Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Koratala Shiva Issue: చిరంజీవి - కొరటాల శివ మధ్య ఏం జరిగింది... వీళ్ళిద్దరిలో...

Chiranjeevi Koratala Shiva Issue: చిరంజీవి – కొరటాల శివ మధ్య ఏం జరిగింది… వీళ్ళిద్దరిలో తప్పెవరిది…

Chiranjeevi Koratala Shiva Issue: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం […]

Chiranjeevi Koratala Shiva Issue: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భారీ సక్స్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తాయా? తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మారాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో చిరంజీవికి భారీ బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఈ సినిమా సమయంలో కొరటాల శివకి చిరంజీవికి మధ్య విభేదాలు తలెత్తయని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక దేవర సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కొరటాల శివ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల పనుల్లో చేయి పెట్టకపోతే అందరికి మంచిది అంటు కొన్ని కామెంట్లు చేశాడు. కొరటాల చిరంజీవిని ఉద్దేశించే ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా ఆచార్య సినిమా కథలో చిరంజీవి బాగా ఇన్వాల్వ్ అయ్యాడని అందువల్లే ఆ సినిమాను అనుకున్న రీతిలో తీయలేదని కొరటాల శివ తన సన్నిహితుల దగ్గర చెప్పారట… నిజానికి రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ మూవీ లో చాలా చిన్నగా ఉండేది. కానీ ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ ను పెంచడం, కొన్ని విషయాల్లో కొరటాల కాంప్రమైజ్ అవ్వడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని అందుకే ఫ్లాప్ అయిందని మరి కొంతమంది కూడా చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper