Homeఆంధ్రప్రదేశ్‌Somu Veerraju : సోము వీర్రాజుపై ఏబీఎన్ ఆర్కే తప్పుడు కథనం.. కమ్మ లాబీ కుట్ర...

Somu Veerraju : సోము వీర్రాజుపై ఏబీఎన్ ఆర్కే తప్పుడు కథనం.. కమ్మ లాబీ కుట్ర వెనుక అసలు నిజాలివీ

Somu Veerraju : ఏబీఎన్ ఆర్కే.. తన వాళ్లైతే ‘కమ్మ’గా.. పగోడు అయితే ‘కాపు’కాసి దెబ్బతీస్తాడు. తన పత్రికలో అవాస్తవాలు వేసి అభాసుపాలు చేస్తాడు. కమ్మోళ్లు ఏం చేసినా ఆహో ఓహో అంటూ మీడియాలో చాటడం.. ప్రత్యర్థి కాపు వాళ్లు ఎదిగితే ఓర్వలేక వారిని రాజకీయంగా దెబ్బతీయడం.. ఏబీఎన్ ఆర్కేకు చంద్రబాబు ‘వెన్నె’తో పెట్టిన విద్య అంటారు. ఏబీఎన్ ఆర్కేనే కాదు.. టీడీపీ మీడియా అంతా ఇదే బ్యాచ్ అంటారు. తమ సొంత ‘కమ్మ’ నేతలను అందలం ఎక్కించడం.. ప్రత్యర్థి కాపు, రెడ్డి నేతలను అధ: పాతాళానికి తొక్కేయడం ముందు నుంచి వీరికి అలవాటు. తమ మాట వినని వారిని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతా చేసేస్తుంటారు. తాజాగా ఏపీ బీజేపీలోని కొందరు కమ్మ నేతల ప్రోద్బలంతో కాపు నేత, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేసిన కథనం వివాదాస్పదమైంది.దాన్ని అందిపుచ్చుకొని టీడీపీ మీడియా, కమ్మ మీడియా ఎంత అభాసుపాలు చేయాలో అంతా చేశాయి. ఇంతకీ ఆ వివాదం ఏంటి? ఏబీఎన్ ఆర్కే ఎందుకిలా బురదజల్లాడు? వెనుకలా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రత్యేక కథనం

-వివాదం ఏంటి?
ఇటీవల ప్రధాని విశాఖలో పర్యటించారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డితోపాటే ఏపీ బీజేపీలోని కీలక నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ నేతల బ్యాక్ గ్రౌండ్ ను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న మీరు ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారు? ఆర్థికంగా మీకు వనరులు ఉన్నాయా? పార్టీ పరంగా సాయం కావాలా? అన్న ధోరణితో అడిగారు. ఈ క్రమంలోనే మీరు ‘ఏం చేస్తారు సోము వీర్రాజు గారు’ అని ఆప్యాయంగా మోడీ అడిగారు. దానికి ‘సార్ నాకు వ్యాపారాలు ఏవీ లేవు.పార్టీకోసం 40 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను’ అంటూ వినమ్రంగా చెప్పుకొచ్చాడు. మోడీతో ఇది జరిగింది. కానీ దీన్ని ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు వ్యతిరేక వర్గానికి చెందిన వారు చిలవలు పలవలు చేసి మీడియాకు వేరే విధంగా లీక్ చేశారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మోడీ మీ పేరేమిటి? అని అడిగాడని.. సోము వీర్రాజు కూడా మోడీకి తెలియదా? ఆయనకు గుర్తింపు’ లేదు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి మీడియాలో ‘ఆప్ కా నామ్ క్యా హై’ పేరుతో కథనం ప్రచురించారు. మోడీ ప్రశ్నతో సోము వీర్రాజు అవాక్కయ్యారని.. పార్టీ అధ్యక్షుడినే ప్రధాని గుర్తించలేదని.. దీనికి కోర్ కమిటీ సభ్యులే ఆశ్చర్యపోయారని కథనం వండి వర్చారు.

-జరిగింది ఇదీ..
ఏపీలో బీజేపీ అధికారంలో లేదు. పైగా ప్రతిపక్షంలో కూడా లేదు. సో నేతలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? ఆస్తులు ఉన్నాయా? పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతోనే మోడీ ఇలా అందరి నేతల వద్దకు వెళ్లి మీరు ఏం చేస్తుంటారు? మీకు వ్యాపారాలు ఉన్నాయా? సాయం కావాలా? అన్న రీతిలో ఆప్యాయంగా అడిగారు. సోము వీర్రాజును అడిగారు. దీన్ని ఈ కోర్ కమిటీలోని సోము వీర్రాజు అంటే పడని కమ్మ నేతలు అదే కమ్మ మీడియా అయిన ఆంధ్రజ్యోతికి లీక్ చేసి.. సోము వీర్రాజును ప్రధాని గుర్తించలేదని అవాస్తవాలను ప్రచారం చేశారు. సోము వీర్రాజు కు విలువ లేదంటూ ప్రచారం చేసి తమ పగ ప్రతీకారాలను తీర్చుకున్నారు.

-ఆంధ్రజ్యోతి విషం చిమ్మింది..
సోము వీర్రాజు కాపు నేత. బలంగా ఎదిగారు. పోరాడుతున్నారు. అందుకే ఈయనంటే పడని బీజేపీలోని కమ్మ లాబీ నేతలు ఆయనను తొక్కేయాలని చూస్తోంది. దీనికి ప్రధానితో కోర్ కమిటీలో జరిగిన దాన్ని వాస్తవానికి భిన్నంగా తమ కమ్మ మీడియా అయిన ఆంధ్రజ్యోతికి ఉప్పందించి సోము వీర్రాజును అభాసుపాలు చేయించింది. కనీసం సోము వివరణ కూడా అడగకుండా ఆంధ్రజ్యోతి అచ్చు వేసి విషం చిమ్మింది. కోర్ కమిటీలోని ఇది వరకు అధ్యక్ష పదవి చేపట్టిన ఓ కమ్మ నేతనే ఇదంతా చేయించాడని.. సోము వీర్రాజుకు క్రెడిట్ దక్కకుండా కుట్ర పన్నాడని ఆయన వర్గం ఆరోపిస్తోంది.

-జీవీఎల్ క్లారిటీ..
సాధారణంగా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పరు. కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని సోము వీర్రాజును టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారని జీవీఎల్ మండిపడ్డారు. సోము వీర్రాజు గారిని ‘మీ పేరేమిటి’ అని అడిగారని రాశారు. ఇది వీర్రాజును బలహీన పరచటానికి బురద చల్లటానికీ రాసిన రోత అని జీవీఎల్ ఫైర్ అయ్యారు.. ‘మోదీ వద్దకు వెళ్లిన వారు మొదట సంప్రదాయం ప్రకారం తమ పేర్లు హోదాలు చెప్తారు. అంతకు ముందు ఏయిర్ పోర్టులో సోము వీర్రాజుగారు మోడీకి స్వయంగా స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారు కదా? అంతకు ముందు పవన్ కల్యాణ్ ను మోదీ వద్దకు తీసుకు వెళ్లింది సోము వీర్రాజుగారు కాదా? మీరు కోరుకున్న నాయకుడికి అనుకూలంగా మసలటం లేదనే కదా ఈ అసత్య రాతలు?’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పత్రికలో రాసిన రాతలపై జీవీఎల్ మండిపడ్డారు. మీకు సోము వీర్రాజు అంటే పడదు కనుక ఆయన‌మీద ఊహించుకుని రాసేస్తారా? మీకు ఆత్మ అనేది ఉంటే ఆత్మ విమర్శ చేసుకోండని ఏబీఎన్ ఆర్కేకు.. ఇది ప్రచారం చేసిన మీడియాకు జీవీఎల్ హితవు పలికారు. సోముజీ మీరు ఏం చేస్తుంటారు’ అని మోదీజీ అడిగితే _42 ఏళ్లుగా పార్టీకి అంకితం అయ్యానని వీర్రాజుగారు చెప్పారు. నా మాదిరిగానేనా! అని మోదీ వ్యాఖ్యానించారు. ఇంత మంచి అభినందన‌ ఇక ఎవరికైనా లభిస్తుందా? అని జీవీఎల్ అక్కడ జరిగిన సంభాషణపై క్లారిటీ ఇచ్చారు.

-మోడీతో సోము వీర్రాజుది 8 ఏళ్ల అనుబంధం..
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక.. అంతకుముందు కూడా ప్రధాని మోడీతో ఆయనకు అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరికీ పరిచయం ఉంది. ఎన్నో ఆర్ఎస్ఎస్, బీజేపీ మీటింగ్ లలో వీరిద్దరూ కలిశారు. ప్రధాని అయ్యాక ఏపీకి వచ్చిన ప్రతీసారి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికే వారిలో సోము వీర్రాజు ముందుంటారు. ఏపీ బీజేపీ చీఫ్ అయ్యాక వెళ్లి మోడీని స్వయంగా ఢిల్లీలో కలిశారు. ఏపీకి వచ్చినప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. 2014లో నాటి చంద్రబాబు అమరావతి శంకుస్తాపనలోనూ సోము వీర్రాజు మోడీతోపాటు వేదికను పంచుకున్నారు. 2019 ఏప్రిల్ 1న ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ర్యాలీలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మోడీ పక్కనే సోము వీర్రాజు పాల్గొన్నారు. 2019లో మోడీ ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యాక తిరుమల వేంకటేశ్వరుడి దర్శనంలోనూ.. ఆ తర్వాత రోజు తిరుపతి సభలోనూ మోడీ వెన్నంటే సోము వీర్రాజు ఉన్నారు. ఇక ఇటీవల 2022 జులై 1న అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ భీమవరం వస్తే ఆయన పక్కనే మోడీ ఉన్నారు.

మరి ఇంత సన్నిహితంగా ఉన్న మోడీకి సోము వీర్రాజు తెలియదని లీకులు ఇవ్వడం.. దాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాయడం.. సోము వీర్రాజు పరువుకు భంగం కలిగేలా టీడీపీ మీడియా, కొందరు కమ్మ నేతలు కారుకూతలు కూయడం ఏంటో అర్థం కాని పరిస్థితి. మోడీ అక్కడ అన్నదొక్కటి అయితే.. వీళ్లు రాసింది మరొకటి. ఏపీ బీజేపీ చీఫ్ గా కాపు నేత అయిన సోము వీర్రాజు పెత్తనాన్ని సహించలేని కమ్మ బ్యాచ్ ఇదంతా చేస్తోందని.. వారికున్న బలమైన మీడియాతో తొక్కేయాలని చూస్తున్నారని అర్థమవుతోంది. ఇలాంటి కుట్రలు ఎన్నింటినో ఛేదించిన ఘనత సొము వీర్రాజు సొంతం. ఆయన ఎదుగుదలను ఓర్వలేని వారికి ఇదో గుణపాఠం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular