Home Blog Page 303

Chiranjeevi Koratala Shiva Issue: చిరంజీవి – కొరటాల శివ మధ్య ఏం జరిగింది… వీళ్ళిద్దరిలో తప్పెవరిది…

Chiranjeevi Koratala Shiva Issue: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భారీ సక్స్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తాయా? తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మారాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో చిరంజీవికి భారీ బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఈ సినిమా సమయంలో కొరటాల శివకి చిరంజీవికి మధ్య విభేదాలు తలెత్తయని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక దేవర సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కొరటాల శివ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల పనుల్లో చేయి పెట్టకపోతే అందరికి మంచిది అంటు కొన్ని కామెంట్లు చేశాడు. కొరటాల చిరంజీవిని ఉద్దేశించే ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా ఆచార్య సినిమా కథలో చిరంజీవి బాగా ఇన్వాల్వ్ అయ్యాడని అందువల్లే ఆ సినిమాను అనుకున్న రీతిలో తీయలేదని కొరటాల శివ తన సన్నిహితుల దగ్గర చెప్పారట… నిజానికి రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ మూవీ లో చాలా చిన్నగా ఉండేది. కానీ ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ ను పెంచడం, కొన్ని విషయాల్లో కొరటాల కాంప్రమైజ్ అవ్వడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని అందుకే ఫ్లాప్ అయిందని మరి కొంతమంది కూడా చెబుతున్నారు…

Pawan Kalyan CM Seat Pressure: సీఎం సీటు కోసం రోజురోజుకు పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఇలా అయితే కష్టమే..

Pawan Kalyan CM Seat Pressure: తమిళనాడు రాజకీయాలు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయా?, ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని అలకరించాలనే వాదన జనసేన పార్టీ క్యాడర్ నుండి రోజురోజుకి ఒత్తిడి పెరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. తమిళనాడు లో మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి , ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న విజయ్ తో, పవన్ కళ్యాణ్ ని పోల్చి చూస్తూ, ప్రతీ రోజు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీడియోలు చేయడం గడిచిన నాలుగు రోజుల నుండి సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎన్నికల్లో విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేసి ఉండుంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడని, అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ని స్థాపించి 14 ఏళ్ళు కావొస్తుంది, కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు.

కానీ విజయ్ మాత్రం పార్టీ ని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రి అయిపోయాడు. దీనినే జనసేన పార్టీ క్యాడర్ , అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు పోవాలి అనే వ్యూహం కచ్చితంగా సరైనదే , కానీ 2029 లో ఆయన కూటమిగానే ఎన్నికలకు వెళ్లినప్పటికీ , ఎట్టి పరిసిటీలోనే రెండున్నర ఏళ్ళ పాటు సీఎం సీట్ షేర్ నిబంధన తోనే ముందుకు పోవాలని , కనీసం 70 స్థానాల్లో పోటీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ స్థాయిలో సీట్లు తీసుకుంటారో లేదో తెలియదు కానీ , సీఎం సీటు షేరింగ్ మాత్రం ఈసారికి ఉండాల్సిందే అని , లేదంటే కచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరి చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు పై ఎలాంటి మక్కువ లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబే 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఆయన. కానీ అభిమానుల నుండి జనసేన పార్టీ కార్యకర్తల నుండి పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవ్వాలి అనే డిమాండ్ విజయ్ కారణంగా రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి తరుపున ప్రకటించకపోతే 2024 లో ఎలా అయితే జనసేన నుండి టీడీపీ కి కోస్తాంధ్ర జిల్లాల్లో ఓటు బదిలీ అయ్యిందో , అలా జరిగే అవకాశాలు సూన్యం అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జారబోతుంది అనేది.

Dhanush Kara Movie Collections: ధనుష్ ‘కర’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ దిశగా అడుగులు..

Dhanush Kara Movie Collections: తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర'(Kara Movie) ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఆన్లైన్ లో టాక్ చాలా పాజిటివ్ గానే వచ్చింది కానీ, పబ్లిక్ లో మాత్రం ఈ చిత్రానికి పెద్దగా టాక్ లేదు. సినిమా చాలా సోదిలాగా ఉందని చాలా మంది కామెంట్ చేశారు. వరుస సూపర్ హిట్స్ లో ఉన్నటువంటి ధనుష్ కి ఈ చిత్రం కాస్త స్పీడ్ బ్రేకులు వేసిందనే చెప్పాలి. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ చిత్రం పై ఐపీఎల్ ప్రభావం తో పాటు, తమిళనాడు ఎన్నికల ప్రభావం కూడా చాలా బలంగా పడిందని అంటున్నారు.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజం ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 1 కోటి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక రాష్ట్రము నుండి 3 కోట్ల 15 లక్షలు , కేరళ రాష్ట్రము నుండి 58 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 10 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 44 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే , ఈ చిత్రం మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం , కాబట్టి కమర్షియల్ గా ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా భావించవచ్చు.

Dhurandhar 2 The Revenge 50 days collections: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ 50 రోజుల వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంత గ్రాస్ కలలో కూడా ఊహించలేదు..

Dhurandhar 2 The Revenge 50 days collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘ధురంధర్'(Dhurandhar 2 : The Revenge) సిరీస్ కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై , ఫుల్ రన్ 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి భాగానికి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో , రెండవ భాగం పై అంచనాలు తారా స్థాయికి చేరింది . ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండడం తో , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. 50 రోజుల హిస్టారికల్ థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.

ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రీమియర్ షోస్ తో కలిపి కర్ణాటక ప్రాంతం లో ఈ చిత్రానికి 141 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ సిరీస్ , కాంతారా సిరీస్ కి తప్ప , మరో సినిమాకు కర్ణాటక లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. అదే విధంగా తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి తెలుగు + హిందీ భాషలకు కలిపి 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ రికార్డు అనొచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే 28 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. తమిళనాడు లో దాదాపుగా 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కేరళ ప్రాంతం లో 19 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి సౌత్ రాష్ట్రాల నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. భాషల వారీగా సౌత్ రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి గమనిస్తే హిందీ వెర్షన్ నుండి 223 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలుగు వెర్షన్ నుండి 48 కోట్ల రూపాయిలు, తమిళ వెర్షన్ నుండి 23 కోట్ల రూపాయిలు , కన్నడ వెర్షన్ నుండి 4 కోట్ల 50 లక్షలు, మలయాళం వెర్షన్ నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా 1390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఓవర్సీస్ నుండి 440 కోట్ల రూపాయిలు, ప్రపంచవ్యాప్తంగా 1830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ, ఈ నెల 15 నుండి డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Mahesh and Sandra couple: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో చరిత్ర సృష్టించిన జోడీ.. ఇది కదా విజయం అంటే..

Mahesh and Sandra couple: ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు , అలా తక్కువ అంచనా వేసిన ప్రతీసారి, ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఆ మనిషి హిస్టరీ క్రియేట్ చేసి అందరికంటే ముందుకు దూసుకెళ్లిన సందర్భాలు గతం లో మనం చాలానే చూశాము. అది రాజకీయాల్లో అయినా సరే, సినిమాల్లో అయినా సరే. అయితే రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షోలో అందరికంటే వీక్ జంట అనిపించుకుంది మహేష్ – సాండ్రా జంట. మొదటి మూడు వారాలు వీళ్లకు ఒక్క పరిస్థితి కూడా అనుకూలించలేదు, ఏ జంట కూడా వీళ్ళతో కలిసి గేమ్స్ ఆడేందుకు ముందుకు రాలేదు , ఎందుకంటే వీళ్ళు బాగా ఆడడం లేదని, వీళ్ళతో కలిసి ఆడితే మనకు కూడా మైనస్ అవుతుందనే ఉద్దేశ్యం ఉండడం వల్లే.

అలా ఒక్క పరిస్థితి కూడా అనుకూలించకపోవడం తో , ఈ జంట మూడవ వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే అదృష్టం కలిసొచ్చి మరోసారి వీళ్లకు అవకాశం కల్పిస్తూ , వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు మేకర్స్. అలా వైల్డ్ కార్డు ద్వారా లోపలకు అడుగుపెట్టిన ఈ జంట మొదట్లో పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడారు , డేంజర్ జోన్ లో రాకుండా జాగ్రత్త పడ్డారు. గత వారం లో అయితే ఈ జంట ని మ్యాన్షన్ లో ఉన్న ప్రతీ జంట అవమానించింది. ముఖ్యంగా సిద్దు – సోనియా జంట ఏ రేంజ్ లో అవమానించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీకు బాగా వీక్ గా అనిపించే జంట లో ఒకరిని కూర్చోబెట్టి కారణాలు చెప్పండి అని ప్రేమ గురు ఇచ్చిన టాస్క్ లో , ఈ సిద్దు సోనియా జంట మహేష్ – సాండ్రా లను తీవ్రంగా అవమానించారు.

మాకు మీరిద్దరూ వీక్ గానే అనిపిస్తున్నారు , ఇక్కడ రెండు కుర్చీలు పెడితే బెటర్ ఇద్దరినీ కూర్చోబెడుతాము అంటూ చెప్పుకొచ్చారు. అంత చులక భావం తో చూశారు. కానీ కట్ చేస్తే, ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్కుల్లో ఈ జంట ప్రభంజనం సృష్టించింది. ప్రతీ టాస్క్ ని అద్భుతంగా ఆడి , అత్యధిక పాయింట్స్ తో టికెట్ టు ఫినాలే సంపాదించి, గ్రాండ్ ఫినాలే కి మొదటి ఫైనలిస్ట్స్ గా నిలిచారు. ఇది సాధారమైన విషయం కాదు , ఏ జంట ని అయితే హౌస్ లో అందరూ వీక్ అని భావించారో , ఏ జంట ని అయితే అందరూ వీళ్ళు వేస్ట్ అని అవహేళన చేస్తూ వెక్కిరించారో , నేడు ఆ జంటని మొదటగా ఫినాలే లోకి అడుగుపెట్టారు. ఇది కదా విజయం అంటే , అందుకే పెద్దలు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు , అది చాలా పెద్ద తప్పు అని అంటుంటారు.

Arshdeep Singh viral news: పెళ్లి కాకముందే రెండు చేతులతో మోస్తున్నాడు.. అయ్యో అర్ష్ దీప్ సింగ్.. ఎన్ని కష్టాలు నీకు..

Arshdeep Singh viral news: టీమిండియాలో.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ లో అర్ష్ దీప్ సింగ్ అలియాస్ పాజి కి ఉన్న రేంజ్ వేరు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా ఇతడు పేరు తెచ్చుకున్నాడు. ప్రారంభ ఓవర్లలో వికెట్లు పడగొట్టుతూ.. టీమ్ ఇండియాకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించే బౌలర్ ఇతడు. అందువల్లే టి20 ఫార్మాట్ లో తిరుగులేని బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇతడు బౌలింగ్ వేసే తీరు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అప్ స్టంప్ పక్కన బంతులు వేస్తూ, బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఇతడు సిద్ధహస్తుడు.

ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న ఇతడు.. ఆ జట్టు సాధిస్తున్న విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. అదనపు పరుగులు ఇస్తున్నప్పటికీ.. వికెట్లను తీస్తూ అదరగొడుతున్నాడు. అందువల్లే ఇతడిని తమ వజ్రాయుధమని పంజాబ్ జట్టు పేర్కొంటున్నది. ఇప్పటివరకు పది మ్యాచ్లలో 11 వికెట్లు తీశాడు.. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బంతులు వేయడంలో అర్ష్ దీప్ సింగ్ తోపు అసలు. అందువల్లే అతడిని పంజాబ్ జట్టు కొనసాగిస్తోంది.

అర్ష్ దీప్ సింగ్ ఇటీవల ఒక అమ్మాయితో తరచూ కనిపిస్తున్నాడు. ఆమె ఎవరో ఆరా తీస్తే.. అతడి ప్రియురాలు అని తేలింది. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అయింది. దీంతో ఇద్దరు చిలక గోరింకల మాదిరిగా తిరుగుతున్నారు. ఇటీవల ఆమె పంజాబ్ జట్టు బస్సులో కూడా కనిపించింది. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఆ వీడియో కాస్త సంచలనంగా మారింది.

ఇటీవల హైదరాబాద్ జట్టుతో పంజాబ్ పోటీ పడినప్పుడు.. అర్ష్ దీప్ సింగ్ జట్టు విమానంలో హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితురాలి లగేజ్ ను మోస్తూ కనిపించాడు. తన ప్రియురాలు ముందుకు నడుస్తూ ఉండగా.. వెనకాల రెండు చేతుల్లో లగేజ్ మోసుకుంటూ అర్ష్ దీప్ సింగ్ కనిపించాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అంతేకాదు ఇతడిని నెటిజన్లు ట్రూ జెంటిల్మెన్ అని పేర్కొంటున్నారు.. మరికొందరేమో పెళ్లికాకముందే ఏంటి భయ్యా నీకు ఈ కష్టాలు.. రెండు చేతులతో బరువు మోస్తున్నావు. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

CM Vijay political story: మూడు పార్టీల మద్దతు.. మంత్రి పదవుల కేటాయింపు.. సీఎం విజయ్ స్టోరీలో ఎన్నెన్ని మలుపులో..

CM Vijay political story: ఎన్నికల్లో మెజారిటీ స్థానాల వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టిన ప్రారంభ సంవత్సరంలోనే అధికారం దక్కింది అనుకుంటుండగా.. అనుకోని అవాంతరాలు.. రాజకీయ అనుభవం లేదు. రెండుసార్లు గవర్నర్ వద్దకు వెళ్తే తిరస్కారం ఎదురయింది. మరోవైపు ఏఐడీఎంకే, డీఎంకే నేతలు చర్చలు జరుపుతున్నారు. అధికారాన్ని సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బద్ధ శత్రువులైన ఈ రెండు పార్టీలు పేరుకు ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అధికారాన్ని పంచుకునే కుట్ర చేశారు. ఇవన్నీ కూడా విజయ్ చూస్తూనే ఉన్నాడు. ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మహాబలిపురంలో తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచాడు.

రాజకీయంగా అనుభవం లేదు. అలాగని అధికారాన్ని దక్కించుకోకుండా వదిలిపెట్టే సవాల్ లేదు. ఒకవేళ డీఎంకే, అన్నా డీఎంకే కలిసిపోతే మూకుమ్మడిగా తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అనుకున్నాడు. ప్లాన్ ఏ తో పాటు, ప్లాన్ బీ కూడా అమలు చేయాలని గట్టిగా అనుకున్నాడు.. దానికంటే ముందు తనదైన స్టైల్ లో రాజకీయాన్ని మొదలుపెట్టాడు. అచ్చం సర్కార్ సినిమా మాదిరిగా ఎత్తులు వేశాడు. ఇక్కడ లౌక్యం ప్రదర్శించాడా.. మరొకటి ఏమైనా చేశాడా అనే విషయాన్ని పక్కన పెడితే.. విజయ్ తన అసలు సిసలైన రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.

విజయ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. సిపిఐ తల ఊపింది. సిపిఎం ఒప్పుకుంది. సి వి కే చేయి ఎత్తి జై కొట్టింది. ఫలితంగా విజయ్ పార్టీ బలం 118 స్థానాలకు చేరుకుంది. గవర్నర్ పెట్టిన మెలికతో విజయ్ ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరాడు. గవర్నర్ చెప్పినట్టుగానే ఆ పార్టీలు కూడా మద్దతు లేఖలిచ్చాయి. దీంతో విజయ్ పార్టీ బలం ఏకంగా 118 కి పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటు కావలసిన 117 సభ్యుల కంటే ఒక సీటు అధికంగానే వచ్చింది. విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ సభ్యుల బలం 233 కు చేరుకుంటుంది. అలాంటప్పుడు సభలో మెజారిటీ 117 సరిపోతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజారిటీని విజయ్ సంపాదించాడు. ఫలితంగా రీల్ హీరో కాస్త.. రియల్ హీరో అయిపోతున్నాడు.

గవర్నర్ విధించిన అనేక నిబంధనల వల్ల విజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. సెక్యూరిటీ కాన్వాయ్ తో గవర్నర్ వద్దకు వెళ్లిన తర్వాత.. అక్కడ తిరస్కారం ఎదురైంది. దీంతో అధికారులు కాన్వాయ్ ను రద్దు చేశారు. ఆ సమయంలో విజయ్ పడిన మానసిక వేదన మాటలకు అందనిది. అయినప్పటికీ ఓర్పుతో ఇవన్నీ భరించాడు. ప్రశాంతంగా రాజకీయాలను సున్నితంగా చేశాడు. చివరికి గవర్నర్ కోరినట్టుగానే మద్దతు లేఖలను సంపాదించగలిగాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 117 ఎమ్మెల్యేల బలాన్ని సాధించగలిగాడు. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే రేపు లేదా ఎల్లుండి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు.. మిగతా పార్టీలకు ఒక్కొకటి చొప్పున మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ సుముఖత వ్యక్తం చేశాడు.

Ashu Reddy engagement photos: వివాదాల మధ్య గ్రాండ్ గా జరిగిన అషు రెడ్డి నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Ashu Reddy engagement photos: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీల పేర్లలో ఒకటి అషు రెడ్డి. ధర్మేంద్ర అనే వ్యక్తితో ఒకప్పుడు ప్రేమాయణం నడిపిన అషు రెడ్డి , అతని వద్ద బోలెడంత డబ్బులు ఖర్చు చేయించిందని , పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఏకంగా 9 కోట్ల రూపాయిలు తన నుండి దోచుకుందని ధర్మేంద్ర ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం సంచలనం గా మారింది. దీనిపై అషు రెడ్డి కూడా స్పందిస్తూ , తన వెర్షన్ ని వినకుండానే పోలీసులు కేసు నమోదు చేసారని, దయచేసి ఆ కేసు ని కొట్టి వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ హై కోర్టు లో పిటీషన్ వేసింది. అయితే నేడు హై కోర్టు ఈ విషయం లో కీలక తీర్పు ఇచ్చింది.

ఆమె తల్లి యశోద రెడ్డి పై దర్యాప్తు నిలిపివేయాలని అషు రెడ్డి వేసిన పిటీషన్ ని హై కోర్టు కొట్టివేస్తూ, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంతే కాకుండా కఠిన చర్యల నుండి మినహాయింపు ఇవ్వాలనే అషు రెడ్డి కోరికని కూడా తోసిపుచ్చింది హై కోర్టు. ప్రూఫ్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉండడం తో అశ్విని రెడ్డి అలియాస్ అషు రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది హై కోర్టు. ఇంత జరుగుతుంటే మరోపక్క అషు రెడ్డి ఎలాంటి టెన్షన్ , భయం లేకుండా నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి కొడుకు ముఖాన్ని చూపించలేదు కానీ, వీళ్లిద్దరు చేతులు కలిపిన ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేసింది. కనీసం పెళ్లి తర్వాత అయినా ఆమె పూర్తి ఫోటోలను అప్లోడ్ చేస్తుందో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ధర్మేంద్ర ఇప్పుడు అషు రెడ్డి పై ఇంతటి పోరాటం ఎందుకు చేస్తున్నాడో నేడు అర్థం అవుతోంది. ఆమె మరొకరితో పెళ్ళికి సిద్ధం అవ్వడంతో , తనను నమ్మించి ఎలా మోసిందో చూడండి అంటూ ఆయన సమాజానికి చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే అషు రెడ్డి అతనితో విడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోకుండా, ఒకరి వైపే నిలబడి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రెండు వెర్షన్స్ ని విన్న తర్వాతే మాట్లాడాలి. ఒకవేళ తప్పు ధర్మేంద్ర వైపు ఉంటే ?, డబ్బులు బాగానే ఇచ్చాడు, కానీ అతని ప్రవర్తన నచ్చకో , లేదా వేరే ఏదైనా కారణం చేత అషు రెడ్డి వదిలేసి ఉండొచ్చు కదా అని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Vijay WhatsApp letter controversy: పొత్తు కుదురుతున్న వేళ వాట్సాప్ లో లెటర్.. TVK విజయ్ కి ఎవరైనా రాజకీయాలు నేర్పండయ్యా..

Vijay WhatsApp letter controversy: రాజకీయాలు చేసేవారు లౌక్యాన్ని ప్రదర్శించాలి. అధికారాన్ని దక్కించుకోవాలి అనుకునేవారు గౌరవమర్యాదలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మర్యాద రామన్న టైపులో వ్యక్తిత్వాన్ని కొనసాగించాలి. అప్పుడే కోరుకున్న పదవులు.. ఇంకా చాలా దక్కుతాయి. నేటి కాలంలో రాజకీయాలు సాగించేవారు లౌక్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టే.. అధికారాన్ని దక్కించుకుంటారు. అధికారానికి చేరువైనవారు మరింత లౌక్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారాన్ని జోరుగా సాగించారు. కానీ ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. అడ్డగోలుగా ఆరోపణలు చేయలేదు. బజారు భాష వాడలేదు. ఎప్పటికప్పుడు తమిళ ప్రజలను సవినయంగా వేడుకున్నారు. ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా తమిళనాడును ఆవిష్కరించుకుందామని పదేపదే ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు విజయ్ మాట్లాడిన మాటలు నచ్చాయి. ప్రతీకార రాజకీయాలు చూసిన ప్రజలకు విజయ్ మాట్లాడిన మాటలు కొత్తగా అనిపించాయి. అందువల్లే ఆయన ఓట్లకు డబ్బులు పంచకపోయినప్పటికీ.. విజిల్స్ మాత్రమే ఇచ్చినప్పటికీ ప్రజలు గొప్ప మనసుతో స్వీకరించారు. అందు గురించే ఎక్కువ సీట్లు ఇచ్చి విజయ్ కి ఆధిపత్యాన్ని అందించారు.

మ్యాజిక్ ఫిగర్ కు తగ్గట్టుగా విజయ్ సీట్లు సాధించలేకపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠానికి కాస్త దూరంలో నిలిచారు. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి ఏ క్షణమైనా ఫల ప్రదం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ పార్టీకి అవసరమైన మద్దతును విసికె పార్టీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ పార్టీ మద్దతు కోరుతూ విజయ్ వాట్సాప్ లో లేఖ పంపించారు. ఇది కాస్త విసికె పార్టీ అధినేతత్వానికి ఆగ్రహాన్ని కలిగించింది. వాట్సాప్ లో లేఖ పంపిస్తే దానిని ఎలా అర్థం చేసుకోవాలని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ సెల్వన్ ట్విట్ చేశారు.

వాస్తవానికి ఇటువంటి సమయంలో విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేరుగా విజయ్ వెళ్లి సపోర్ట్ అడిగితే వీసీ కే పార్టీ నేతలు కచ్చితంగా ఆయనకు సపోర్ట్ ఇచ్చేవారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ విజయ్ కేవలం వాట్సాప్ లోనే లెటర్ పంపించారు. ఇక్కడ లౌక్యాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఒక రాజకీయ నేతగా కూడా వ్యవహరించలేదు. అందువల్ల ఈ పరిస్థితి ఎదురయింది. ఇప్పటికైనా కూడా విజయ్ రాజకీయాలు నేర్చుకొని.. లౌక్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ధోరణి కొనసాగించుకుంటూ వెళ్తే విజయ్ అధికారానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Historical bravery story: రాజ్యం కోసం తల్లినే ఎదిరించింది.. గుండె ధైర్యం లేనివారు ఈ వీడియో చూడకండి

Historical bravery story: ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారు. ఎందుకంటే తల్లి అనేక త్యాగాలు చేసి పిల్లల్ని కంటుంది. కనడం మాత్రమే కాదు.. వారిని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే తల్లిని త్యాగానికి పర్యాయపదం అంటుంటారు. అటువంటి తల్లి ఈ జంతువు కైనా సరే దైవంతో సమానం. కానీ ఈ జంతువు మాత్రం తల్లిని బద్ద శత్రువుగా చూసింది. చూడడం మాత్రమే కాదు ఏకంగా చంపేంత పనిచేసింది.

మనుషులే కాదు, జంతువులు కూడా గతి తప్పుతున్నాయి. తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నాయి. ఎంతకైనా తెగిస్తున్నాయి. చివరికి కన్న తల్లి విషయంలో కూడా కర్కషంగా వ్యవహరిస్తున్నాయి. చంపడానికి కూడా వెనుకాడటం లేదు. అటువంటిదే ఈ సంఘటన. రాజస్థాన్లోని రణ తంబోర్ నేషనల్ పార్కులో రెండు ఆడ పులులు భీకరంగా పోరాడుకున్నాయి. రాజ్యం కోసం విపరీతంగా యుద్ధం చేశాయి.. ఈ అడవిలో ఆధిపత్యం కోసం కూతురు తల్లితో దారుణంగా పోరాడింది. అటు తల్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. కూతురికి మించి పోరాటం చేసింది. అయితే కూతురు ముందు తలవంచింది. హోరాహోరీగా రెండు పులులు పోరాడిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. చివరికి తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు కోరుకున్నది ఇచ్చేసింది.

అడవుల్లో పులులు వారసత్వాన్ని కొనసాగిస్తుంటాయి. ఆ వారసత్వాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా పోరాటం చేస్తాయి. ఒక్కసారి వారసత్వం లభిస్తే ఆ పరిసర ప్రాంతాల్లోకి మరో పులి రాదు. ఆ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన జంతువుల మీద ఆ వారసత్వ హక్కును దక్కించుకున్న పులికి మాత్రమే అధికారం ఉంటుంది. ఆ పులి మాత్రమే ఆ జంతువులను చంపి తినాలి. మరో పులి ఆ పరిధిలోకి వచ్చి.. వేట సాగిస్తే ఊరుకోదు. వారసత్వ హక్కును దక్కించుకోడాన్ని పులులు గౌరవంగా భావిస్తాయి. దీనికోసం విపరీతమైన పోరాటం చేస్తాయి. చివరికి ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడవు.

రణతంబోర్ అడవిలో పులుల మధ్య జరిగిన పోరాటం మిగతా వారికి భయంగా అనిపించవచ్చుగాని.. వైల్డ్ లైఫ్ నిపుణులకు అతిపెద్దగా ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే అది సృష్టి ధర్మంలో ఒకటి. ఎందుకంటే వయసు పైబడిన పులులు ఆధిపత్యాన్ని కొనసాగించే హక్కును కోల్పోతాయని యువ పులులు భావిస్తుంటాయి. అందువల్లే ఆధిపత్యాన్ని దక్కించుకోవడానికి అవి పోరాటం సాగిస్తాయి. వీరోచితంగా పోరాటాలు సాగించి ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంటాయి. ఆ సమయంలో అవి చేసే పోరాటం అడవిని మొత్తం దద్దరిల్లే విధంగా చేస్తుంది. రణతంబోర్ అడవిలో కూడా ఆ రెండు పులుల మధ్య పోరాటం అదేవిధంగా సాగింది. అడవిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Peddi trailer release date: ‘పెద్ది’ మూవీ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి.. ట్రైలర్ విడుదల తేదీ లాక్.. వీడియో వైరల్..

Peddi trailer release date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ రీసెంట్ గానే పూర్తి అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ , శృతి హాసన్ మధ్య తెరకెక్కించిన ఐటెం సాంగ్ తో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశారు. రీసెంట్ గానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసి , ఫైనల్ ఎడిట్ ని లాక్ చేసినట్టు డైరెక్టర్ బుచ్చి బాబు అధికారిక ప్రకటన చేశాడు. ఇక విడుదల మాత్రమే బ్యాలన్స్. జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ తోప్ ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. నేడు కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టారు. మొదటి 5 గంటల్లోనే దాదాపుగా 1 లక్షకు పైగా డాలర్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా.

రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించబోయే చిత్రంగా ‘పెద్ది’ నిలబడబోతుందని , ఈ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభం ట్రెండ్ ని చూస్తుంటే స్పష్టంగా అర్థం అయిపోతుంది. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన చిన్న మేకింగ్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో లో డైరెక్టర్ సుకుమార్ సెట్స్ లో ఉండగా, మెగాస్టార్ చిరంజీవి సెట్స్ లోకి అడుగుపెట్టడం , అందరినీ పలకరిస్తూ ముందుకెళ్లి , మానిటర్ లో చరణ్ పెర్ఫార్మన్స్ ని చూడడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు , పహిల్వాన్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా , దానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము. ఈరోజు విడుదల చేసిన వీడియో లో రామ్ చరణ్ ఆ లుక్ లోనే కనిపించాడు. అంటే కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి వెళ్ళాడు అన్నమాట.

ఇక రామ్ చరణ్ నటన చూసి , చాలా కష్టపడి పని చేశాడు సార్ అని సుకుమార్ అనగా, నా లక్షణాలు ఎక్కడికి పోతాయి అంటూ చిరంజీవి సమాధానం ఇవ్వడం , అనంతరం రామ్ చరణ్ స్టైల్ గా ఫోజులు ఇస్తున్నప్పుడు చిరంజీవి ఫోటోలు తీయడం వంటివి ఈ మేకింగ్ వీడియో లో ఆకట్టుకున్న అంశాలు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెల 2 వ తేదీన ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అదే విధంగా ఈ చిరానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 16 న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ వారం లోనే ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Khushboo weight loss secret: జిమ్ కు వెళ్లలేదు.. కడుపు మాడ్చుకోలేదు.. ఈ నటి చూస్తుండగానే 32 కిలోల బరువు తగ్గింది..

Khushboo weight loss secret: ఆమె వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె విపరీతంగా బరువు ఉండేవారు. ఆ బరువు ఆమెకు సమస్యగా ఉండేది. గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి.. అంతటి బరువు ఆమెకు ఇబ్బందిగా అనిపించేది. తన తోటి నటులు స్లిమ్ గా ఉంటే.. తను మాత్రం ఇలా ఉండడాన్ని తట్టుకోలేకపోయింది. అలాగని ఆమె జిమ్ లలో కసరత్తులు చేయలేదు. కడుపు మాడ్చుకోలేదు. 32 కిలోల బరువు తగ్గి ఇప్పుడు సన్న జాజితీగ లాగా మారిపోయారు. అలా మారిపోయిన ఆ నటి పేరు కుష్బూ..

కుష్బూ దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ వంటి వారితో కూడా స్క్రీన్ పంచుకుంది. మొదటినుంచి కాస్త బుద్ధుగా ఉండే కుష్బూ.. ఆ తర్వాత మరింత లావుగా మారిపోయింది. ఇండస్ట్రీ కేవలం గ్లామర్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. మేము నటించాం.. మాకు నటన వచ్చు అంటే పక్కన పెడుతుంది. కుష్బూ కూడా లావుగా కావడంతో అవకాశాలు ఒకప్పటి మాదిరిగా రాలేదు. దీంతో ఆమె బరువు తగ్గడం మీద దృష్టి పెట్టారు. ఆరోగ్యంపై కూడా అత్యంత సీరియస్ గా ఫోకస్ పెట్టారు.

ఎటువంటి కృత్రిమ విధానాలకు వెళ్లకుండా కుష్బూ రోజుకు రెండుసార్లు నడిచేవారు. ఉదయం 45 నిమిషాలు.. సాయంత్రం 45 నిమిషాల పాటు వాకింగ్ చేసేవారు. జంక్ ఫుడ్ పూర్తిగా దూరంపెట్టారు. గ్లూటన్ (మైదా) ను పూర్తిగా అవాయిడ్ చేశారు. పంచదార వాటం మానేశారు. పౌష్టికాహారానికి ఓటు వేశారు. శరీరాన్ని అర్థం చేసుకున్నారు. కూరగాయలను, పండ్లను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకున్నారు.

బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ను తీసుకునేవారు. డైటీషియన్ సూచన మేరకు ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవారు.. దీనికి తోడు ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. మెంటల్ గా.. ఫిజికల్ గా హ్యాపీగా ఉండేవారు . పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు. కెరియర్.. ఇతర విషయాలలో పిల్లల ఇష్టానికే ఆమె ఓటు వేశారు. ఫలితంగా ఖుష్బూ మునుపటి కంటే అందంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె వయసు 55 సంవత్సరాలు. బరువు తగ్గడం.. మంచి ఆహారపు అలవాట్లు పాటించడం.. కుటుంబ సభ్యుల విషయంలో వారి ఇష్టాన్ని గౌరవించడంతో ఆమె పాతిక సంవత్సరాల పడుచులాగా కనిపిస్తున్నారు. అంతే కదా.. బరువు శారీరక సమస్య.. తేలికైన జీవితం మానసిక సమస్య.. ఈ రెండింటిని అధిగమిస్తే జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది. ఇప్పుడు ఇలాంటి జీవితాన్ని కుష్బూ ఆస్వాదిస్తున్నారు.

DRDO TARA glide bomb test: మన డిఫెన్స్ లో ధ్రువ’తార’.. సాధారణ బాంబులు కూడా మిస్సైల్స్ గా మారిపోతాయి..

DRDO TARA glide bomb test: ఆధునిక కాలంలో యుద్ధాలు మారిపోతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి కాబట్టి.. యుద్ధ అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడుతోంది. కొత్త కొత్త ఆయుధాలు.. అంతకుమించిన యుద్ధ విమానాలు ఇప్పుడు కావాల్సి వస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కూడా ప్రపంచానికి అలాంటి పాఠాలే నేర్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న మన దేశం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో యుద్ధరంగాన్ని మార్చేసింది.

ఒకప్పుడు కొత్త కొత్త ఆయుధాలను.. ఆధునిక సాంకేతిక వ్యవస్థలను మన దేశం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేది. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం వాటికి ఖర్చయ్యేది. కొంతకాలంగా మన దేశంలోనే రక్షణ రంగ పరిశోధక వ్యవస్థలు కొత్త కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి. అవి ప్రపంచానికే సరికొత్త డిఫెన్స్ పాఠాలు నేర్పుతున్నాయి.. అటువంటి ఆయుధాన్నే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ కలిసి తయారు చేశాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డి ఆర్ డి ఓ సంయుక్తంగా తయారుచేసిన ఆ ఆయుధం పేరు తార.. సాంకేతికంగా దీనిని tactical advanced range agumentation అని పిలుస్తున్నారు. హైదరాబాదులో ఆర్సిఐ, డిఆర్డిఓ వీరిని కలిసి డెవలప్ చేశాయి. ఈ వ్యవస్థలో అనేక గొప్పదనాలు ఉన్నాయి. ఆర్ సి ఐ, డిఆర్డిఓ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. సాధారణ బాంబులను విమానం నుంచి జార విడిచినప్పుడు ఇవి లక్ష్యాన్ని అందుకోలేవు. వీటిని TARA కు అనుసంధానం చేస్తే.. దానికి ఉండే రెక్కలు, జీపీఎస్ వ్యవస్థ బాంబులకు సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తాయి. వాటికి మిస్సైల్స్ తరహా శక్తిని అందిస్తాయి. ద్వారా అవి ఎక్కువ వేగంతో పనిచేస్తాయి.

అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో లక్ష్యాన్ని చేరుకోలేని బాంబులు అనేకం ఉన్నాయి. ఇందులో అమెరికా జార విడిచిన బాంబులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఏమైనా యుద్ధాలు చోటు చేసుకున్నప్పుడు.. ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేసే బాంబులను తయారు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డి ఆర్ డి ఓ కొంతకాలంగా కీలక ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్.. డిఆర్డిఓ బయటపెట్టాయి. తార ద్వారా దేశీయ గ్లైడ్ వెపన్ సిస్టం మరింత డెవలప్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Instagram new feature: ఇన్ స్టా లో తిక్క తిక్క మెసేజ్ లు పెడితే.. పోలీసులు తాట తీస్తారు.. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా..

Instagram new feature: ఆమధ్య విజయవాడలో ఉగ్రవాదుల కలకలం నెలకొన్న విషయం తెలిసిందే. కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ జరపడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అంతకుమించిన సందేశాలు పంపించారు. అమాయకులైన యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు వారు సోషల్ మీడియాను వాడుకున్నారు. మన దేశ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలవడంతో.. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విజయవాడలో ఉన్న ఆ ఉగ్రవాదులను పట్టుకొని జైలుకు తరలించారు.

సోషల్ మీడియాను మిగతావారు కాలక్షేపం కోసం.. సమాచారం కోసం వాడుతుంటే.. ఉగ్రవాదులు మాత్రం తమ లక్ష్యాల కోసం వాడుకుంటున్నారు. పిల్లల పట్ల లైంగిక హింస.. ఇతర వేధింపులకు పాల్పడేవారు కూడా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ లో ఈ తరహా వ్యక్తులు పెరిగిపోయారు. గతంలో ఫేస్బుక్.. వాట్సాప్ ను వాడేవారు. ఆ తర్వాత ఈ తరహా వ్యక్తుల ధోరణి మారిపోయింది. ఇంస్టాగ్రామ్ ను ఉపయోగిస్తూ ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించేందుకు ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కు ఈరోజుతో మెటా ముగింపు పలికింది. ఇకపై యూసర్లు పంపే అన్ని మెసేజ్ లను మెటా కంపెనీ చూస్తుంది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు.. ఉగ్రవాదం.. పిల్లల పట్ల లైంగిక.. ఇతర వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే మెటా గుర్తిస్తుంది. అంతేకాదు, ఈ తరహా సందేహాలు చేసిన వారి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందిస్తుంది. ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వాడకం చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మరలిపోతున్న నేపథ్యంలో.. మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిపై అనేక రకాల అభ్యంతరాలు వచ్చినప్పటికీ.. వాటికి మెటా కంపెనీ యాజమాన్యం సరైన స్థాయిలో సమాధానం చెప్పింది. అందువల్లే ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కు ముగింపు పలుకుతున్నట్టు మెటా యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఇంస్టాగ్రామ్ వాడకం సవ్యమైన దిశలో సాగుతుందని మెటా పేర్కొంది. చట్ట వ్యతిరేక వ్యక్తులు.. చీకటి కార్యకలాపాలను సాగించేందుకు ఇకపై ఇంస్టాగ్రామ్ ను వాడబోరని మెటా స్పష్టం చేసింది. ఒకవేళ ఆ తరహా వ్యక్తులు అదే మాదిరిగా కంటెంట్ ను కొనసాగిస్తే సదరు వ్యక్తుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థల అధికారులకు అందిస్తామని మెటా స్పష్టం చేసింది..

KC Venugopal Kerala Congress: మీడియా చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా.. కేరళ కాంగ్రెస్ లో కలకలం

KC Venugopal Kerala Congress: ఏదైనా ఒక రహస్యమైన పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో కన్ను పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పూరే. సీక్రెట్ పనులు చేయడం ఆ పార్టీకి చేతకాదు. ఒకవేళ చేసిన సరే వెంటనే బయటపడుతుంది. అప్పుడు దాచుకున్న పరువు పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కాకపోతే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతిపెద్ద తప్పు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. అందులో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది తమకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక కంటే ముందు.. ఎవరు సీఎం అయితే బాగుంటుందో ఎమ్మెల్యేలతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.. ఆ ప్రక్రియను ఒక నివేదిక రూపంలో రూపొందించి అధిష్టానానికి వెల్లడిస్తారు. కేరళలో 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కేసీ వేణుగోపాల్ కి జై కొట్టినట్టు సమాచారం.. ఆ మద్దతు పత్రాలతో కాంగ్రెస్ ప్రతినిధి ముకుల్ వాస్నిక్ ఢిల్లీ వెళ్లారు.

ఆయన ఢిల్లీ వెళ్తుండగా చేతిలోని పత్రాలలో కేసీ వేణుగోపాల్ పేరు స్పష్టంగా కనిపించింది. దీనిపై అధికారికంగా ప్రకటన త్వరలోనే రాబోతుంది. అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన.. కేరళ ముఖ్యమంత్రి అయితే.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.. వాస్తవానికి ముకుల్ తన దగ్గర ఉన్న పత్రాలను జాగ్రత్తగా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అలా కాకుండా వేణుగోపాల్ పేరు కనిపించే విధంగా పట్టుకెళ్లడంతో కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ముందుగానే తెలిసిపోయింది. ఇటువంటి సీక్రెట్ విషయాలలో రహస్యాన్ని పాటించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాసుపాలైందని పొలిటికల్ వర్గాలలో చర్చ సాగుతోంది.

కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఒకప్పుడు అహ్మద్ పటేల్ రాహుల్ గాంధీకి.. సోనియా గాంధీకి అత్యంత దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఆ పాత్రను కేసి వేణుగోపాల్ పోషిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేణుగోపాల్ తీవ్రంగా కృషి చేశారు. తద్వారా దక్షిణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన పట్టు ఉందని.. ప్రజల్లో ఆ నమ్మకం ఉందని మరోసారి నిరూపించారు కేసి వేణుగోపాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కి కేసి వేణుగోపాల్ అత్యంత దగ్గరి స్నేహితుడు.

Unique Temple Prasadam: లడ్డు, పులిహోర కాదు.. ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బును ఇస్తారు

Unique Temple Prasadam: శీర్షిక చదివిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కదా.. మనం ఏదైనా ఆలయానికి వెళ్తే… దైవదర్శనం పూర్తయిన తర్వాత అర్చకులు మనకు ప్రసాదంగా లడ్డు లేదా పులిహోర ఇస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆలయ ప్రాశస్త్యానికి అనుగుణంగా ప్రసాదాన్ని మనకు అందజేస్తారు. కానీ ఈ ఆలయం మాత్రం పూర్తి విభిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ దైవదర్శనం పూర్తయిన తర్వాత మనకు ప్రసాదంగా లడ్డు ఇవ్వరు. పులిహోర అంతకంటే ఇవ్వరు.

రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోడ్ గడ్ జిల్లాలో బానోడ బాలాజీ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా లడ్డూలు.. పులిహోర ఇవ్వరు. ఈ ఆలయంలో భక్తుల నుంచి వచ్చే కానుకల్లో కొంత భాగాన్ని భక్తులకే ప్రసాదం రూపంలో అందిస్తుంటారు. వీటిని భక్తులు భద్రపరచుకుంటే సిరిసంపదలు కలుగుతాయని.. వ్యాపారం , వ్యవసాయంలో లాభాలు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. తమ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు తాము పొందిన డబ్బుకు మరింత రెట్టింపు ఈ ఆలయానికి ఇస్తుంటారట.

ఈ ఆలయాన్ని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఉత్సవాలు, వేడుకల సమయంలో ఇక్కడ భక్తులు అధికంగా ఉంటారు. ఎంత స్థాయిలో భక్తులు వచ్చినప్పటికీ.. వారికి డబ్బు రూపంలో ప్రసాదాన్ని అందజేస్తూనే ఉంటారు. అందువల్లే ఈ క్షేత్రానికి విశిష్టమైన పేరు వచ్చింది.. తిరుపతి మాదిరిగానే ఇక్కడి బాలాజీకి ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి.. ఉత్సవాల సమయంలో ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.

డబ్బులు మాత్రమే కాకుండా.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పులిహోర.. లడ్డు ప్రసాదం ఇస్తారు. కాకపోతే అది డబ్బులతో కొనుగోలు చేయాలి.. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని విస్తరిస్తున్నారు.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. అందువల్లే నిర్ణీత సమయాలలోనే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.

Hanta virus symptoms: వణికిస్తున్న ‘హంటా’..లక్షణాల ఇవే.. WHO హెచ్చరిక

Hanta virus symptoms: అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక డచ్ నౌకలో హంటా వైరస్ (Hantavirus) వెలుగుచూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకల ద్వారా సోకుతుంది. కానీ ఈ నౌకలో వ్యాపిస్తున్నది అత్యంత ప్రమాదకరమైన ‘అండెస్ స్ట్రెయిన్’ కావడంతో వైద్య నిపుణులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

హంటా వైరస్ ప్రధానంగా ఇన్ఫెక్ట్ అయిన ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అయితే ఈ డచ్ నౌకలో కలకలం రేపుతున్న ‘అండెస్’ రకం వైరస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి నేరుగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నౌక వంటి పరిమిత ప్రదేశంలో ప్రయాణికులు దగ్గరగా ఉండటం వల్ల ఇది వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

లక్షణాలు:
ఈ వైరస్ సోకిన వారిలో ప్రాథమికంగా అలసట, తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ బాధితుల్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో నీరు చేరడం (Pulmonary Edema) వల్ల రోగి పరిస్థితి విషమిస్తుంది. వైద్య గణాంకాల ప్రకారం, ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. అంటే దీని మరణాల రేటు సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉంటుంది.

WHO హెచ్చరిక :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రయాణాలు, నౌకల ద్వారా ఈ కేసులు ఇతర దేశాలకు పాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని, నౌకలోని ఇతర ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం అనేక దేశాలు తమ ఓడరేవుల వద్ద నిఘాను పెంచాయి. ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే వారిని స్క్రీనింగ్ చేస్తున్నాయి.

నివారణ మార్గాలేమిటి?
ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి నివారణే ఏకైక మార్గం. ఎలుకలు తిరిగే ప్రదేశాలకు దూరంగా ఉండటం. పరిశుభ్రతను పాటించడం, మాస్కులు ధరించడం. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. నౌకలో ఉన్న ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందించేందుకు నెదర్లాండ్స్ , ఇతర యూరోపియన్ దేశాల వైద్య బృందాలు రంగంలోకి దిగాయి.