Homeజాతీయ వార్తలుKCR: ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సంచలన ప్రకటన

KCR: ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సంచలన ప్రకటన

KCR: కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అంశం.. ‘ముందస్తు ఎన్నికలు’. 2019 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లకుండా అనూహ్యంగా రాజీనామా చేసేసి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ గెలిచేశారు. నాడు కనీసం ప్రతిపక్షాలకు సర్దు కోవడానికి కూడా సమయం ఇవ్వలేదు కేసీఆర్. వాళ్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకోకుండానే.. సన్నద్ధం కాకుండానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. నాడు మోడీ మేనియాకు ఎదురొడ్డి నిలవడం కూడా కష్టమని భావించి ముందస్తుకు వెళ్లి కేసీఆర్ విజయం సాధించారు.

Telangana
kcr

అయితే ఇప్పుడు కూడా మళ్లీ అలానే వెళతారనే ప్రచారం ఉంది. కేసీఆర్ ముందస్తుకు వెళతాడని ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ హోరెత్తిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నా కూడా వాళ్లు పాదయాత్రలు, సభలు, సమావేశాలంటూ నానా హంగామా చేసేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియక ఇలా ఆగమాగ మవుతున్నారు.

కానీ అందరూ తలిచింది కేసీఆర్ చేయడు.. కేసీఆర్ చేసేది ఎవ్వరూ తలచరు. అదే కేసీఆర్ స్పెషాలిటీ. ఊహకందని విధంగా పనులు చేయడంలో కేసీఆర్ ను మించిన నేత లేరు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేసి చిత్తు చేసే సామర్థ్యం కేసీఆర్ సొంతం. అదే అతడిని రాజకీయాల్లో ఆరితేరిన నేతగా మలిచింది.

తాజాగా సీఎం కేసీఆర్ మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేశాడు. నవంబర్ 15న వరంగల్ లో 10లక్షల మందితో విజయగర్జన సభకు నాంది పలికాడు. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. 25 తర్వాత హుజూరాబాద్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచితీరుతామని స్పష్టం చేశారు.

అంతేకాదు.. ప్రతిపక్షాలు ఆశిస్తున్నట్టు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. రెండున్నర ఏళ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించాడు. ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper