Nara Lokesh : రాష్ట్రంలో కూటమిలో విభేదాలు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. సహజంగానే ఇది వైసిపి సోషల్ మీడియా( YSR Congress social media ) ప్రచారం చేస్తుంది. పవన్, లోకేష్ ల మధ్య ఆధిపత్యం నడుస్తోందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే వారిద్దరూ కలుస్తున్నారు. ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. అంతకుమించి ఏమి కనిపించడం లేదు కూడా. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పై కృతజ్ఞతా భావం చూపుతుంటారు చంద్రబాబు. అదే సమయంలో లోకేష్ సైతం పవన్ అన్నయ్య అంటూ సంబోధిస్తుంటారు. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కృషిని, పట్టుదలను అన్ని వేదికల వద్ద ప్రకటించేందుకు వెనుకడుగు వేయరు నారా లోకేష్. తాజాగా పవన్ విషయంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు లోకేష్.
Also Read : అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ?
* సమన్వయంగా ముందుకు సాగుతూ..
వాస్తవానికి సీఎంగా చంద్రబాబు( CM Chandrababu) ఉన్నారు. కానీ జోడెద్దుల్లా కష్టపడుతోంది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఈ ఇద్దరు కాంబినేషన్లో బాగానే వర్కౌట్ అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి, కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రత్యర్థులపై టార్గెట్ వంటి వాటి విషయంలో ఈ ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పది నెలలుగా ఇద్దరి మధ్య సమన్వయంతో పాటు పలు విషయాల్లో ఏకాభిప్రాయంతో నడుచుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. ఏనాడైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అక్కడకు వెళ్లి పరామర్శించారు పవన్. వెనువెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అప్పటినుంచి పవన్ విషయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం ఫిదా అయ్యారు. పలు సందర్భాల్లో పవన్ ఔన్నత్యాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.
* పవన్ పై లోకేష్ అభినందనలు..
డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఉన్నారు. ఆయన వద్ద కీలకమైన ఐదు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. పల్లె పాలన అంతా పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. అందుకే పవన్ ప్రత్యేక చర్యలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ చొరవతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాజాగా అదే విషయాన్ని చెబుతూ అభినందనలతో ముంచేత్తారు నారా లోకేష్. కనిగిరిలో సిబిజి ప్లాంట్ శంకుస్థాపనకు హాజరయ్యారు నారా లోకేష్. ఈ సందర్భంగా జరిగిన సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్నయ్య అంటూ చెప్పుకొచ్చారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని.. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టిన తాగునీటి పథకాలను పూర్తిచేసే బాధ్యతను ఆయన తీసుకున్నారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధత వల్ల కేంద్రం కూడా భారీగా నిధులు ఇచ్చి ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా లోకేష్ ప్రసంగం విన్నవారు పవన్ కళ్యాణ్ పట్ల లోకేష్ కు ఉన్న విధేయత భావాన్ని చూసి అభినందనలు తెలిపారు.
* ఆ అవకాశమే లేకుండా
అయితే ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు ఆ రెండు పార్టీల మధ్య విభేదాలకు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో.. నారా లోకేష్ కు( Nara Lokesh) తప్పకుండా విభేదాలు వస్తాయని భావిస్తున్నారు. రాజకీయ ఆధిపత్యం లో భాగంగా వారి మధ్య విభేదాలు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే అటు పవన్ సైతం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ సైతం పవన్ విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ నేతలిద్దరి వ్యవహార శైలితో రెండు పార్టీల శ్రేణుల్లో ఉన్న చిన్నపాటి విభేదాలు సైతం సమసి పోతున్నాయి. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడని అంశం.
Also Read : కొడాలి నానికి బైపాస్ సర్జరీ…. ఆందోళనలో అభిమానులు