Samantha: గత కొంతకాలం గా సమంత(Samantha Ruth Prabhu) రాజ్ నిడిమోరు(Raj Nidimoru) అనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రాజ్ నిడిమోరు తో కలిసి ఉన్న ఫోటోలను ఇది వరకే అనేక సార్లు అప్లోడ్ చేసింది. అంతే కాకుండా ‘శుభమ్’ మూవీ రిలీజ్ కి ముందు ఆమె తిరుమలకు వెళ్తే, ఆమెతో పాటు రాజ్ నిడిమోరు కూడా వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరి ఇళ్లల్లో కూడా పెళ్ళికి ఒప్పేసుకున్నారు. ఇక కేవలం పెళ్ళికి చేసుకోవడం మాత్రమే బ్యాలన్స్ ఉంది. సమంత గత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిది , అందరికీ తెలిసిందే. కానీ రాజ్ నిడిమోరు చరిత్రపై మాత్రం ఎవరికీ అంతగా తెలియదు.
Also Read: బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదు..అరెస్ట్ తప్పదా?
ఆయనకు శ్యామలీ(shhyamali de) అనే భార్య ఉంది. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ సంచలనం గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా గురించి ఆలోచిస్తూ, నా క్షేమాన్ని, నా సంతోషాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరికి బరువెక్కిన హృదయంతో నా ప్రేమని మీకు పంపిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు శ్యామలీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉండేది. కానీ ఈమధ్య కాలం లో ఎందుకో చాలా సైలెంట్ అయ్యింది. అకస్మాత్తుగా ఆమె ఈ పోస్ట్ పెట్టేలోపు అందరూ సమంత, రాజ్ నిడిమోరు ని ఉద్దేశించి పెట్టిందే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలం లో సమంత రాజ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంది. అవి చూసి శ్యామలీ ఎమోషనల్ అయ్యి ఉండొచ్చని, అందుకే ఇలా పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
రాజ్ నిడిమోరు, శ్యామలీ కి 14 ఏళ్ళ క్రితం పెళ్లి అయ్యింది. పదేళ్ల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన వీళ్లిద్దరు, కొన్ని అనుకోని కారణాల వల్ల 2022 వ సంవత్సరం లో విడిపోయారు. ఇక ఆ తర్వాత సమంత తో రాజ్ నిడిమోరు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో సమంత విలన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నాగ చైతన్య తో సమంత విడాకులు తీసుకుంది. అదే సంవత్సరం లో రాజ్ నిడిమోరు కూడా తన భార్య తో విడాకులు తీ