కొన్ని ప్రకటనలు ఇచ్చారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మోడీని టార్గెట్ చేశారు. ట్రంప్ కు మోడీ లొంగిపోయాడని కాంగ్రెస్ విమర్శల గుప్పిస్తోంది.
భారత్ ప్రతిష్ట పెరిగితే కాంగ్రెస్ కి బాధగా వుందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.