Sonia Gandhi : వింత ప్రపంచం ఇదీ.. నిజాల కన్నా అబద్ధాలు ఎక్కువగా ప్రచారం అవుతాయి. నమ్మేటు వంటి ప్రజలు.. వారి మైండ్ సెట్ ను మార్చేటువంటి వింత ప్రపంచం.. గత లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు బీజేపీకి వస్తే రిజర్వేషన్లు మార్చేస్తారు.. రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ఓ జోరు ప్రచారం నడిచింది. ఇది బాగా జనంలోకి వెళ్లింది. బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ వెనుకబడిపోయింది. అక్కడా ఓట్లు పడలేదు. అధికారంలో ఉన్నా బీజేపీ తక్కువ సీట్లకు పడిపోయింది.
మహ్మద్ గజినీ 17 సార్లు దండయాత్ర చేసి సోమనాథ్ టెంపుల్ సహా హిందూ దేవాలయాలను నాశనం చేసేస్తే.. దాన్ని చరిత్ర కారులు ఎలా సృష్టించారంటే.. నిధుల కోసమే గజినీ దాడి చేశారని ఆరోపించారు. చివరకు జవహర్ లాల్ నెహ్రూ కూడా ఇదే పాయింట్ రాసుకున్నాడు. ఎంత మసిపూసి మారేడుకాయ చేశారంటే.. దారుణంగా అభూత కల్పనలు చేశారు.
650 సంవత్సరాలకు అటూ ఇటూగా ముస్లింల దండయాత్ర భారత్ పై మొదలైంది. ఇస్లామిక్ రాజ్యవిస్తరణలో భాగంగా.. ఇరాన్, ఈజిప్ట్, సిరియా, పర్షియాలను ఆక్రమించిన ముస్లిం రాజులు.. భారత్ ను మాత్రం మొదట్లో జయించలేదు. మహ్మద్ బిన్ ఖాసీం తర్వాత భారత్ పై దండయత్రలు బాగా జరిగాయి. 550 సంవత్సరాల పాటు ముస్లిం రాజులను , గుజరాత్, కశ్మీర్, రాష్ట్ర కూట హిందూ రాజులు ఈ ముస్లిం రాజ్యాలను ఎదురించారు.
లోతుగా విశ్లేషించండి ద్వేషాన్ని రెచ్చగొడుతోందెవరో తెలుస్తుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.