Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీInstagram new feature: ఇన్ స్టా లో తిక్క తిక్క మెసేజ్ లు పెడితే.. పోలీసులు...

Instagram new feature: ఇన్ స్టా లో తిక్క తిక్క మెసేజ్ లు పెడితే.. పోలీసులు తాట తీస్తారు.. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా..

Instagram new feature: ఆమధ్య విజయవాడలో ఉగ్రవాదుల కలకలం నెలకొన్న విషయం తెలిసిందే. కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ జరపడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అంతకుమించిన సందేశాలు పంపించారు. అమాయకులైన యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు వారు సోషల్ మీడియాను వాడుకున్నారు. మన దేశ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలవడంతో.. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విజయవాడలో ఉన్న ఆ ఉగ్రవాదులను పట్టుకొని జైలుకు తరలించారు. సోషల్ మీడియాను మిగతావారు కాలక్షేపం కోసం.. సమాచారం […]

Instagram new feature: ఆమధ్య విజయవాడలో ఉగ్రవాదుల కలకలం నెలకొన్న విషయం తెలిసిందే. కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ జరపడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అంతకుమించిన సందేశాలు పంపించారు. అమాయకులైన యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు వారు సోషల్ మీడియాను వాడుకున్నారు. మన దేశ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలవడంతో.. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విజయవాడలో ఉన్న ఆ ఉగ్రవాదులను పట్టుకొని జైలుకు తరలించారు.

సోషల్ మీడియాను మిగతావారు కాలక్షేపం కోసం.. సమాచారం కోసం వాడుతుంటే.. ఉగ్రవాదులు మాత్రం తమ లక్ష్యాల కోసం వాడుకుంటున్నారు. పిల్లల పట్ల లైంగిక హింస.. ఇతర వేధింపులకు పాల్పడేవారు కూడా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ లో ఈ తరహా వ్యక్తులు పెరిగిపోయారు. గతంలో ఫేస్బుక్.. వాట్సాప్ ను వాడేవారు. ఆ తర్వాత ఈ తరహా వ్యక్తుల ధోరణి మారిపోయింది. ఇంస్టాగ్రామ్ ను ఉపయోగిస్తూ ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించేందుకు ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కు ఈరోజుతో మెటా ముగింపు పలికింది. ఇకపై యూసర్లు పంపే అన్ని మెసేజ్ లను మెటా కంపెనీ చూస్తుంది. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు.. ఉగ్రవాదం.. పిల్లల పట్ల లైంగిక.. ఇతర వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే మెటా గుర్తిస్తుంది. అంతేకాదు, ఈ తరహా సందేహాలు చేసిన వారి సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందిస్తుంది. ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వాడకం చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మరలిపోతున్న నేపథ్యంలో.. మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

దీనిపై అనేక రకాల అభ్యంతరాలు వచ్చినప్పటికీ.. వాటికి మెటా కంపెనీ యాజమాన్యం సరైన స్థాయిలో సమాధానం చెప్పింది. అందువల్లే ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కు ముగింపు పలుకుతున్నట్టు మెటా యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఇంస్టాగ్రామ్ వాడకం సవ్యమైన దిశలో సాగుతుందని మెటా పేర్కొంది. చట్ట వ్యతిరేక వ్యక్తులు.. చీకటి కార్యకలాపాలను సాగించేందుకు ఇకపై ఇంస్టాగ్రామ్ ను వాడబోరని మెటా స్పష్టం చేసింది. ఒకవేళ ఆ తరహా వ్యక్తులు అదే మాదిరిగా కంటెంట్ ను కొనసాగిస్తే సదరు వ్యక్తుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థల అధికారులకు అందిస్తామని మెటా స్పష్టం చేసింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper