Chiranjeevi- Super Star Krishna: తొలితరం సూపర్ స్టార్స్ లో ఒకరైన కృష్ణ సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్,ఏఎన్నార్ స్టార్స్ గా వెలిగిపోతున్న రోజుల్లో కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి సప్పోర్ట్ లేకుండా స్వయం కృషితో తిరుగులేని స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ మాస్, ఏఎన్నార్ క్లాస్ చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే కృష్ణ గూఢచారి, మోసగాళ్లకు మోసగాడు వంటి హాలీవుడ్ జోనర్స్ ఎంచుకొని సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచారు. కృష్ణ స్టార్ గా ఎదిగే వరకు బాక్సాఫీస్ వార్ ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్యనే జరిగేది. వారిద్దరితో పాటు నేనున్నానంటూ కృష్ణ సరికొత్త స్టార్ గా అవతరించారు.

ఎన్టీఆర్ తర్వాత కృష్ణ అంతటి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి అంటే అర్థం చేసుకోవచ్చు, ఆయన ప్రభంజనం ఎలా ఉండేదో. కృష్ణ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ముందుగానే ప్రణాళికలు వేసుకొని సిద్ధమయ్యేవారు. పెద్ద ఎత్తున పుట్టినరోజు నిర్వహించేవారు. కృష్ణ పుట్టినరోజు కోసం వార్తా పత్రికలు ఎదురుచూసేవి. అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పేపర్ యాడ్స్ ఇచ్చేవారు. ఆ విధంగా పత్రికలకు మంచి ఆదాయం సమకూరేది.
మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే… కృష్ణకు చిరంజీవి వీరాభిమాని. ఆయన సినిమాల్లోకి వచ్చాక కూడా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో టచ్ లో ఉండేవారు. చిరంజీవి ‘పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్’ పేరుతో ఒక అసోసియేషన్ స్థాపించారు. ఆ అసోసియేషన్ కి చిరంజీవి గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు. నటుడిగా ఒక స్థాయికి ఎదిగిన చిరంజీవి తన అభిమాన హీరో కృష్ణతో కలిసి తోడు దొంగలు మూవీలో నటించారు. ఈ మూవీలో చిరంజీవి సెకండ్ హీరో. తోడు దొంగలు చిత్ర ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తాను ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచురించిన పత్రాన్ని చిరంజీవి బయటపెట్టారు. చిరంజీవి వంటి స్టార్ చేత అభిమానించబడిన కృష్ణ స్టార్స్ కే స్టార్ అని చెప్పవచ్చు. చిరంజీవి తిరుగులేని హీరోగా ఎదిగినప్పటికీ కృష్ణతో అనుబంధాన్ని కొనసాగించారు. కృష్ణ పట్ల అమితమైన ప్రేమ, గౌరవం చిరంజీవి చూపిస్తారు. చిరంజీవి నటుడు కావాలనుకోవడానికి, చిత్ర పరిశ్రమకు రావడానికి కృష్ణ ప్రభావం ఎంతగానో ఉందని చిరంజీవి గతంలో వెల్లడించారు. కృష్ణ స్పూర్తితో చిరంజీవి ఎవరి సప్పోర్ట్ లేకుండా స్వయం కృషితో పరిశ్రమలో ఎదిగారు.
Padmalaya Krishna Fans association president chiranjeevi ❤️#HBDLegendarySSKgaru #SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/06Ev4aNj2d
— Milagro Movies (@MilagroMovies) May 31, 2021