ABN RK Kotha Paluku: దేశంలో ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోయిందని.. అధికారాన్ని దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ఆరోపిస్తున్నారు. బీహార్లో ఓటు అధికారి పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. వినూత్నమైన చట్టాలతో.. అమెరికా విధించిన సుంకాలను సవాలు చేస్తూ సరికొత్త దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. ప్రపంచ దేశాలను చుట్టివస్తూ భారత్ సార్వభౌమాధికారాన్ని పెంపొందిస్తున్నారు.. చైనాతో మరోసారి వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణలో యూరియా కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఒక పాత్రికేయుడిగా వీటి వెనుక ఉన్న అసలు విషయాలను.. అసలు నిజాలను బయట పెట్టడం రాధాకృష్ణ బాధ్యత. అతడి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. రాష్ట్రంలో, దేశంలో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసే సత్తా రాధాకృష్ణకు మాత్రమే ఉంది కాబట్టి. పైగా ఆయన తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో ప్రతి ఆదివారం వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటారు. అందులో నిజాలున్నా.. అబద్ధాలున్నా.. మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఎటువంటి శషభిషకు తావు లేకుండా రాస్తుంటారు. అందువల్లే వేమూరి రాధాకృష్ణకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఈ ఆదివారం కొత్త పలుకు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితం కాలేదు. ఇటీవల కూడా దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాధాకృష్ణ రాయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు కూడా అదే నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు.. రాధాకృష్ణ కావాలని గ్యాప్ తీసుకున్నారా.. లేకుంటే గ్యాప్ వచ్చిందా.. తెలియదు గాని ఆయన కొత్త పలుకు రాయకపోతే మాత్రం చాలామంది హర్ట్ అవుతున్నారు. రాధాకృష్ణ ఇలా సైలెంట్ గా ఉండడం మంచిది కాదని పేర్కొంటున్నారు.. ఇటీవల కాలంలో రాధాకృష్ణ పేపర్ కార్యకలాపాలు.. ఛానల్ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్నారని తెలుస్తోంది.. పేపర్ కార్యాలయానికి వెళ్లకపోయినప్పటికీ.. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తన పత్రిక కార్యాలయాలకు వెళ్లారు. సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ప్రక్షాళన కూడా చేపట్టారు. పత్రికను సమున్నత స్థానంలో ఉంచడానికి తన వంతు కృషి చేస్తున్నారు.