Home Blog Page 304

KC Venugopal Kerala Congress: మీడియా చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా.. కేరళ కాంగ్రెస్ లో కలకలం

KC Venugopal Kerala Congress: ఏదైనా ఒక రహస్యమైన పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో కన్ను పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పూరే. సీక్రెట్ పనులు చేయడం ఆ పార్టీకి చేతకాదు. ఒకవేళ చేసిన సరే వెంటనే బయటపడుతుంది. అప్పుడు దాచుకున్న పరువు పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కాకపోతే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతిపెద్ద తప్పు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. అందులో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది తమకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక కంటే ముందు.. ఎవరు సీఎం అయితే బాగుంటుందో ఎమ్మెల్యేలతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.. ఆ ప్రక్రియను ఒక నివేదిక రూపంలో రూపొందించి అధిష్టానానికి వెల్లడిస్తారు. కేరళలో 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కేసీ వేణుగోపాల్ కి జై కొట్టినట్టు సమాచారం.. ఆ మద్దతు పత్రాలతో కాంగ్రెస్ ప్రతినిధి ముకుల్ వాస్నిక్ ఢిల్లీ వెళ్లారు.

ఆయన ఢిల్లీ వెళ్తుండగా చేతిలోని పత్రాలలో కేసీ వేణుగోపాల్ పేరు స్పష్టంగా కనిపించింది. దీనిపై అధికారికంగా ప్రకటన త్వరలోనే రాబోతుంది. అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన.. కేరళ ముఖ్యమంత్రి అయితే.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.. వాస్తవానికి ముకుల్ తన దగ్గర ఉన్న పత్రాలను జాగ్రత్తగా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అలా కాకుండా వేణుగోపాల్ పేరు కనిపించే విధంగా పట్టుకెళ్లడంతో కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ముందుగానే తెలిసిపోయింది. ఇటువంటి సీక్రెట్ విషయాలలో రహస్యాన్ని పాటించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాసుపాలైందని పొలిటికల్ వర్గాలలో చర్చ సాగుతోంది.

కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఒకప్పుడు అహ్మద్ పటేల్ రాహుల్ గాంధీకి.. సోనియా గాంధీకి అత్యంత దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఆ పాత్రను కేసి వేణుగోపాల్ పోషిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేణుగోపాల్ తీవ్రంగా కృషి చేశారు. తద్వారా దక్షిణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన పట్టు ఉందని.. ప్రజల్లో ఆ నమ్మకం ఉందని మరోసారి నిరూపించారు కేసి వేణుగోపాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కి కేసి వేణుగోపాల్ అత్యంత దగ్గరి స్నేహితుడు.

Unique Temple Prasadam: లడ్డు, పులిహోర కాదు.. ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బును ఇస్తారు

Unique Temple Prasadam: శీర్షిక చదివిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కదా.. మనం ఏదైనా ఆలయానికి వెళ్తే… దైవదర్శనం పూర్తయిన తర్వాత అర్చకులు మనకు ప్రసాదంగా లడ్డు లేదా పులిహోర ఇస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆలయ ప్రాశస్త్యానికి అనుగుణంగా ప్రసాదాన్ని మనకు అందజేస్తారు. కానీ ఈ ఆలయం మాత్రం పూర్తి విభిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ దైవదర్శనం పూర్తయిన తర్వాత మనకు ప్రసాదంగా లడ్డు ఇవ్వరు. పులిహోర అంతకంటే ఇవ్వరు.

రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోడ్ గడ్ జిల్లాలో బానోడ బాలాజీ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా లడ్డూలు.. పులిహోర ఇవ్వరు. ఈ ఆలయంలో భక్తుల నుంచి వచ్చే కానుకల్లో కొంత భాగాన్ని భక్తులకే ప్రసాదం రూపంలో అందిస్తుంటారు. వీటిని భక్తులు భద్రపరచుకుంటే సిరిసంపదలు కలుగుతాయని.. వ్యాపారం , వ్యవసాయంలో లాభాలు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. తమ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు తాము పొందిన డబ్బుకు మరింత రెట్టింపు ఈ ఆలయానికి ఇస్తుంటారట.

ఈ ఆలయాన్ని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఉత్సవాలు, వేడుకల సమయంలో ఇక్కడ భక్తులు అధికంగా ఉంటారు. ఎంత స్థాయిలో భక్తులు వచ్చినప్పటికీ.. వారికి డబ్బు రూపంలో ప్రసాదాన్ని అందజేస్తూనే ఉంటారు. అందువల్లే ఈ క్షేత్రానికి విశిష్టమైన పేరు వచ్చింది.. తిరుపతి మాదిరిగానే ఇక్కడి బాలాజీకి ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి.. ఉత్సవాల సమయంలో ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.

డబ్బులు మాత్రమే కాకుండా.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పులిహోర.. లడ్డు ప్రసాదం ఇస్తారు. కాకపోతే అది డబ్బులతో కొనుగోలు చేయాలి.. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని విస్తరిస్తున్నారు.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. అందువల్లే నిర్ణీత సమయాలలోనే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.

Hanta virus symptoms: వణికిస్తున్న ‘హంటా’..లక్షణాల ఇవే.. WHO హెచ్చరిక

Hanta virus symptoms: అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక డచ్ నౌకలో హంటా వైరస్ (Hantavirus) వెలుగుచూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకల ద్వారా సోకుతుంది. కానీ ఈ నౌకలో వ్యాపిస్తున్నది అత్యంత ప్రమాదకరమైన ‘అండెస్ స్ట్రెయిన్’ కావడంతో వైద్య నిపుణులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

హంటా వైరస్ ప్రధానంగా ఇన్ఫెక్ట్ అయిన ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అయితే ఈ డచ్ నౌకలో కలకలం రేపుతున్న ‘అండెస్’ రకం వైరస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి నేరుగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నౌక వంటి పరిమిత ప్రదేశంలో ప్రయాణికులు దగ్గరగా ఉండటం వల్ల ఇది వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

లక్షణాలు:
ఈ వైరస్ సోకిన వారిలో ప్రాథమికంగా అలసట, తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ బాధితుల్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో నీరు చేరడం (Pulmonary Edema) వల్ల రోగి పరిస్థితి విషమిస్తుంది. వైద్య గణాంకాల ప్రకారం, ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. అంటే దీని మరణాల రేటు సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉంటుంది.

WHO హెచ్చరిక :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రయాణాలు, నౌకల ద్వారా ఈ కేసులు ఇతర దేశాలకు పాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని, నౌకలోని ఇతర ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం అనేక దేశాలు తమ ఓడరేవుల వద్ద నిఘాను పెంచాయి. ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే వారిని స్క్రీనింగ్ చేస్తున్నాయి.

నివారణ మార్గాలేమిటి?
ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి నివారణే ఏకైక మార్గం. ఎలుకలు తిరిగే ప్రదేశాలకు దూరంగా ఉండటం. పరిశుభ్రతను పాటించడం, మాస్కులు ధరించడం. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. నౌకలో ఉన్న ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందించేందుకు నెదర్లాండ్స్ , ఇతర యూరోపియన్ దేశాల వైద్య బృందాలు రంగంలోకి దిగాయి.

History of Honeymoon Tradition: హనీమూన్ సంప్రదాయం ఎలా మొదలైంది?

History of Honeymoon Tradition: ఫోన్లు, సోషల్ మీడియా, వీడియో కాల్స్ లేని కాలంలో పెళ్లిళ్లు ఎక్కువగా కుటుంబాల నిర్ణయాలతో జరిగేవి. పెళ్లికి ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకునే అవకాశం కూడా చాలా అరుదుగా ఉండేది. చాలాసార్లు పెళ్లిరోజు మండపంలోనే వారు తొలిసారి కలుసుకునేవారు. అందుకే పెళ్లి అనంతరం కొత్త దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ప్రత్యేక సమయాన్ని ఇవ్వాలని పెద్దలు భావించారు. ఈ ఆలోచనతోనే పుట్టింది హనీమూన్. అసలు హనీమూన్ అని ఎందుక పేరు పెట్టారు? దీని అర్థం ఏంటీ?

హనీమూన్ అనే పదం రెండు పదాల కలయిక. హనీ అంటే తేనె, మూన్ అంటే నెల. పురాతన యూరోపియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి తర్వాత మొదటి నెలను ఎంతో మధురంగా, ఆనందంగా గడపాలని భావించేవారు. ఆ సమయంలో కొత్త దంపతులకు తేనెతో తయారుచేసిన పానీయాలు ఇవ్వడం కూడా ఉండేది. ఆ మధురమైన కాలాన్ని సూచించేందుకే హనీమూన్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.‘హనీమూన్’ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సంస్కృతి ఎప్పడు ప్రారంభమైంది..

హనీమూన్ సంస్కృతి తొలుత ఐరోపా దేశాల్లో ప్రారంభమైందని చరిత్రపు పరిశీలిస్తే తెలుస్తోంది. 19వ శతాబ్దంలో ధనిక కుటుంబాలకు చెందిన దంపతులు పెళ్లి తర్వాత ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు. ఇది కేవలం విహారయాత్ర మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులను కలపడం, కొత్త జీవితాన్ని ప్రశాంతంగా ప్రారంభించడం కోసం కూడా ఉపయోగపడేది. తర్వాత ఈ పద్ధతి మెల్లగా మధ్యతరగతి కుటుంబాల్లోకి కూడా విస్తరించింది.

పెళ్లి వేడుకల్లో ఉండే హడావిడి, బంధువుల సందడి మధ్య కొత్త దంపతులకు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం చాలా తక్కువగా దొరుకుతుంది. హనీమూన్ ఆ లోటును తీర్చే అవకాశంగా మారింది. ఈ సమయంలో వారు తమ అభిరుచులు, ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలు గురించి మాట్లాడుకుంటారు. దీనివల్ల పరస్పర అవగాహన పెరిగి, దాంపత్య జీవితానికి బలమైన పునాది ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

హనీమూన్ కేవలం టూరిజం కాదు. అది భావోద్వేగాలకు దగ్గర చేసే ప్రయాణం. కొత్త ప్రదేశాలు చూడటం, కలిసి సమయం గడపడం వల్ల దంపతుల మధ్య స్నేహం, ప్రేమ, నమ్మకం మరింత బలపడుతుంది. కుటుంబ బాధ్యతలు ప్రారంభమయ్యే ముందు కలిసి గడిపే ఈ సమయం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది.

భారతదేశంలో పూర్వకాలంలో హనీమూన్ అనే పదం అంతగా వినిపించేది కాదు. కానీ కాలక్రమేణా పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఇది విస్తరించింది. ప్రస్తుతం పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం దాదాపు ప్రతి కుటుంబంలో సాధారణంగా మారింది. కేరళ, గోవా, మనాలి, ఊటీ, కాశ్మీర్ వంటి ప్రదేశాలు కొత్త దంపతుల ప్రియమైన గమ్యస్థానాలుగా నిలిచాయి.

ఇప్పటి యువత పెళ్లికి ముందే మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నా, హనీమూన్ ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. బిజీ జీవితంలో ఒత్తిడులను దూరం పెట్టి, కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అందుకే హనీమూన్ ఇప్పటికీ దాంపత్య జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగంగా కొనసాగుతోంది.

BJP Tamil Nadu political strategy: బిజెపి ఆలోచనలో తప్పేముంది.. తమిళనాడు మరో మహారాష్ట్ర అయితే.. సీఎం అయ్యేది అతడే..

BJP Tamil Nadu political strategy: రాజకీయాలలో నీతి అనేది ఉండదు. ధర్మం అనేది అంతకంటే ఉండదు. అధికారాన్ని దక్కించుకున్నాదామా.. పరిపాలన సాగించామా.. అనేదే ముఖ్యం. అందువల్లే రాజకీయాలలో అధికారం దక్కుతుందనేసరికి బద్ధ శత్రువుల లాంటి పార్టీలు కూడా ఏకమై పోతాయి. అప్పటిదాకా తిట్టుకున్న వాళ్లంతా కలిసిపోతారు. ఐక్యత రాగాలు ఆలపిస్తారు.

మనదేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఇటువంటి రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో అత్యంత కీలకమైన తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఈ తరహా రాజకీయాలకు బీజం పడుతోంది. మనదేశంలో మహారాష్ట్రలో శివసేన ను రెండుగా చీల్చి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటిదే తమిళనాడు రాష్ట్రంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ పార్టీలో కీలక నాయకుడైన వి ఎస్ బాబు చుట్టూ తమిళనాడు రాజకీయం తిరుగుతోంది.

మెజారిటీ మీడియా దీనిని పట్టించుకోకపోయినప్పటికీ.. కొంతమంది విశ్లేషకులు మాత్రం వీకే బాబు చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరుగుతాయని చెబుతున్నారు. వీకే బాబు స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రిని ఓడించారు. ఆయన రాజకీయ నేపథ్యం కూడా విజయ్ కంటే చాలా బలమైనది. తన నియోజకవర్గం లో విజయ్ ప్రచారానికి రాకపోయినప్పటికీ.. బాబు తన చాకచక్యంతో విజయం సాధించారు..

ఒకవేళ ఈ సమయానికి విజయ్ ప్రభుత్వం గనుక ఏర్పడితే బాబు క్యాబినెట్ మినిస్టర్ గా ఉండేవారు. కానీ ఒక ముఖ్యమంత్రిని ఓడించిన ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ఎందుకు ఉండాలి.. ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనేది ఇక్కడ చర్చ. ఒకవేళ బిజెపి గనుక బాబుతో కలిసి సరైన రాజకీయ చదరంగం గనుక ఆడితే అప్పుడు తమిళనాడులో సరికొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎలాగూ ఏఐడీఎంకె బిజెపిలో ఉంది కాబట్టి.. గవర్నర్ కూడా వాళ్ళ వ్యక్తి కాబట్టి కచ్చితంగా వీకే బాబు కేంద్రంగా తమిళనాడు రాజకీయాలు నడిచే ఆస్కారం ఉంది.

ఒకవేళ బాబు గనుక ఏకనాథ్ షిండే లాగా మారిపోతే.. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవడానికి టీవీకే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది బాబుకు అండగా ఉండాలి. 50 మంది ఎమ్మెల్యేలను బాబు గనుక తన వైపు తిప్పుకుంటే.. అప్పటికి పరిస్థితి మారిపోతుంది. డీఎంకే నేతలను వాడుకొని.. 30 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే.. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు తమిళ రాజకీయాలు మరోవైపుగా మారిపోతాయి. అంతేకాదు ఎమ్మెల్యేల సంఖ్య కూడా 128 చేరుకుంటుంది.

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇది చాలా ఎక్కువ. గవర్నర్ రెండుసార్లు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళినప్పుడు తిరస్కరించారు. దాని వెనుక ఎన్డీఏ వ్యూహం దాగిపోయినట్టు కనిపిస్తోంది. విజయ్ ప్రజల్లో బలాన్ని సాధించినప్పటికీ.. సరైన స్థాయిలో రాజకీయాలు చేయలేకపోతున్నాడు. అందువల్లే ఎన్డీఏ మధ్యలో ప్రవేశించి.. బాబు ద్వారా ఇలాంటి ప్లాన్లు గనుక రూపొందిస్తే.. అప్పుడు రాజకీయాలు మరో విధంగా మారిపోతాయి..

అమిత్ షా ఇటువంటి రాజకీయాలను కొనసాగించడంలో అపర చాణక్యుడు. అతడు కనుక తన బుర్రకు మరోసారి పద్ధతిని పెడితే దక్కకుండా పోయిన తమిళనాడు వారి చేతుల్లోకి వెళుతుంది. ఆ తర్వాత ఎలాంటి కథ నడపాలో మోడీ షాకు తెలుసు.

Indian history hidden truths: ఎవరు చొరబాటుదారులు.. చరిత్రలో దాగిన సత్యాలు ఇవీ!

Indian history hidden truths: భారత రాజకీయాల్లో ’చొరబాటుదారులు’ పదం ఒక ఆయుధంగా మారింది. హిందుత్వవాదులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, వీరిని విదేశీయులుగా చిత్రీకరిస్తూ భయం పొందిస్తున్నారు. ఈ వాదన చరిత్రను ఏకపక్షంగా వక్రీకరిస్తూ, సమాజంలో విభజనను తీవ్రతరం చేస్తోందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగినవారు కూడా చొరబాటుదారుల జాబితాలోకే వస్తున్నారు. ఈ తరుణంలో అసలు చొరబాటుదారులు ఎవరు అన్న ప్రశ్నలు పదే పదే తలెత్తుతున్నాయి.

రాజకీయ ఆయుధంగా చరిత్ర
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ’సంపద పంచడం, మంగళసూత్రాలు దోచడం’ అంటూ ముస్లింలపై దాడి చేస్తారు. అమిత్‌ షా వంటి నాయకులు జనాభా పెరుగుదలను చొరబాటుకు ఆపాదిస్తూ, దేశభద్రతను ప్రశ్నిస్తున్నారు. ఇది చారిత్రక వాస్తవాలను విస్మరించి, ద్వేషాన్ని పెంచుతుంది.

మొదటి ఆక్రమణ..
క్రీ.పూ. 1500లో మధ్య ఆసియా స్టెప్పీల నుంచి ఆర్య యోధులు భారతానికి వచ్చి, స్థానిక సింధు నాగరికతపై ఆధిపత్యం సాధించారు. జెనెటిక్‌ అధ్యయనాలు, హాప్లోగ్రూప్‌ను బ్రాహ్మణుల్లో 72 శాతం వరకు, దళితుల్లో 16 శాతం, గిరిజనుల్లో 8 శాతం చూపిస్తాయి. వీరే వర్ణవ్యవస్థను రూపొందించి, సమాజాన్ని శాశ్వత విభజనలకు గురిచేశారు.

రెండవ తరం..
క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 100 వరకు యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు (కనిష్కుడు) ప్రవేశించారు. మనుస్మృతి వీరిని ’పతిత క్షత్రియులు’గా పేర్కొన్నప్పటికీ, గాంధార కళ, బౌద్ధ ప్రచారంతో వీరు స్థానిక కులాల్లో (రాజపుత్రులు) కలిసిపోయారు. ఇది భారత సంస్కృతి వైవిధ్యానికి మూలం.

మూడవ దశలో ఇస్లామిక్‌ సామ్రాజ్యాలు..
12వ శతాబ్దం నుంచి ఐబక్, ఖిల్జీలు, మొఘలులు (బాబర్‌ 1526) ఉత్తర భారతాన్ని ఏకీకృతం చేశారు. ఔరంగజేబు అశోక సామ్రాజ్యంతో సమాన విస్తీర్ణాన్ని చేర్చాడు. అక్బర్‌ దీన్‌–ఇ–ఇలాహీతో మతసమన్వయాన్ని ప్రోత్సహించాడు. 1857 తిరుగుబాటుతో ముఘల్‌ పతనం సంభవించింది. ఈరోజు ముస్లింలు 700 సంవత్సరాలుగా భారతీయులే. చాలామంది దళిత మూలాల నుంచి మారినవారు.

ఎవరు చొరబాటు దారులు?
ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు. ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుంచి వచ్చిన ముస్లిములతోపాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది. నేటి రాజకీయ సందర్భంలో, ‘‘చొరబాటుదారులు’’ అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.

‘‘చొరబాటుదారులు’’ అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.

TMC leaders controversy: చింత చచ్చినా బలుపు చావలే.. బెంగాల్ లో మారని టీఎంసీ నేతల తీరు!

TMC leaders controversy: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీని బీజేపీ చిత్తుగా ఓడించింది. అయినా తాము ఓడిపోలేదని, బిజెపి ఓట్ చోరీకి పాల్పడిందని రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రకటించారు. కానీ గవర్నర్ మమత ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మమత వెనజి తరహాలోనే ఆ పార్టీ కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయిన అహంకారం తగ్గడం లేదు. గతంలో చేసినట్లుగానే బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. తాజాగా మే 5న బిజెపి కార్యకర్త మధు మండల్ ను టీఎంసీ మండల అధ్యక్షుడు కమల్ మండల్ తన అనుచరులతో కలిసి దాడి చేసి చంపేశాడు. ఇది టీఎంసీ పతనాన్ని, రాష్ట్ర రాజకీయాల్లో హింసా సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.

ఎన్నికల నేపథ్యం
ఏప్రిల్ 23, 29న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లతో భారీ విజయం సాధించి, టీఎంసీ 15 సంవత్సరాల పాలనను అంతం చేసింది. టిఎంసీ 81 సీట్లకు పరిమితమైంది. అయితే బీజేపీ పోల్ మానిప్యులేషన్ చేసిందని టీఎంసీ ఆరోపణలు చేసింది.

మధు మండల్ హత్య..
రాజర్‌హట్-న్యూ టౌన్‌లో బీజేపీ అభ్యర్థి పియూష్ కనోడియా 309 మార్జిన్‌తో గెలిచిన విక్టరీ ర్యాలీలో మధు మండల్‌పై టీఎంసీ మండల నేత కమల్ మండల్, అతని అనుచరులు దాడి చేసి చంపారు. శవం మట్టిలో కనుగొన్నారు. కుటుంబ సభ్యులు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. మే 6న పోలీసులు కుల్పబుల్ హోమైసైడ్ కేసులో కమల్ తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.

భారీగా హింస..
ఈ దాడి నేపథ్యంలో
మొత్తం నలుగురు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. టీఎంసీ కార్యాలయాలు అసన్సోల్, కూచ్‌బెహార్, కోల్‌కతాలో వాండలైజ్. బీజేపీ కార్యకర్తలపై మండల-జిల్లా టీ ఎంసీ నేతల దాడులు. రెండు పక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి.

టీఎంసీ పతనం రాజకీయ హింసా సంస్కృతికి ముగింపు పెట్టాలి. 15 సంవత్సరాల పాలనలో బీజేపీపై దాడులు సాధారణం. ఇప్పుడు ఓటమి కోపంతో దాడులు కొనసాగుతున్నాయి. ఇది డెమాక్రసీకి ముప్పు, రాష్ట్రంలో భయాంధరణకు దారి తీస్తుంది. బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, న్యాయం అందించాలి. లేకపోతే, బెంగాల్ రాజకీయాలు హింసా చక్రంలో చిక్కుకుపోతాయి.

Sandeep Reddy Vanga car stopped: సందీప్ రెడ్డి వంగ కారుని ఆపేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేస్తారని అసలు ఊహించలేదు..

Sandeep Reddy Vanga car stopped: ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నటువంటి పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). రెబల్ స్టార్ ప్రభాస్(Rebal Star Prabhas) , సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రారంభ దశ నుండే అంచనాలు వేరే లెవెల్ లో మొదలయ్యాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ , న్యూ ఇయర్ కి టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా కొన్ని రోజుల తర్వాత విలన్ వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా , దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేస్తే , ప్రభాస్ కేవలం 4 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాడు. మూడవ షెడ్యూల్ డెహ్రాడూన్ లో త్వరలోనే ప్రారంభం కానుంది.

అయితే రీసెంట్ గా ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగ కి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆయన కారులో వెళ్తున్న సమయంలో అభిమానులు గుర్తించి ఆపేయడం హాట్ టాపిక్ గా మారింది. ‘స్పిరిట్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారు?, ఒక పోస్టర్ లేదా గ్లింప్స్ వీడియో , ఎదో ఒకటి విడుదల చేయొచ్చు కదా, మీ యానిమల్ సినిమా అంటే మా అందరికీ చాలా ఇష్టం, అంతకు మించి మాకు స్పిరిట్ చిత్రం ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి మేమంతా ప్రభాస్ అభిమానులమే’ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సందీప్ వంగ సమాధానం చెప్తూ త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ ఇస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమిరి నటించబోతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

కానీ ఇప్పుడు 2027 డిసెంబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ కార్యక్రమాలు అప్పటికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదని , ప్రభాస్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తాన్ని ‘ఫౌజీ’ చిత్రాన్ని పూర్తి చేయడం పైనే పెట్టాడు.ఈ సినిమా పూర్తి అవ్వడానికి బాగా సమయం పెట్టె అవకాశం ఉందట. దసరా కి విడుదల చేద్దామని అనుకున్నారు , అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మరో పక్క ప్రభాస్ ‘కల్కి 2’ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొంటూ బిజీ ఉండడం తో ‘స్పిరిట్’ ఇప్పట్లో రీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు.

Peddi advance bookings overseas: 5 గంటల్లో 1 లక్ష డాలర్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టించిన ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్..

Peddi advance bookings overseas: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో కాసేపటి క్రితమే మొదలు పెట్టారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే , ‘పెద్ది’ చిత్రం ఓపెనింగ్స్ లో పెద్ద సునామీ సృష్టించబోతుందని అర్థం అవుతోంది. 898 షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా , కేవలం 5 గంటల్లోనే 1 లక్షకు పైగా డాలర్లు రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇండియా లోనే ఫాస్టెస్ట్ లక్ష డాలర్ల గ్రాస్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ‘పెద్ది’. గతం లో ఈ రికార్డు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం ఖాతాలో ఉండేది.

ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన మొదటి రోజు 87 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఇది ఆల్ టైం రికార్డు. కానీ ఓజీ చిత్రానికి కేవలం 56 షోస్ మాత్రమే ఓపెన్ చేశారు. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 898 షోస్ తో ఓపెన్ చేసారు. అందుకే ఆ రేంజ్ తేడా వచ్చిందని అంటున్నారు. కానీ 24 గంటల్లో ‘ఓజీ’ చిత్రానికి 2 లక్షల 67 వేల డాలర్లు , 600 షోస్ కి గానూ నమోదైంది. ఈ రికార్డుని పెద్ది అందుకోవడం చాలా కష్టమని, కేవలం 2 లక్షల డాలర్ల మార్కుని చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ ఈ చిత్రానికి ఉన్నటువంటి ఊపుని చూస్తుంటే కచ్చితంగా 2 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్స్ నుండి రాబడుతుందని అంటున్నారు. అంతకు మించి కూడా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని , రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతానికి నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ విషయం లో ‘కల్కి’ చిత్రం నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ‘#RRR’ చిత్రం 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ తో రెండవ స్థానం లో నిలబడగా, 3.1 మిలియన్ డాలర్లతో ‘ఓజీ’ చిత్రం మూడవ స్థానం లో కొనసాగుతోంది. కేవలం తెలుగు వెర్షన్ తీసుకుంటే , ఓజీ నే టాప్ 2 స్థానంలో ఉందని అనుకోవచ్చు. ప్రస్తుతానికి పెద్ది కి ఉన్న ఊపుని చూస్తుంటే 2.8 మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి రాబట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Janasena sacrifice for state: విజయ్ అధికారం కోసం.. పవన్ రాష్ట్రం కోసం.. ఇచ్చి పడేసిన జనసేన

Janasena sacrifice for state: తమిళనాడు ఎన్నికల్లో సినిమా హీరో విజయ్ సత్తా చాటారు. తొలి ప్రయత్నం లోనే రెండు ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి 108 స్థానాల్లో విజయం సాధించారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా తన టీవీకేను నిలిపారు. సీఎం పీఠానికి కూత వేటు దూరంలో ఉండిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తగినంత మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే నిమిత్తం విజయ్ ను ఆహ్వానించలేదు. అయితే తమిళనాడు రాజకీయాలను ఏపీతో ఆపాదిస్తున్నారు కొందరు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎన్నికల ప్రచారంలో విజయ్ వాడారని.. వారిద్దరూ ప్రాణ స్నేహితులు అంటూ చెబుతున్నారు. తమిళనాడు విజయ్ విజయంతో ఎలివేషన్లు ఇచ్చుకునే పనిలో ఉన్నారు. పనిలో పనిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

విజయ్ గ్రేట్ అన్నట్టు..
దేశంలో ఏ మూల ఏది జరిగిన పవన్ కళ్యాణ్ ను ఆపాదించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విద్య. అందులో భాగంగా పవన్ కంటే విజయ్ గ్రేట్ అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సింగిల్ గా నిలబడి విజయ్ జగన్ మాదిరిగా తమిళనాడులో ప్రతాపం చూపారని ప్రచారం మొదలుపెట్టారు. మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఎక్కడ.. సింగిల్ గానే పోటీ చేసి రెండు పార్టీలను వెనక్కి నెట్టిన విజయ్ ఎక్కడ అంటూ పోలిక పెట్టడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయిన జనసేన సైనికులు సంయమనం పాటించారు. చాలా కూల్ గా ఉన్నారు.

విపక్షాలతో కలవడంతో..
అయితే మెజారిటీకి కూత వేటు దూరంలో ఉన్న విజయ్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో విజయ్ బలం 113 కు చేరుకుంది. అయినా ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు కావాలి. వారికోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసైనికులు స్పందించారు. విజయ్ పొత్తు పెట్టుకోరు.. కానీ అధికారం కోసం మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు. ఆయన అధికారం కోసం పొత్తు పెట్టుకుంటే.. పవన్ ఈ రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నారు అంటూ బదులు ఇవ్వడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పవన్ పొత్తు పెట్టుకున్నారు అంటూ గట్టిగానే వాదించడం మొదలుపెట్టారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తోక ముడిచింది. పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.

Tamil Nadu leader comments on Chandrababu: చంద్రబాబు, లోకేష్ పై తమిళనాడు నేత కామెంట్స్.. వైరల్!

Tamil Nadu leader comments on Chandrababu: తమిళనాడు రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడి విజయ్ గెలుపులో ఇక్కడి జగన్ ఉన్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వారిద్దరూ ప్రాణమిత్రులని.. అందుకే విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను వాడుకున్నారని.. విజయ్ గెలుపు వెనుక జగన్ ఉన్నారని భారీ స్థాయిలో ఎలివేషన్లు ఇచ్చి ప్రచారం చేసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం దీనిని తప్పుపడుతున్నారు. అంత బలం ఉంటే ఏపీలోనే ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యాబలం తెచ్చుకో లేకపోయారు కదా అని ఎద్దేవా చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో టీవీ కే ఎమ్మెల్యే ఒకరు బాహటంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పు పట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో డీఎంకే ఓటమిని ఏపీతో పోల్చుతూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.

పిఎంకె అధ్యక్షుడి ప్రశంస..
తమిళనాడు కు చెందిన పిఎంకె అధ్యక్షుడు అన్బూమణి ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమిళనాడులో డిఎంకె ఓటమిపై విశ్లేషించారు. తమిళనాడు సీఎం గా స్టాలిన్, డిప్యూటీ సీఎం గా ఉదయనిది స్టాలిన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే వారి హయాంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేశారు. పరిశ్రమలను తేవడంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ తండ్రీ కొడుకులిద్దరూ ఫెయిల్ అయ్యారని రామదాసు విమర్శించారు. అదే సమయంలో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. పారదర్శకమైన పాలన అందిస్తున్నారని.. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేస్తూ సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పారదర్శకమైన పాలనకు కితాబు…
ఒకవైపు తమిళనాడులో విజయ్ గెలుపు లో భాగస్వామ్యం కోరుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం సంబంధమే లేని పార్టీ విజయాన్ని ఇక్కడ సంబరాల రూపంలో జరుపుకుంటుంది. అదే సమయంలో అక్కడి రాజకీయ పార్టీ నేత.. ఇక్కడి ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేష్ చేసిన కృషిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్బూమణి రామదాస్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TVK MLAs ready to Resign: విజయ్ తో పాటు రాజీనామాకు సిద్దమైన TVK ఎమ్మెల్యేలు.. గందరగోళంగా మారిన తమిళనాడు..

TVK MLAs ready to Resign: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కి సీఎం కుర్చీ అడుగు దూరం లో ఉంది, కానీ ఎట్టిపరిస్థితిలోనూ ఆ సీఎం కుర్చీని అందకుండా , ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గవర్నర్ ఆడుతున్న చీప్ రాజకీయాలపై దేశం లో ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులూ కూడా పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అసెంబ్లీ లో నిరూపించుకుంటారని, గవర్నర్ ఇంట్లో నిరూపించుకోరని , అత్యధిక మెజారిటీ వచ్చిన టీవీకే కి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, గవర్నర్ పూర్తిగా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్. అంతే కాదు తమిళనాడు రాజ్ భవన్ వద్ద టీవీకే పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరోపక్క టీవీకే పార్టీ తో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ తీరుని నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే, మన ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ, వైసీపీ పార్టీలు ఎలాంటి భద్ర శత్రువులు అనేది అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కలలో అయినా ఊహిస్తామా?, తమిళనాడు లో కూడా DMK, AIDMK పార్టీలు అలాంటివి అన్నమాట. నింగి , నేల ఎలా అయితే కలవవో, ఈ రెండు పార్టీలు కూడా అలా కలవవు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ దెబ్బకు వీళ్లిద్దరు కలుస్తున్నారు. AIDMK పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న పళనిస్వామి నేడు గవర్నర్ ని కలవబోతున్నాడు . DMK పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియా లో, ఎలక్ట్రానిక్ మీడియా లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, రాజ్యాంగానికి విరుద్ధమైన తుచ్ఛమైన కార్యాలకు మేము పాల్పడమని, ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నామని, విజయ్ ప్రభుత్వాన్ని స్వాగిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఇవన్నీ పైపై మాటలే.

DMK పార్టీ అధికారం లో భాగం అవ్వకుండా , AIDMK తో అంతర్గతంగా చర్చలు జరిపి , తన పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యేలు రహస్యంగా పళనిస్వామి కి మద్దతు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరాడని తమిళనాడు మీడియా లో వార్తలు వస్తున్నాయంటే , అందుకు కచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటు చేయడం కోసమే అని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే , విజయ్ తో పాటు, టీవీకే పార్టీ కి సంబంధించిన 106 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధం గా ఉన్నారట. అలా చేస్తే రీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక రీ ఎలక్షన్స్ జరిగితే ఈసారి విజయ్ 180 కి పైగా స్థానాల్లో గెలుస్తాడని, DMK , AIDMK పార్టీలు శాశ్వతంగా కనుమరుగు అయిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Cristiano Ronaldo fitness secret: రోనాల్డో ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. అతడు ఏం తింటాడో తెలుసా..

0

Cristiano Ronaldo fitness secret: పోర్చుగీస్ ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆధునిక ఫుట్ బాల్ క్రీడలో ఇతని మించిన ఆటగాడు మరొకరు లేరు. చూస్తుండగానే గోల్స్ చేస్తాడు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ మీద దారుణంగా దాడి చేస్తాడు. బంతిని అత్యంత చాకచక్యంగా గోల్ పోస్ట్ లోకి పంపిస్తాడు. అందువల్ల ఇతడిని గోల్ కింగ్ అని పిలుస్తుంటారు.

ఆట తీరుతో మాత్రమే కాదు.. శరీర సామర్థ్యం విషయంలో కూడా రోనాల్డో సరికొత్తగా ఉంటాడు. ఎవరైనా సరే వయసు పైబడి పోతుంటే… కచ్చితంగా దానికి సంబంధించిన మార్పులు కనిపిస్తుంటాయి.. కానీ రోనాల్డో మాత్రం అలా కాదు. తాను అత్యంత కఠినమైన డైట్ కొనసాగిస్తూ ఉంటాడు. పొరపాటున కూడా డైట్ స్కిప్ చేయడు. అతని డైట్ చూసుకోవడానికి ప్రఖ్యాతమైన పోషకాహార నిపుణులు ఉంటారు. వారు నిత్యం అతడు తింటున్న ఆహారాన్ని కనిపెట్టుకొని ఉంటారు. అందువల్లే రోనాల్డో ఆ స్థాయిలో ఉంటాడు.

రోనాల్డో ఏం తింటాడు.. ఎలా ఉంటాడు అనే విషయాలు మొన్నటి వరకు బయటకు రాలేదు. అయితే అతడికి చెఫ్ గా వ్యవహరించిన ఒక వ్యక్తి ఇటీవల ఆ విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం అతడు రోనాల్డ్ దగ్గర పని చేయడం లేదు. అతను చెప్పిన వివరాల ఆధారంగా రోనాల్డో ఏం తింటాడో.. ఎలాంటి కసరతులు చేస్తాడో అందరికీ తెలిసిపోయింది.

ఉదయం లేవగానే రోనాల్డో జిమ్ చేస్తాడు. ఆ తర్వాత తన శరీరాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు పరుగు పెడతాడు. ఆ తర్వాత పచ్చి అవకాడో ను తింటాడు. దాంతోపాటు ఉడకబెట్టిన గుడ్లను తినేస్తాడు. కేవలం ఎగ్ వైట్ మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఈ రెండు పూర్తి అయిన తర్వాత చక్కెర కలపని.. కొవ్వ తీసిన పాలతో తయారుచేసిన కాఫీ తాగుతాడు. మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో కచ్చితంగా కూరగాయలు ఉండేలా చూసుకుంటాడు. అందులోనే గ్రిల్ చేసిన ఫిష్.. చికెన్ ఉంటాయి. అవన్నీ కూడా క్యాలరీల ప్రకారమే అతడు తింటాడు. ఒక రకంగా చెప్పాలంటే కొలత వేసినట్టు మాత్రమే తింటాడు.

అతడి డైట్ లో మైదాపిండికి అవకాశం లేదు. కనీసం బియ్యం, గోధుమపిండి కూడా ఉండదు. పాస్తా అసలు తినడు. చివరికి పిజ్జా, బర్గర్లను కూడా ఇష్టపడడు. బ్రెడ్ కూడా ముట్టుకోడు. రాత్రిపూట అతని డైట్ చాలా సింపుల్ గా ఉంటుంది. అధిక మోతాదులో కూరగాయలు.. చికెన్.. ఫిష్ తింటాడు. అవన్నీ కూడా గ్రిల్ అయితేనే తింటాడు. తాగే నీటి విషయంలో కూడా అతడు జాగ్రత్తలు తీసుకుంటాడు. మ్యాచ్ లు ఉంటే తప్ప రాత్రిపూట మెలకువతో ఉండడు. సాధ్యమైనంతవరకు మధ్యానికి దూరంగా ఉంటాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో శరీర సామర్థ్యంతో కనిపిస్తుంటాడు. ఆధునిక కాలంలో వివిధ క్రీడలు ఆడే క్రీడాకారుల్లో.. శరీర సామర్థ్యాన్ని సమర్థవంతంగా కొనసాగించే ఆటగాళ్లలో రోనాల్డో ముందు వరుసలో ఉంటాడు. ఇండియాకు చెందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలానే శరీర సామర్థ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.

 

Godari Gattupaina Movie Review: ‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Godari Gattupaina Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తుంటే కుర్ర హీరోలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమై వరుస సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘మేము ఫేమస్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత ‘గోదారి గట్టు పైన’ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఒక కుర్రాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు…ఇక రోజంతా ఆటో నడపడం, సాయంత్రం పూట తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం ఇదే లైఫ్ స్టైల్ లో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన చెల్లెలి తో పాటు బిటెక్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడుతాడు…ఇక మాయ వల్ల నాన్న శ్యామ్ బాబు (జగపతి బాబు) సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. ఎలాగైనా సరే తన కూతురు చదువు అయిపోయిన తరువాత ఒక మంచి జాబ్ ఉన్న వ్యక్తికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలని తను హ్యాపీ గా ఉండాలని కోరుకుంటాడు. ఇక ఇదే టైం లో తన కూతురు రాజు అనే ఆటో డ్రైవర్ ను ప్రేమించిదని తెలుసుకున్న శ్యామ్ బాబు ఏం చేశాడు? రాజు తను ప్రేమించిన మాయ ను పెళ్లి చేసుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

డైరెక్టర్ సుభాష్ చంద్ర తన మొదటి సినిమా కోసం రొటీన్ స్టోరీని ఎంచుకున్నాడనే చెప్పాలి. అయితే సినిమాలో కథాంశం ఇంతకు ముందు మనం చూసిందే అయినప్పటి ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా నడిపించాడా లేదా అంటే అక్కడక్కడ తడబడ్డాడనే చెప్పాలి. ఫస్టాప్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు, పాటలు మినహాయిస్తే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఎంచుకున్న కథనే రొటీన్ గా ఉండటం వల్ల అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి పెద్దగా కొత్తదనం కనిపించలేదు…

ఇక సినిమా చివరిలో వచ్చే ఒక 15 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. అలాగే రాజు నడుపుతున్న ఆటోకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ఈ సన్నివేశాలతోనే సినిమా ఆడుతుందా అంటే కష్టమనే చెప్పాలి. కారణం సినిమాలో కోర్ ఎలిమెంట్ అనేది పైవిద్యంగా ఉండాలి. అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా సినిమాకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి… అయితే ఈ మూవీ కథ రొటీన్ అయినప్పటికి ఇంకొంచెం వైవిధ్యాన్ని చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు పర్లేదు బాగానే వెళుతుంది అన్నట్టుగా అనిపించిన కూడా సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు సినిమా బావుందా? బాలేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ప్రేక్షకుడు ఉంటాడు. ఎందుకంటే మనసుని హత్తుకునే కొన్ని సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నప్పటికి ఓవరాల్ గా సినిమాను నిలబెట్టేది పది నిమిషాల సీక్వెన్స్ అయితే కాదు.

కాబట్టి ప్రతి సీన్ ను అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడే ఒక సినిమా యూనినమాస్ హిట్ సాధిస్తుంది. అంతేతప్ప ఒకటి రెండు సీన్స్ బాగున్నప్పుడు ప్రేక్షకుడు ఆ సినిమాని రిసీవ్ చేసుకోకపోవచ్చు… ఇక సుదర్శన్ ఈ సినిమాలో తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక సినిమా ప్రమోషన్స్ కి కూడా భారీగానే చేశారు. అయినప్పటికి సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. కానీ తను పూర్తిస్థాయిలో దానిని వాడుకోవడంలో మాత్రం సినిమా యూనిట్ కొంతవరకు తడబడ్డారనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

సుమంత్ ప్రభాస్ ఆటో డ్రైవర్స్ ఎలాగైతే ఉంటారో వాళ్ల ఆటిట్యూడ్ ను చాలా బాగా పెర్ఫ్యూమ్ చేశాడు. ఇంతకీ ముందు చేసిన మేము ఫేమస్ సినిమాలో ఎలాగైతే నటించి ప్రేక్షకులను మెప్పించాడో ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నం చేశాడు. ఆయన కనిపించిన ప్రతి సీను కూడా ఏదో ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఆటో రాజు అనే క్యారెక్టర్ కి తను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు…మాయ పాత్రలో నిధి ప్రదీప్ చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె పాత్రకి ఏదైతే కావాలో దాన్ని సెటిల్డ్ గా నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక జగపతిబాబు పోషించిన శ్యాంబాబు పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. ఆయన పాత్రలోని వేరియేషన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సుమంత్ ప్రభాస్ ఒక ప్రేమికుడిగా ఆలోచిస్తే శ్యాం బాబు మాత్రం ఒక అమ్మాయి తండ్రి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. కూతురికి ఒక మంచి అబ్బాయి ని ఇచ్చి పెళ్ళి చేయడం అనేది తండ్రి గా ఒక పెద్ద బాధ్యతలా ఫీలయ్యే పాత్రలో జీవించేశాడనే చెప్పాలి… ఇక జగపతి బాబు భార్య పాత్రలో నటించిన లైలా కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్నప్పటికి ఆమె ఆ పాత్రను అటు ఇటు కాకుండా ఎండ్ చేశారు. ఆమె ఏదో ఒక ఎమోషన్ ని బలంగా చెబుతుంది అని ప్రతి ప్రేక్షకుడు ఆశిస్తాడు.

కానీ అనుకోకుండా ఆ పాత్రను మధ్యలోనే కట్ చేయడం వల్ల ఆమె ఏం చేసింది అనే డౌట్ అయితే అందరికి కలుగుతుంది. కానీ ఆమె ఉన్నంత సేపు స్క్రీన్ మీద చాలా బాగా అలరించిందనే చెప్పాలి పాత్రకి కంక్లూజన్ ఇవ్వడంలో దర్శకుడు కొంతవరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి… ఇక సుదర్శన్ తన కామెడీతో సినిమాను నిలబెట్టాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నింటితో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెరుగైన కామెడీ పండించాడనే చెప్పాలి… మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ అందించిన సాంగ్స్ బాగున్నాయి… బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే అనిపించినప్పటికి, ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ సైతం చాలా చక్కటి విజువల్స్ ను అందించాడు. గోదారి అందాలను చాలా బాగా చూపించాడు… సినిమాకి అవసరమైన షాట్స్ మాత్రమే వాడాడు. ఎక్కడ కూడా ఆయన అనవసరపు షాట్స్ ను కంపోజ్ చేయలేదు… ఎడిటర్ ఫస్టాఫ్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…

ఈ సినిమాలో బాగున్నవి…

మ్యూజిక్
సుకాంత ప్రభాస్ యాక్టింగ్
క్లైమాక్స్

ఈ మూవీలో బాగోలేనివి

రొటీన్ కథ
ఫస్టాప్ కొంచెం లాగ్ అయింది…

రేటింగ్ : 2.25 /5

Ukraine attack on Putin: ఉక్రెయిన్ ఊరుకోవడం లేదు.. ఏకంగా పుతిన్ కే.. రష్యాలో కలకలం

Ukraine attack on Putin: యూరప్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఒక దేశం. యూరప్ లో ఉన్న మిగతా దేశాలతో పోల్చి చూస్తే దీని ఆర్థిక సామర్థ్యం తక్కువే. అయినప్పటికీ కొంతకాలంగా రష్యాతో వెన్ను చూపించకుండా పోరాటం చేస్తోంది. అంతటి బలవంతమైన రష్యా ను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ముందు వరుసలో ఉంటారు. ఈయనకు అత్యంత భద్రత వలయం ఉంటుంది. దానిని దాటుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానిని ఉక్రెయిన్ చేసి చూపించింది. నోవ్ గోరోడ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ నివాసంలో పుతిన్ ఉండగా హత్య చేసేందుకు ఉక్రెయిన్ పాల్పడినట్టు రష్యా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను అంత చేయడానికి కుట్ర పన్నినట్టు రష్యా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో బయటికి వెల్లడించలేదు.

ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ పుతిన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అందువల్లే ఆయన విదేశాలలో పర్యటించడం లేదు. దేశంలో కూడా అంతగా కనిపించడం లేదు.. కొన్ని సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పుతిన్ ఎక్కువగా రహస్యమైన ప్రాంతాలలో ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో భూగర్భ బంకర్లలో తలదాచుకుంటున్నారు.

పుతిన్ ఉన్న ప్రాంతాలు మిగతా ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఇంటర్నెట్.. ఫోన్.. పంటి సౌకర్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. డ్రోన్లతో దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు రష్యాలో కీలకమైన మాస్కో నది పక్కన భారీగా బలగాలను మోహరించారు. దేశంలోని అనేక మంది అధికారులకు రక్షణ మరింత పెంచారు. పుతిన్ ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అమెరికన్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొట్టి పారేశాయి.

YSRCP: ఒకరు వైసీపీని వీడితేనే.. మరొకరికి ఛాన్స్.. నో ఆప్షన్

YSRCP: కొన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఉంది. ఇప్పటికీ నియోజకవర్గాల్లో ఇన్చార్జులు యాక్టివ్ కాలేదు. అది ఆ పార్టీకి చాలా లోటు కూడా. ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గంలో వింత పరిస్థితి ఉంది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కారణం వెంకటేష్ పెద్దగా క్రియాశీలకంగా లేరు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి పార్టీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. కరణం బలరాం తో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ బయటకు వెళ్ళిపోతే.. వైసీపీలో చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కానీ కరణం ఫ్యామిలీ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ.. క్రియాశీలకంగా లేరు.

* ఎన్నికలకు ముందే గుడ్ బై..
మొన్నటి ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆమంచి కృష్ణమోహన్. తనకు చీరాల టిక్కెట్ ఇవ్వాలని పట్టు పట్టారు. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. పైగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణ మోహన్ కు పాతికవేల వరకు ఓట్లు వచ్చాయి. వెంకటేష్ దారుణంగా ఓడిపోయాడు. అయితే తన కుమారుడు ఓడిపోవడంతో కరణం బలరాం పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రకాశం కేడర్ ఒప్పుకోకపోవడంతో ఆయన చేరిక విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే చీరాల నుంచి కరణం ఫ్యామిలీ బయటకు వెళ్ళిపోతే తిరిగి వచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కానీ అందుకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోవడం లేదు.

* పట్టున్న నేత..
చీరాలలో మంచి పట్టు ఉంది ఆమంచి కృష్ణమోహన్ కు. తొలిసారిగా ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ టికెట్ ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు. ఎమ్మెల్యేగా గెలవడంతో తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ చంద్రబాబు కరణం బలరాంకు టికెట్ ఇవ్వడంతో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమంచి కృష్ణమోహన్ పై గెలిచారు. జగన్ ప్రభంజనంలో సైతం కృష్ణమోహన్ ఓడిపోవడం అప్పట్లో సంచలనం. అయితే టిడిపి నుంచి గెలిచిన కరణం బలరాం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం అన్నట్టు పరిస్థితి మారింది. అయితే టిడిపి నుంచి వైసీపీలో చేరే క్రమంలో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. ఆ హామీ మేరకు కరణం వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో విభేదించారు కృష్ణమోహన్. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు కరణం వెంకటేష్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. బలరాం తన కుమారుడితో టిడిపిలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. చంద్రబాబు సానుకూలంగా ఉన్న ప్రకాశం జిల్లా క్యాడర్ ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో బలరాం వెళ్లిపోతే వైసీపీలోకి వచ్చేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అయితే బలరాం అలానే కొనసాగుతుండడంతో కృష్ణమోహన్ సైతం కాంగ్రెస్లో ఉండిపోవాల్సి వస్తోంది. అయితే దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం..

Atlantic Ocean Virus: కరోనాను మించి.. సముద్రంలో అంతు చక్కని వైరస్.. ప్రాణాలు పోతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం..

Atlantic Ocean Virus: సముద్రంలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. వాటితో పాటు కంటికి కనిపించని జంతువులు కూడా ఉంటాయి. ఈ భూభాగంలో ఉన్న సముద్రాలలో శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. సముద్రంలో అంతుచిక్కని జంతువులతోపాటు.. అంతకుమించిన రహస్యాలు ఉంటాయి. మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైన వస్తువులు సముద్రం ద్వారా లభిస్తున్నాయి. మనం నిత్యం వాడే ఇంటర్నెట్ కూడా సముద్రం అంతర్భాగంలో ఏర్పాటు చేసిన కేబుల్స్ ద్వారా వస్తూ ఉంటుంది.

కెరటాలు, ‌ అలలు.. విస్తారమైన మత్స్య సంపదకు నిలయమైన సముద్రాలలో ఇప్పుడు వైరస్ కలకలం నెలకొంది. ఈ వైరస్ కు అట్లాంటిక్ సముద్రం కేంద్రంగా మారింది. ఈ సముద్రంలో ప్రయాణం సాగిస్తున్న ఒక క్రుజ్ నౌక లో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది.

అట్లాంటి సముద్రంలోని కానరీ ఐలాండ్స్ కు ప్రయాణిస్తున్న నౌకలో అంట అనే వైరస్ కలకలం రేపుతోంది. 149 మంది ప్రయాణికులు ఈ ఓడలో ప్రయాణిస్తున్నారు. వైరస్ వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. మరో 8 మందికి వైరస్ సోకినట్టు సమాచారం. ఈ ఓడలో ఇద్దరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం ఇంతవరకు లేదు. ఈ ఓడలో దాదాపు 23 దేశాలకు సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు.

ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. తీవ్రమైన వ్యాధులకు గురైన ఎలుకలలో ఈ వైరస్ ఉంటుంది. ఇది అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంటుంది. ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా ఈ వైరస్ దొరికింది. అలసట.. తీవ్రమైన జ్వరం.. విపరీతమైన కండరాల నొప్పి.. భరించలేని దగ్గు.. ఊపిరి తిత్తులలో నీరు చేరడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకితే బతకడం కష్టమని వైద్యులు అంటున్నారు. అయితే ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.